Translate

11 February, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -147



తెలుగు సుద్దులు…..(147)
.వెఇంటిలోని ధనముయిది నాదియనుచును
           మంటిలోన దాచు మంకు జీవి!
           కొంచ బోడు వెంట గుల్ల కాసును రాదు   
           విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః                       
సంపాదించిన, తనకు లభించిన ధనమును (డబ్బును) నాది, నాది అనే భ్రమలో మూర్ఖుడైన ప్రాణి (మానవుడు-స్త్రీ/పురుషుడు) మట్టిలో పూడ్చిపెట్టుతుంటాడు, దాచుకుంటాడు (పూర్వము ధనాన్ని ఎక్కువగా ఇంటిలో రహస్య ప్రదేశంలో పూడ్చిపెట్టి దాచుకొనేవారు కనుక). కాని, అమాయక జీవి తనవెంట (గుల్ల) లిబ్బిని (డబ్బుల పెట్టి) తీసుకొనిపోడు; కనీసము రాగి కాసు (దమ్మిడిలో సగం-రాగి కానిలో నాలుగోవంతు-పైసా) కూడా అతని వెంటరాదు అని వేమన సత్యాన్ని బోధిస్తున్నారు.   వచ్చేటప్పుడూ రిక్త హస్తలతో వస్తారు, పోయేటప్పుడూ రిక్తహస్తాలతో పోతారు అని వేమన తెలియ పర్చుతున్నారు.  అనవసర తాపత్రయాలకు పోయి, మూర్ఖంగా, లోభి/పిసినారి బ్రతుకు బ్రతకవద్దు అని వేమన హితవు పలుకుతున్నారు. ||08-02-2015||

No comments:

Post a Comment