Translate

23 March, 2017

శ్రీహనుమద్విద్య

శ్లో||సాధు పృష్టం త్వయావత్స లోకానాముపకారకం|
సద్య స్సిద్ధికరం వక్ష్యే శృణుష్వావహితోభవ||
శైవవైష్ణవశాక్తార్కగాణపత్యేందుసంభవా:|
న శీఘ్రసిద్ధిదా: ప్రోక్తా శ్చిరకాలఫలప్రదా:||
తతోఽపి పంచవక్త్రస్య మారుతేర్జగదీశితు:|
విద్యా సిద్ధికరీ శీఘ్రం గుర్వనుగ్రహతో మునే||
తాత్పర్యము:
ఓ మైత్రేయా! నీవు అడిగిన ప్రశ్నము లోకోపకారకమైనది. శీఘ్రసిద్ధి నిచ్చు మంత్రరాజమును చెప్పుచుంటిని, వినుమా! శైవములు, శాక్తములు, సౌరములు, వైష్ణవములు, గాణపత్యములు, చాంద్రమంత్రములు అను అనేక మహామంత్రములు కలవు. అవి అన్నియు చిరకలము సేవించిన సుఖకరములగునుగాని, శీఘ్రసిద్ధినిచ్చునవి కావు గనుక సర్వమంత్రసారభూతమైనట్టియు, శీఘ్రసిద్ధినిచ్చునట్టియు కలియుగమునందు సమస్త వాంఛితార్థసిద్దినిచ్చునదియు నగు విద్య శ్రిహనుమద్విద్యయే కాని మరి వేరు లేదు. (పరాశర మహాముని)
(బ్ర.శ్రీ.శిష్ట్లా చంద్రమౌళి శాస్త్రిగారి శ్రీ హనుమద్ర్వతజయంతి, ప్రదక్షిణ కల్పము)

No comments:

Post a Comment