Translate

23 March, 2017

స్నేహితులు

(స్నే) హితులు.......
నిద్రాణమైనప్పుడు బుర్ర తట్టి
జాగృతినింపి ఆశయకలలకు సాకారం కల్పించేవారే (స్నే)హితులు;
అడుగులు పడనప్పుడు భుజం తట్టి
హస్తాన్నందించి గమ్యం చేర్పించేవారే (స్నే)హితులు;
క్రుంగిపోతున్నప్పుడు వెన్నుతట్టి
ఉత్సాహాన్నినింపేవారే (స్నే)హితులు;
మోదము కరువైనప్పుడు హృదయం తట్టి
ప్రేమాభిమానాలు అడుగకనే పంచేవారే (స్నే)హితులు.

No comments:

Post a Comment