కేశవ నామాల మేలుకొలుపులు
౧.కేశవ యని నిన్ను వాసిగ భక్తులు
వర్ణించుచున్నారు మేలుకో,
వాసవవందిత వసుదేవనందన
వైకుంఠవాసుడ మేలుకో, కృష్ణా మేలుకో||
2.నారాయణా నిన్ను నమ్మిన భక్తుల
కరుణ బ్రోతువు గాని మేలుకో,
శరణన్న రక్షణ బిరుదు నీకున్నది
శశిధరసన్నుత మేలుకో, కృష్ణా మేలుకో||
౩.మాధవ యని నిన్ను యాదవు లందరు
మమతగొల్తురు దేవ మేలుకో,
చల్లని చూపుల మెల్లగ బరపెడు
నల్లని నాస్వామి మేలుకో, కృష్ణా మేలుకో||
౪.గోవిందా యని నిన్ను గోపికలందరు
గోపాల యని పిల్తురు మేలుకో,
వెన్న ముద్దలు చల్దివేడుకగ తిన్నట్టి
వేణు గోపాలుడవు మేలుకో, కృష్ణా మేలుకో||
౫.విష్ణురూపము దాల్చి విభవము నగుపించు
విష్ణు స్వరూపుడా మేలుకో,
దుష్టసంహారక దురితము లెడబాపు
సృష్టి సంరక్షక మేలుకో, కృష్ణా మేలుకో||
౬.మధుసూదనా నీవు మగువతోడుత గూడి
మరచి నిద్రించేవు మేలుకో,
ఉదయార్క బింబము ఉదయించు వేళాయె
వనరుహలోచన మేలుకో, కృష్ణా మేలుకో||
౭.త్రివిక్రమా యని త్రిదశాదు లందరు
స్తుతియించుచున్నారు మేలుకో,
శుక్రగ్రహములు సుందరరూపము
చూడగోరుదు రదె మేలుకో, కృష్ణా మేలుకో||
౮.వామనరూపాన భూదాన మడిగిన
పుండరీకాక్షుఁడా మేలుకో,
బలిని నీ పాదాన బధించి వేసిన
కశ్యపనందన మేలుకో, కృష్ణా మేలుకో||
౯.శ్రీధర, గోవింద, రాధామనోహర
యాదవనాయక మేలుకో,
రాధావధూమణి రాజిల్క నంపింది
సందేహము విని మేలుకో, కృష్ణా మేలుకో||
౧0.హృషీకేశ దర్సింప ఋషులెల్ల
వచ్చి కూర్చున్నారు మేలుకో,
వచ్చినవారికి వరములు కావలే
వైకుంఠ వాసుడ మేలుకో, కృష్ణా మేలుకో||
౧౧.పద్మనాభ నీదు పత్నులు వడి
వచ్చి కూర్చున్నారు మేలుకో,
పరమ తారకమైన పావననామంబు
పాడుచు వచ్చిరి మేలుకో, కృష్ణా మేలుకో||
౧2.దామోదరా యని దేవత లందరు
దర్శింపవచ్చిరి మేలుకో,
భూమిభారము మాన్ప బుధుల బ్రోవగవలె
భూతాంతరమణుడా మేలుకో, కృష్ణా మేలుకో||
౧3.సంకర్షణా నీవు శత్రుల నదలింప
సమయమై యున్నది మేలుకో,
పంకజాదులు నీదు పావననామంబు
పాడుచు వచ్చిరి మేలుకో, కృష్ణా మేలుకో||
౧4.వాసుదేవా నీకు భూసురపత్నులు
భుజియింప దెచ్చిరి మేలుకో,
భాసురంబుగ యాగ పాలనకొఱకునై
ప్రార్ధించుచున్నారు మేలుకో, కృష్ణా మేలుకో||
15.ప్రద్యుమ్నరూపుడ అర్జున వరదుడ
దుర్జన సంహార మేలుకో,
అలనాడు మధురలో నాపేక్షతో కుబ్జ
నాదరించినదేవ మేలుకో, కృష్ణా మేలుకో||
దుర్జన సంహార మేలుకో,
అలనాడు మధురలో నాపేక్షతో కుబ్జ
నాదరించినదేవ మేలుకో, కృష్ణా మేలుకో||
16.అనిరుద్ధ యని నిన్ను అబ్జాసనాదులు
అర్ధించుచున్నారు మేలుకో,
అండజవాహన అబ్ధిగర్వాంతక
ద్ర్భ్శయన వేగ మేలుకో, కృష్ణా మేలుకో||
అర్ధించుచున్నారు మేలుకో,
అండజవాహన అబ్ధిగర్వాంతక
ద్ర్భ్శయన వేగ మేలుకో, కృష్ణా మేలుకో||
17.పురుషోత్తమా యని పుణ్యాంగనలెల్ల
పూజలు చేతురు మేలుకో,
పురుహూతవరద పురహార మిత్రుడ
పూతనసంహార మేలుకో, కృష్ణా మేలుకో||
18.అధోక్షజా మిమ్ము స్మరణ జేసినవారి
దురితము లెగబాప మేలుకో
వరుసతోడుత మిమ్ము స్మరణ జేసినవారి
వందనముల గొన మేలుకో కృష్ణా మేలుకో||
19.నారసింహ నిన్ను నమ్మిన భక్తుల
కరుణ బ్రోతువు వేగ మేలుకో,
శరణన్న రక్షణ బిరుదు గల్గిన తండ్రి
శశిధర సన్నుత మేలుకో, కృష్ణా మేలుకో||
20.అచ్యుతా యని నిన్ను సత్యంబుగా నదె
ప్రమధులు గొలుతురు మేలుకో,
పచ్చని చేలము నచ్చుగా ధరియించు
లక్ష్మిమనోహరా మేలుకో, కృష్ణా మేలుకో||
21.జనార్ధన నీవు శత్రు సంతతి మాన్ప
సమయమై యున్నది మేలుకో,
పంకజాక్షులు నీదు పావననామము
పాడుచు వచ్చిరి మేలుకో, కృష్ణా మేలుకో||
22.ఉపేంద్రా యని నిన్ను యువిద లందరు గూడి
కీర్తించుచున్నారు మేలుకో,
గోపకాంతలు నీదురాక గోరుదు రెడ
మురళీ వినోదా మేలుకో, కృష్ణా మేలుకో||
23.హరిహరి యని నిన్ను కొనియాడ గోపిక
జనులెల్ల వచ్చిరి మేలుకో,
అష్టభార్యలు నిన్ను గోపాలబాలురు
వనమాలికాధర మేలుకో, కృష్ణా మేలుకో||
24.శ్రీకృష్ణ యని నిన్ను గోపాలబాలురు
ఆడఁగా బిల్తురు మేలుకో,
కాళియమర్దన కౌస్తుభమణిహార
కంస సంహరణ మేలుకో, కృష్ణా మేలుకో||
25.శ్రీరామయని మునుల్ స్థిరభక్తితో మిమ్ము
సేవింపుచున్నారు మేలుకో,
తాటక సంహార ఖరదూషణాంతక
కాకుత్థ్సకులరామ మేలుకో, కృష్ణా మేలుకో||
26.తెల్లవారవచ్చె దిక్కులు తెలువొంద
నల్లని నాసామి మేలుకో,
వేళాయె గోవులమందకు పోవలె
గోపాలబలుద మేలుకో, కృష్ణా మేలుకో||
హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు!
పూజలు చేతురు మేలుకో,
పురుహూతవరద పురహార మిత్రుడ
పూతనసంహార మేలుకో, కృష్ణా మేలుకో||
18.అధోక్షజా మిమ్ము స్మరణ జేసినవారి
దురితము లెగబాప మేలుకో
వరుసతోడుత మిమ్ము స్మరణ జేసినవారి
వందనముల గొన మేలుకో కృష్ణా మేలుకో||
19.నారసింహ నిన్ను నమ్మిన భక్తుల
కరుణ బ్రోతువు వేగ మేలుకో,
శరణన్న రక్షణ బిరుదు గల్గిన తండ్రి
శశిధర సన్నుత మేలుకో, కృష్ణా మేలుకో||
20.అచ్యుతా యని నిన్ను సత్యంబుగా నదె
ప్రమధులు గొలుతురు మేలుకో,
పచ్చని చేలము నచ్చుగా ధరియించు
లక్ష్మిమనోహరా మేలుకో, కృష్ణా మేలుకో||
21.జనార్ధన నీవు శత్రు సంతతి మాన్ప
సమయమై యున్నది మేలుకో,
పంకజాక్షులు నీదు పావననామము
పాడుచు వచ్చిరి మేలుకో, కృష్ణా మేలుకో||
22.ఉపేంద్రా యని నిన్ను యువిద లందరు గూడి
కీర్తించుచున్నారు మేలుకో,
గోపకాంతలు నీదురాక గోరుదు రెడ
మురళీ వినోదా మేలుకో, కృష్ణా మేలుకో||
23.హరిహరి యని నిన్ను కొనియాడ గోపిక
జనులెల్ల వచ్చిరి మేలుకో,
అష్టభార్యలు నిన్ను గోపాలబాలురు
వనమాలికాధర మేలుకో, కృష్ణా మేలుకో||
24.శ్రీకృష్ణ యని నిన్ను గోపాలబాలురు
ఆడఁగా బిల్తురు మేలుకో,
కాళియమర్దన కౌస్తుభమణిహార
కంస సంహరణ మేలుకో, కృష్ణా మేలుకో||
25.శ్రీరామయని మునుల్ స్థిరభక్తితో మిమ్ము
సేవింపుచున్నారు మేలుకో,
తాటక సంహార ఖరదూషణాంతక
కాకుత్థ్సకులరామ మేలుకో, కృష్ణా మేలుకో||
26.తెల్లవారవచ్చె దిక్కులు తెలువొంద
నల్లని నాసామి మేలుకో,
వేళాయె గోవులమందకు పోవలె
గోపాలబలుద మేలుకో, కృష్ణా మేలుకో||
హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు!
(ప్రచురణఃబాలసరస్వతీ బుక్ డిపో, 1992)
Thank you very much.
ReplyDeleteధన్యవాదములు
Delete