కవితాభూషణ, విద్వత్కవిశేఖర, కళాప్రపూర్ణ శ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారు రచించింన “శ్రీ భద్రాద్రిరామ శతకము” (1987)
కవిపరిచయము:
బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు సాహితీలోకములో సుప్రసిద్ధులు.
శ్రీ శాస్త్రిగారి ఇతర రచనలు:
శ్రీవేంకటేశ్వరశతకము, రాయడు శాస్త్రి యశశ్చంద్రిక, మునిత్రయ చరిత్రము, శంకరవిజయము, మదాలసా విలాసము, ఆంధ్రరాజ్యేందిర, వరదగురు యశోవికాశము, జీమూతవాహన చరిత్రము, శబర శంకర విలాసము, శ్రీనాథతారావళి, పోతన, విద్యారణ్య ఛరిత్రము, ప్రభావతీ ప్రద్యుమ్న వ్యాఖ్యానము, మనుచరిత్ర వ్యాఖ్యానము.
శ్రీవేంకటేశ్వరశతకము, రాయడు శాస్త్రి యశశ్చంద్రిక, మునిత్రయ చరిత్రము, శంకరవిజయము, మదాలసా విలాసము, ఆంధ్రరాజ్యేందిర, వరదగురు యశోవికాశము, జీమూతవాహన చరిత్రము, శబర శంకర విలాసము, శ్రీనాథతారావళి, పోతన, విద్యారణ్య ఛరిత్రము, ప్రభావతీ ప్రద్యుమ్న వ్యాఖ్యానము, మనుచరిత్ర వ్యాఖ్యానము.
“శ్రీ భద్రాద్రిరామశతకము” విశేష రచన గురింఛి:
1930 సంవత్సరములో, శ్రీ శాస్త్రిగారి 34 ఏట, శ్రీరామనవమి పర్వదినమున వారి అర్ధాంగి, “కవులు గడియకు వందపద్యములు చెప్పుదుమని, దినమునకొక ప్రబంధము రచింతుమని ప్రతిజ్ఞలు చేయుదురుగదా, ఈ పుణ్యదినమున శ్రీరామచంద్రునిపై ఒక శతమును రచింపరాదా” అని కోరగా శ్రీశాస్త్రిగారు ఉపవాసములోనే “భద్రగిరిధామ! కరుణాసముద్రరామ!” అనే మకుటంతో 98 సీసపద్యములను రచించి, సాయంసమయానికి నీరసముతో కన్నులుతిరిగి పడిపోయిరట. తదనంతరము, తక్కిన 12 పద్యములను పూర్తిచేసి శ్రీరామచంద్రునకు అర్పించినారని శతకములో ముందు మాటగా (నివేదనము) శ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజులు శర్మగారు తెలిపినారు.
1930 సంవత్సరములో, శ్రీ శాస్త్రిగారి 34 ఏట, శ్రీరామనవమి పర్వదినమున వారి అర్ధాంగి, “కవులు గడియకు వందపద్యములు చెప్పుదుమని, దినమునకొక ప్రబంధము రచింతుమని ప్రతిజ్ఞలు చేయుదురుగదా, ఈ పుణ్యదినమున శ్రీరామచంద్రునిపై ఒక శతమును రచింపరాదా” అని కోరగా శ్రీశాస్త్రిగారు ఉపవాసములోనే “భద్రగిరిధామ! కరుణాసముద్రరామ!” అనే మకుటంతో 98 సీసపద్యములను రచించి, సాయంసమయానికి నీరసముతో కన్నులుతిరిగి పడిపోయిరట. తదనంతరము, తక్కిన 12 పద్యములను పూర్తిచేసి శ్రీరామచంద్రునకు అర్పించినారని శతకములో ముందు మాటగా (నివేదనము) శ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజులు శర్మగారు తెలిపినారు.
బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారికి పాదాభివందనములర్పించుకొంటూ వారి పద్యములను నా ఈ బ్లాగు ద్వారా శతకప్రియులకు అందించుచున్నాను.
సీ. శ్రీ జానకీమనస్సేవధిపాలక!
దశరథచిరతపోధర్మఫలమ!
గాధేయకష్టసాగరతారణోడుప!
సౌందర్యజితకోటిజలజబాణ!
వాలికాదంబినీజాలప్రభంజన!
హనుమన్మయూరవర్షాభ్ర ఖండ!
శరభంగముక్తి దాశ్చర్యమంత్రోత్తమ!
సుగ్రీవదు:ఖసంశోషణార్క!
తే.గీ. నేడు శ్రీరామనవమి నీ నిర్మలాఖ్య
శతక మొకటి రచించి నీ చరణయుగళి
నుంచి భవవార్ధి దాఁట నూహించుచుంటి
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (1)
దశరథచిరతపోధర్మఫలమ!
గాధేయకష్టసాగరతారణోడుప!
సౌందర్యజితకోటిజలజబాణ!
వాలికాదంబినీజాలప్రభంజన!
హనుమన్మయూరవర్షాభ్ర ఖండ!
శరభంగముక్తి దాశ్చర్యమంత్రోత్తమ!
సుగ్రీవదు:ఖసంశోషణార్క!
తే.గీ. నేడు శ్రీరామనవమి నీ నిర్మలాఖ్య
శతక మొకటి రచించి నీ చరణయుగళి
నుంచి భవవార్ధి దాఁట నూహించుచుంటి
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (1)
సీ. కారణజన్మ! నిన్నేరీతి “సోఽయ”మ్మ
టంచు ముందుగ నిర్ణయించు వాఁడ
నిర్గుణుండవు భవన్నీరంధ్ర సంవిదా
కృతి నెట్లు తెలిసి వర్ణించు వాఁడ
సకలచరాచర స్థానుండ వైన నీ
కిదియ తా వని యెట వెదకు వాఁడ
నిర్వికల్పుఁడ! యె ట్లణీయమౌ బుద్ధి వే
దాంతవేద్యుని నిన్ను నరయు వాఁడ
తే.గీ. నబ్ధి కేతాము నెత్తినట్లమితసుగుణ
నిలయుఁ డైనట్టి ని న్నెట్టు పలుకు వాఁడ
నా తెగువఁ గాంచి యొక నవ్వు నవ్వుకొందె!
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (2)
సీ. గుహఁడు రాతిరిఁ బండుకొనఁ జిగురాకుల
పానుపు వేసి యర్పణము సేసె
శబరి నిశ్చలభక్తి సరసఫలహార
ముల తోడ నాతిథ్యమును ఘటించె
నుడుత యథాశక్తినుదధి సేతువుఁ గట్టు
తఱిఁ దోఁక నిసుము మాత్రమ్మ చల్లె
సంపాతి త్వత్కథాశ్రవణోదితాక్షుఁడై
సీత చరిత్ర లక్షించి చెప్పె
తే.గీ. నట్టులే నేను నాచేత నైన కైత
వర్ణనము సేయుచుంటి కైవల్య మొందఁ
జంద్రునకు నూలిప్రోఁ గనుచుంద్రు వినవె?
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (3)
టంచు ముందుగ నిర్ణయించు వాఁడ
నిర్గుణుండవు భవన్నీరంధ్ర సంవిదా
కృతి నెట్లు తెలిసి వర్ణించు వాఁడ
సకలచరాచర స్థానుండ వైన నీ
కిదియ తా వని యెట వెదకు వాఁడ
నిర్వికల్పుఁడ! యె ట్లణీయమౌ బుద్ధి వే
దాంతవేద్యుని నిన్ను నరయు వాఁడ
తే.గీ. నబ్ధి కేతాము నెత్తినట్లమితసుగుణ
నిలయుఁ డైనట్టి ని న్నెట్టు పలుకు వాఁడ
నా తెగువఁ గాంచి యొక నవ్వు నవ్వుకొందె!
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (2)
సీ. గుహఁడు రాతిరిఁ బండుకొనఁ జిగురాకుల
పానుపు వేసి యర్పణము సేసె
శబరి నిశ్చలభక్తి సరసఫలహార
ముల తోడ నాతిథ్యమును ఘటించె
నుడుత యథాశక్తినుదధి సేతువుఁ గట్టు
తఱిఁ దోఁక నిసుము మాత్రమ్మ చల్లె
సంపాతి త్వత్కథాశ్రవణోదితాక్షుఁడై
సీత చరిత్ర లక్షించి చెప్పె
తే.గీ. నట్టులే నేను నాచేత నైన కైత
వర్ణనము సేయుచుంటి కైవల్య మొందఁ
జంద్రునకు నూలిప్రోఁ గనుచుంద్రు వినవె?
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (3)
సీ. గగన వీథిఁ ద్రిశంకుఁగాఁపు వెట్టిన మౌని
ని మహత్త్వ మెఱంగునేర్పు వడసెఁ
గంటఁ ద్రయీగిరుల్ గనుఁగొన్న ముని నీ య
మేయప్రభావ మర్మిలి నెఱింగె
వాతాపిదమనవిఖ్యాతుఁడౌ తపసి నీ
యనుభావసర్వస్వ మాకళించె
నీ పుట్టు వెంచి యెన్నియొ తరంబులఁ బురో
ధనుఁడైన మౌని నీతత్త్వ మరసె
తే.గీ. నంతటి మహనుభావుల కలవి యైన
నీ మహత్త్వము చెప్పఁగనేర్తు మనుట
యస్మదాదుల మూఢత్వ మగును గాదె!
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (4)
సీ. రామాయణములు నీ నామమహత్వంబు
చాటు నిత్యంబు నుచ్చావచముగ
శతకంబులో భవత్సగుణనిర్గుణమూర్తు
లమితరీతుల నుతు లాచరించు
నాటకంబులు నీ యనంతకల్యాణగు
ణంబుల నైద్రియికంబు సేయుఁ
గావ్యముల్ రసము లొల్కఁగ ని యశంబును
గానం బొనర్చు వాఙ్మధురిమమున
తే.గీ. నట్టి నీ గుణకీర్తన మాచరింపఁ
బూను నావంటి యల్పజ్ఞుఁడైన మనుజుఁ
డే మొనర్పఁగఁ జాలు గ్రహింపు ప్రీతి
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (5)
చాటు నిత్యంబు నుచ్చావచముగ
శతకంబులో భవత్సగుణనిర్గుణమూర్తు
లమితరీతుల నుతు లాచరించు
నాటకంబులు నీ యనంతకల్యాణగు
ణంబుల నైద్రియికంబు సేయుఁ
గావ్యముల్ రసము లొల్కఁగ ని యశంబును
గానం బొనర్చు వాఙ్మధురిమమున
తే.గీ. నట్టి నీ గుణకీర్తన మాచరింపఁ
బూను నావంటి యల్పజ్ఞుఁడైన మనుజుఁ
డే మొనర్పఁగఁ జాలు గ్రహింపు ప్రీతి
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (5)
సీ. వేదాంత సూక్తుల వెలుఁగొందు నీ రూపు
నీరసకవిత వర్ణింపఁ గలదె?
వాఙ్మనసాతీతవైభవుండ వటంచు
మునులె తపింప నే ననఁగ నెంత?
తుంబురునారదాదులె భవద్గుణగాన
కలన జంకఁగఁ బాడఁగలనె నిన్ను?
నీ మాయ గెలువఁగా నేరక బ్రహ్మ “దా
సోఽహ” మ్మనంగ మేమనఁగ నెంత?
తే.గీ. మనుజుఁ డజ్ఞుండు దయనీయుఁ డనుఁగుబంటు
వీఁ డటంచుఁ దలంచి కాపాడ వేని
నాకు దిక్కేది? నా నైపుణం బ దెంత?
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (6)
నీరసకవిత వర్ణింపఁ గలదె?
వాఙ్మనసాతీతవైభవుండ వటంచు
మునులె తపింప నే ననఁగ నెంత?
తుంబురునారదాదులె భవద్గుణగాన
కలన జంకఁగఁ బాడఁగలనె నిన్ను?
నీ మాయ గెలువఁగా నేరక బ్రహ్మ “దా
సోఽహ” మ్మనంగ మేమనఁగ నెంత?
తే.గీ. మనుజుఁ డజ్ఞుండు దయనీయుఁ డనుఁగుబంటు
వీఁ డటంచుఁ దలంచి కాపాడ వేని
నాకు దిక్కేది? నా నైపుణం బ దెంత?
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (6)
సీ. పాయసపాత్రమర్పణ సేసి నట్టి ప్రా
జాపత్య పురుషహస్తమున నుండి
కోసలసుత గర్భకుహరసీమను నవ
మాసముల్ పెరుఁగుచు మసలి యుంటి
దశరథజనకభూధవదివ్యమందిరం
బులు పావనంబులై యలర మసలి
కైక యిష్టావాప్తికై పదునా ల్గేండ్లు
సాంద్రాటవులఁ బర్ణశాల నుండి
తే.గీ. వాలిఁ ద్రుంచి వధించి రావణు నయోధ్యఁ
బట్టమును గట్టుకొని యుంటి ప్రాభవమున
నిన్నిటిని భద్రగిరి దలదన్నె నుండ
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (7)
జాపత్య పురుషహస్తమున నుండి
కోసలసుత గర్భకుహరసీమను నవ
మాసముల్ పెరుఁగుచు మసలి యుంటి
దశరథజనకభూధవదివ్యమందిరం
బులు పావనంబులై యలర మసలి
కైక యిష్టావాప్తికై పదునా ల్గేండ్లు
సాంద్రాటవులఁ బర్ణశాల నుండి
తే.గీ. వాలిఁ ద్రుంచి వధించి రావణు నయోధ్యఁ
బట్టమును గట్టుకొని యుంటి ప్రాభవమున
నిన్నిటిని భద్రగిరి దలదన్నె నుండ
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (7)
సీ. భద్రాద్రిరాజంబె పాలవెల్లిగ స్వర్ణ
డోలావతి తరంగమాలికలుగ
హోంబట్టు విరిసెజ్జ యురగనయకుఁడుగ
నఖిల భక్తులు నారదాదులుగను
సతము వాయని భూమిజాతయే లక్ష్మిగ
వివిధవాహనములు విహగపతిగఁ
బచ్చల పదక మేర్పడిన కౌస్తుభముగ
నిత్యమౌనము యోగనిద్ర గాఁగ
తే.గీ. భూతలము నందు వైకుంఠపురనివాస
సుఖము లెఱిఁగింప వెలయు విష్ణుఁడవ యనుచుఁ
దలఁచి వందన మిడుదు సంస్తవ మొనర్తు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (8)
డోలావతి తరంగమాలికలుగ
హోంబట్టు విరిసెజ్జ యురగనయకుఁడుగ
నఖిల భక్తులు నారదాదులుగను
సతము వాయని భూమిజాతయే లక్ష్మిగ
వివిధవాహనములు విహగపతిగఁ
బచ్చల పదక మేర్పడిన కౌస్తుభముగ
నిత్యమౌనము యోగనిద్ర గాఁగ
తే.గీ. భూతలము నందు వైకుంఠపురనివాస
సుఖము లెఱిఁగింప వెలయు విష్ణుఁడవ యనుచుఁ
దలఁచి వందన మిడుదు సంస్తవ మొనర్తు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (8)
సీ. భవదీయ జన్మ హేతువున వసంతర్తు
వఖిలజనానందమై తలిర్చె
భవదీయ జన్మ హేతువుననే చైత్రంబు
ప్రాణకోటికి సుభాపాది యయ్యె
భవదీయ జన్మ హేతువునన తచ్ఛుద్ధ
నవమి యెల్లరకుఁ బండువగ నయ్యె
భవదీయ జన్మ హేతువునఁ బునర్వసు
వుత్తమోత్తమ మయ్యె నుడు గణమున
తే.గీ. నీవు పుట్ట నయోధ్య నిర్ణిద్రవిభవ
శోభ నలరారె ధర్మంబు సుప్రతిష్ఠి
తముగ వసుమతి రామరాజ్యముగ నెగడె
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (9)
వఖిలజనానందమై తలిర్చె
భవదీయ జన్మ హేతువుననే చైత్రంబు
ప్రాణకోటికి సుభాపాది యయ్యె
భవదీయ జన్మ హేతువునన తచ్ఛుద్ధ
నవమి యెల్లరకుఁ బండువగ నయ్యె
భవదీయ జన్మ హేతువునఁ బునర్వసు
వుత్తమోత్తమ మయ్యె నుడు గణమున
తే.గీ. నీవు పుట్ట నయోధ్య నిర్ణిద్రవిభవ
శోభ నలరారె ధర్మంబు సుప్రతిష్ఠి
తముగ వసుమతి రామరాజ్యముగ నెగడె
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (9)
సీ. తపము మెచ్చి వరప్రదానమ్మున నలర్చు
బ్రహ్మ కసాధ్యుఁడే రావణుండు
జిష్ణుఁడై త్రిజగతీశిత యైన దేవతా
ప్రభున కసాధ్యుఁడే రావణుండు
ప్రత్యక్ష దేవతాప్రథ విరాజిలు విక
ర్తనున కసాధ్యుఁడే రావణుండు
కాలకాలాఖ్య లోకఖ్యాతుఁ డైన ధూ
ర్జటికి నసాధ్యుఁడే రావణుండు
తే.గీ. అనుచు ముక్కోటి దేవత లడలిపోయి
బిక్క మొగములు వెట్టి నీదిక్కు సేర
మనుజుఁడవై పుట్టితివి రావణుని వధింప
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (10)
బ్రహ్మ కసాధ్యుఁడే రావణుండు
జిష్ణుఁడై త్రిజగతీశిత యైన దేవతా
ప్రభున కసాధ్యుఁడే రావణుండు
ప్రత్యక్ష దేవతాప్రథ విరాజిలు విక
ర్తనున కసాధ్యుఁడే రావణుండు
కాలకాలాఖ్య లోకఖ్యాతుఁ డైన ధూ
ర్జటికి నసాధ్యుఁడే రావణుండు
తే.గీ. అనుచు ముక్కోటి దేవత లడలిపోయి
బిక్క మొగములు వెట్టి నీదిక్కు సేర
మనుజుఁడవై పుట్టితివి రావణుని వధింప
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (10)
సీ. నీ తండ్రి చిత్తము నిష్కళ మైపోయెఁ
గాని నీ మోము సత్కళల వెలసె
నీ తండ్రి కన్నుల నీరు గ్రమ్మెను గాని
నీ చూపు పండు వెన్నెలలఁ జిమ్మె
నీ తండ్రి పదములు నీరసంపడెఁ గాని
నీ పదంబులు పోవనే కడంగె
నీ తండ్రి నోట నింతేఁ బల్కు లేదయ్యె
గాని నీనోటఁ బూదేనె లొలికె
తే.గీ. యజ్ఞమును గావ గాధేయుఁ డరుగుదెంచి
నిన్నుఁ బంపు మనంగ నాఁ డెన్ననయ్యె
నహహ! యాజన్మశూరుండ వనెడు బిరుదు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (11)
గాని నీ మోము సత్కళల వెలసె
నీ తండ్రి కన్నుల నీరు గ్రమ్మెను గాని
నీ చూపు పండు వెన్నెలలఁ జిమ్మె
నీ తండ్రి పదములు నీరసంపడెఁ గాని
నీ పదంబులు పోవనే కడంగె
నీ తండ్రి నోట నింతేఁ బల్కు లేదయ్యె
గాని నీనోటఁ బూదేనె లొలికె
తే.గీ. యజ్ఞమును గావ గాధేయుఁ డరుగుదెంచి
నిన్నుఁ బంపు మనంగ నాఁ డెన్ననయ్యె
నహహ! యాజన్మశూరుండ వనెడు బిరుదు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (11)
సీ. అడు గెత్తి యిల మోపినంత మాత్రన యఱ
కా ళ్ళెఱ్ఱవాఱుచుఁ గంది పోవ
నర్కకర్కశదీప్తు లంతంతఁ దీక్ష్ణమై
కమచిన మోమునఁ జెమట లూర
నాఁకటి కొక్కింత యాలస్యముగఁ గంద
మూలముల్ దొరకిన సోలుచుండి
నిద్ర వోవఁగ నొక్క నిముసంబు జాగైన
ముద్దొల్కు కనుదోయి మూఁత వడఁగఁ
తే.గీ. గుశిక సుతు వెంట నంటి యేఁగుచు నరణ్య
సరణి నీ చూపినట్టి శైశవవిలాస
మెంత వర్ణించినను మది తృప్తి సనదు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (12)
కా ళ్ళెఱ్ఱవాఱుచుఁ గంది పోవ
నర్కకర్కశదీప్తు లంతంతఁ దీక్ష్ణమై
కమచిన మోమునఁ జెమట లూర
నాఁకటి కొక్కింత యాలస్యముగఁ గంద
మూలముల్ దొరకిన సోలుచుండి
నిద్ర వోవఁగ నొక్క నిముసంబు జాగైన
ముద్దొల్కు కనుదోయి మూఁత వడఁగఁ
తే.గీ. గుశిక సుతు వెంట నంటి యేఁగుచు నరణ్య
సరణి నీ చూపినట్టి శైశవవిలాస
మెంత వర్ణించినను మది తృప్తి సనదు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (12)
సీ. ఇంద్రనీలము చెంత నింపారు పద్మరా
గము వోలె నిర్వురంగములు మెఱయ
నన్నా! యనుచుఁ దమ్ముఁడా యంచు నన్యోన్య
మును బిల్చుకొంచు సమ్ముదితు లగుచు
ముని చెప్పు కథల నూఁకొనుచుఁ దదుభయపా
ర్శ్వము లత్తి మెత్తన చనుచుఁ ద్రోవ
నెది యేని గనుపట్ట నిది యేమి? మునినాథ!
యనుచు నిద్దరు నేకమై యడుగుచు
తే.గీ. వచ్చు నిను భ్రాతఁ గనిఁ బారవశ్య మొంది
మునులు జోహారు లొనరింప వనులఁ గుశిక
సుతు ననుసరించు మీ రూపు నుతు లొనర్తు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (13)
గము వోలె నిర్వురంగములు మెఱయ
నన్నా! యనుచుఁ దమ్ముఁడా యంచు నన్యోన్య
మును బిల్చుకొంచు సమ్ముదితు లగుచు
ముని చెప్పు కథల నూఁకొనుచుఁ దదుభయపా
ర్శ్వము లత్తి మెత్తన చనుచుఁ ద్రోవ
నెది యేని గనుపట్ట నిది యేమి? మునినాథ!
యనుచు నిద్దరు నేకమై యడుగుచు
తే.గీ. వచ్చు నిను భ్రాతఁ గనిఁ బారవశ్య మొంది
మునులు జోహారు లొనరింప వనులఁ గుశిక
సుతు ననుసరించు మీ రూపు నుతు లొనర్తు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (13)
సీ. గంగావతరణప్రసంగ మాలించి త
జ్ఝరి యంతగాఁ బ్రమోదమునఁ బొంగి
యంగజసంహార మామూల మాలించి
తద్దాహమునకు సంతాప మంది
శరజన్మజన్మసంశ్రవణమ్మునను నుబ్బి
యను పద మ్మాశ్చర్యమున మునింగి
గౌతమాంతః పురగాథ యాకర్ణించి
తద్భావముక్తికై దయ దలంచి
తే.గీ. పసితనంబున లక్ష్మణ పార్శ్వగామి
వగుచు గాథేయు వెంట నీ వరుగు నాఁటి
చిత్రకృత్యంబు లెంచ నచ్చెరువు పొడుము
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (14)
జ్ఝరి యంతగాఁ బ్రమోదమునఁ బొంగి
యంగజసంహార మామూల మాలించి
తద్దాహమునకు సంతాప మంది
శరజన్మజన్మసంశ్రవణమ్మునను నుబ్బి
యను పద మ్మాశ్చర్యమున మునింగి
గౌతమాంతః పురగాథ యాకర్ణించి
తద్భావముక్తికై దయ దలంచి
తే.గీ. పసితనంబున లక్ష్మణ పార్శ్వగామి
వగుచు గాథేయు వెంట నీ వరుగు నాఁటి
చిత్రకృత్యంబు లెంచ నచ్చెరువు పొడుము
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (14)
సీ. ఆఁడుదానిని జంపు టన్యాయ మగు నంచు
దెలుపు నప్పటి నీ విధేయ మహిమ
కౌశికోక్త న్యాయగతిఁ జిత్త మల్లలఁ
బదిలించుకొను నాఁటి భక్తిగరిమ
తాటకరవము కర్ణాటమై నంతన
జనియించు నాఁటి యుత్సాహమహిమ
మెదిరి కేతెంచిన తదుపరి రవియట్ల
వెలిఁగిన నాఁటి నీ వీరమహిమ
తే.గీ. వినిన నుప్పొంగి పోదుమే కనిన నెంత?
పరవశుల మౌదుమో నాఁటి తరుణ మందుఁ
బుట్టిన శరీరు లెంతటి పుణ్యు లౌర!
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (15)
దెలుపు నప్పటి నీ విధేయ మహిమ
కౌశికోక్త న్యాయగతిఁ జిత్త మల్లలఁ
బదిలించుకొను నాఁటి భక్తిగరిమ
తాటకరవము కర్ణాటమై నంతన
జనియించు నాఁటి యుత్సాహమహిమ
మెదిరి కేతెంచిన తదుపరి రవియట్ల
వెలిఁగిన నాఁటి నీ వీరమహిమ
తే.గీ. వినిన నుప్పొంగి పోదుమే కనిన నెంత?
పరవశుల మౌదుమో నాఁటి తరుణ మందుఁ
బుట్టిన శరీరు లెంతటి పుణ్యు లౌర!
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (15)
సీ. కూఁకటి జుట్టుతోఁ గొమరారు మోమున
రౌద్రరసం బుదగ్రముగ నుబుక
జువ్వున ధనువు వంచుచు మౌని దత్తాస్త్ర
రాజిచే రోదోంఽతరమ్ము గ్రమ్మి
బహుకాలముగ మునీశ్వరయాగభంజన
చతురు లైనట్టి రాక్షసులఁ గెడపి
భూమికి జేనెఁడై పొలుపొందు రూపునఁ
దపసుల కెల్ల మోదము ఘటించి
తే.గీ. మృతు నొనర్చి సుబాహు మారీచు జల్ధి
నడుమఁ బడఁ గూల్చి కౌశికానందపూర్వ
కోపగూహనగౌరవ మొందఁ గంటి
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (16)
రౌద్రరసం బుదగ్రముగ నుబుక
జువ్వున ధనువు వంచుచు మౌని దత్తాస్త్ర
రాజిచే రోదోంఽతరమ్ము గ్రమ్మి
బహుకాలముగ మునీశ్వరయాగభంజన
చతురు లైనట్టి రాక్షసులఁ గెడపి
భూమికి జేనెఁడై పొలుపొందు రూపునఁ
దపసుల కెల్ల మోదము ఘటించి
తే.గీ. మృతు నొనర్చి సుబాహు మారీచు జల్ధి
నడుమఁ బడఁ గూల్చి కౌశికానందపూర్వ
కోపగూహనగౌరవ మొందఁ గంటి
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (16)
సీ. శివు విల్లు విఱిచిన చేత సీతాదేవి
చెట్ట వట్టితివి రంజిల్ల జగము
మహిపుత్రి మెడఁగట్టు మంగళసూత్రాన
విజయలక్ష్మికి ముడి వెట్టి తయ్య
తాపసాశీరక్షతల తోడ శిరసావ
వహించితి జానకీమృదుపదంబు
జనకుండు దశరథుండును దేహ మెల్ల క
న్నులుగఁ గన్గొన లక్ష్మికలన గంటి
తే.గీ. వట్టి కళ్యాణధాము ని న్నాత్మ నిలుప
నాఁటి నీ పెండ్లి భక్తు లేటేట భద్ర
గిరిని గావించి సేవించి మురియుచుంద్రు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (17)
చెట్ట వట్టితివి రంజిల్ల జగము
మహిపుత్రి మెడఁగట్టు మంగళసూత్రాన
విజయలక్ష్మికి ముడి వెట్టి తయ్య
తాపసాశీరక్షతల తోడ శిరసావ
వహించితి జానకీమృదుపదంబు
జనకుండు దశరథుండును దేహ మెల్ల క
న్నులుగఁ గన్గొన లక్ష్మికలన గంటి
తే.గీ. వట్టి కళ్యాణధాము ని న్నాత్మ నిలుప
నాఁటి నీ పెండ్లి భక్తు లేటేట భద్ర
గిరిని గావించి సేవించి మురియుచుంద్రు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (17)
సీ. బ్రాహ్మణుం డీతండు పరిభవింప నధర్మ
మని తొల్త మోడ్చితి హస్త యుగము
నదె పనిగా నరుంతుదభాష లాడంగ
వెలసితి మూర్తిమద్వీర మనఁగ
నేది చూతము దీని నెక్కిడు మని ధను
స్సు నొసంగ వెలిఁగితి సూర్యుఁ డట్లు
ఎక్కు వెట్టితి లక్ష్య మేది చూపు మటంచుఁ
గల్పాంతనిటలాక్షు కరణి మెఱసి
తే.గీ. తవనిసురుఁడ క్షమింపు మ న్నంతఁ జంద
న మ్మయితి భార్గవుని ధాటి నాఁడు చిత్ర
మిట్టి స్వాధీనచిత్తుఁ డిం కెవఁడు గలఁడు?
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (18)
మని తొల్త మోడ్చితి హస్త యుగము
నదె పనిగా నరుంతుదభాష లాడంగ
వెలసితి మూర్తిమద్వీర మనఁగ
నేది చూతము దీని నెక్కిడు మని ధను
స్సు నొసంగ వెలిఁగితి సూర్యుఁ డట్లు
ఎక్కు వెట్టితి లక్ష్య మేది చూపు మటంచుఁ
గల్పాంతనిటలాక్షు కరణి మెఱసి
తే.గీ. తవనిసురుఁడ క్షమింపు మ న్నంతఁ జంద
న మ్మయితి భార్గవుని ధాటి నాఁడు చిత్ర
మిట్టి స్వాధీనచిత్తుఁ డిం కెవఁడు గలఁడు?
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (18)
సీ. తండ్రి కోర్కి సుతుండె దరిఁ జేర్ప వలెఁ గాదె
యని పంక్తిరథుని నూరార్చి భక్తి
నమ్మ! నాకు సుఖాస్పద మ్మగు వని నుండఁ
గనికరించితి వంచుఁ గైక కెఱఁగి
తల్లి! నా కై దురపిల్లకు మనుచుఁ గౌ
సల్య కన్నీరు హస్తమున నొత్తి
నేను వత్తును మఱినే వత్తు నని సీత
సౌమిత్రియును వేఁడ సమ్మతించి
తే.గీ. హోరు మనుచు నయోధ్యలో వార లెల్ల
రేడ్చుచును వెంట రాఁ గానకేఁగు నీస్వ
రూప మెంచంగ గుండె నీరుగ స్రవించు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (19)
యని పంక్తిరథుని నూరార్చి భక్తి
నమ్మ! నాకు సుఖాస్పద మ్మగు వని నుండఁ
గనికరించితి వంచుఁ గైక కెఱఁగి
తల్లి! నా కై దురపిల్లకు మనుచుఁ గౌ
సల్య కన్నీరు హస్తమున నొత్తి
నేను వత్తును మఱినే వత్తు నని సీత
సౌమిత్రియును వేఁడ సమ్మతించి
తే.గీ. హోరు మనుచు నయోధ్యలో వార లెల్ల
రేడ్చుచును వెంట రాఁ గానకేఁగు నీస్వ
రూప మెంచంగ గుండె నీరుగ స్రవించు
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (19)
సీ. సిద్ధమౌ పట్టాభిషేకమ్ము విఘటించు
కైకపై నింత యాగ్రహము లేదు
నిష్కారణముగ వనికి నేఁగు మని పల్కు
జనకు నాజ్ఞ కొకింత వనట లేదు
గర్భవాసప్రేమఁ గౌసల్య విలపింప
స్వాంత మం దింత చంచలత లేదు
భరతుండు రాజ్య మర్పణ సేయ నడుగులఁ
బడ ధర్మపథ మింత విడువలేదు
తే.గీ. అహహ! నీ శాంతి దాంతి స్థైర్యంబు ధర్మ
మే మనఁగ వచ్చు నినుఁ బోల్ప నేది మచ్చు?
జగదతీతచరిత్ర! భూజాకళత్ర!
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (20)
కైకపై నింత యాగ్రహము లేదు
నిష్కారణముగ వనికి నేఁగు మని పల్కు
జనకు నాజ్ఞ కొకింత వనట లేదు
గర్భవాసప్రేమఁ గౌసల్య విలపింప
స్వాంత మం దింత చంచలత లేదు
భరతుండు రాజ్య మర్పణ సేయ నడుగులఁ
బడ ధర్మపథ మింత విడువలేదు
తే.గీ. అహహ! నీ శాంతి దాంతి స్థైర్యంబు ధర్మ
మే మనఁగ వచ్చు నినుఁ బోల్ప నేది మచ్చు?
జగదతీతచరిత్ర! భూజాకళత్ర!
భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (20)
No comments:
Post a Comment