Translate

27 March, 2017

పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ” లో నేను గుర్తించగలిగిన“ (ఆకర్షించిన) కొన్ని జ్ఞాన సుధా వాక్కులు……__/\__

పరమహంస యోగానందగారి “ఒక యోగి ఆత్మకథ” లో నేను గుర్తించగలిగిన (ఆకర్షించిన) కొన్ని జ్ఞాన సుధా వాక్కులు……__/\__

పరమహంస యోగానందగారిఒక యోగి ఆత్మకథ లో నేనుగుర్తించగలిగిన  (ఆకర్షించిన)కొన్ని  జ్ఞాన సుధా వాక్కులు……
ఓం శ్రీ గురుభ్యోనమః __/\__
  • మామూలుగా ఇట్టే మరుపుకు వచ్చే  తొలి (బాల్యంలోనివివిజయాలే ఆత్మ విశ్వాసానికిసహజమైన ప్రాతిపదికలవుతాయి. (కనుక తల్లిదండ్రులు దీని పట్ల శ్రద్ధ వహించడము చాలాఅవసరమన్నది తెలుస్తున్నది.)
  • వాళ్ళలో ( మా అమ్మా నాన్నాఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనదీ గంభీరమైనదీహుందాతనమున్న  ప్రేమలో అల్పత్వానికి తావు లేదు. (ఇదీ తల్లిదండ్రులముగుర్తుంచుకోవలసిన విషయమనిపించింది)
  • అన్నిటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలిచేవాడు లాభం వచ్చినపుడుపొంగిపోడునష్టం వచ్చినపుడు కుంగిపోడు.   లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బులేకుండానే వస్తాడనీపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకుపోడనీ అతనికి తెలిసిఉంటుంది దీన్ని ఆచరించడానికి నేను చేస్తున్న నా చిరుప్రయత్నంలో  సర్వేశ్వరుడుఎంతవరకు కరుణిస్తాడో మరి!!!
  •  అహంకారం (నేను చేస్తున్నాననే భావనఅన్నది ద్వంద్వానికి లేదామనిషికీ అతన్నిసృష్టించినవాడికీ మధ్య గోచరించే వేరుపాటుకు మూలకారణం.   అహంకారం మానవుల్నిమాయలో పడెస్తుందిదాని వల్ల కర్తే (అహంకర్మగా మిథ్యారూపంలో కనిపిస్తాడు.  ఒకరుసృష్టిస్తే ఏర్పడ్డవాళ్ళు తామే సృష్టికర్తలమని ఊహించుకుంటారు.
  • తామసిక కామాలనే  యోధులుమనల్ని అందరినీ హతమార్చడానికి చూస్తుంటారు.  తనఆదర్శాల్ని భూస్థాపితంచేసి సాధారణ ప్రారబ్ధానికి తలవంచినవాడు ఆలోచనా శూన్యుడు.  అతడు నిర్వీర్యుడుగానుమూర్ఖుడుగానుఅవమానకరుడుగాను తప్ప మరో రకంగాకనిపిస్తాడా?
  • నీ మనస్సులో ఉన్నది పక్కకి పెట్టెయ్యడం (స్వార్థంతో కూడిన కోరికలుఆశయాలు); నీ చేతిలోఉన్నది ఉదారంగ ఇతరులకు ఇవ్వడంఆపదలు పిడిగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడుచలించకపోవడం!ధార్మిక జీవనము - అబూ సయీద్  పారశీక మార్మికుడు
  • లోపల తిరిగే క్రూరమృగాల్ని (మానవుల కోరికలనే అడవుల్లో తిరిగే పులులుమనో వికారాలుజయించు.
  • మానవమనస్సనే అడవుల్లో సంచరించే అజ్ఞానమృగాల్ని అణచడం నేర్చుకో.
  • ప్రక్రియే లక్ష్యమనుకుని పొరపాటుపడకు.- ధ్యానంకన్నా భగవంతుణ్ణే ఎక్కువ ప్రేమించాలి.
  • భగవంతుడు ఏర్పరిచిన జీవిత క్రమంభీమా కంపెనీకంటే కూడా తెలివిగా మన భవిష్యత్తునుఅమిర్చి ఉంచుతుంది.
  • ఏమీ సాధించకుండాసంఘర్షణకు నిరాకరించే దుర్భలుడికి త్యాగంచెయ్యడానికి ఏమీ ఉండనేఉండదు.  కష్టించి పనిచేసి జయం పొందినవాడే విజయవంతమైన తన అనుభవ ఫలాల్నిప్రపంచానికి అందించి దాన్ని సుసంపన్నం చేయగలడు.
  • భ్రాంతులకు వెనక ఉండే సత్యసూత్రాల్ని బయల్పరచగల నిజమైన ప్రయోగశాల మనస్సు.
  • నీ భయానికి కారణమైన దానికి ఎదుటపడి చూడుఅది నిన్నింక ఇబ్బంది పెట్టదు.
  • మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుందిమనం కోరుకొనే వస్తువు చుట్టూ అదిఊహాకల్పితమైన అందమైన ఆకర్షణ ఒకటి ఏర్పరుస్తుంది.
  • మంచివిప్రోత్సహకరాలయిన సూచనలు పిల్లల సూక్ష్మగ్రహణ శక్తిగల చెవులకు ఎక్కేటట్టుచెయ్యాలి.  వాళ్ళకు చిన్నప్పుడు ఏర్పడే అభిప్రాయాలు లోతుగా నాటుకొని చాలాకాలం ఉంటాయి.
  • నీకున్నదాంట్లోనే సుఖంగా ఉండు.  విచ్చలవిడిగా ఖర్చుచేస్తే తరువాత దుఃఖపడతావు.
  • తమ ఆలోచనల్నిమాటలనే బాహ్యమైన దుస్తులు ధరించడానికి అనుమతించేముందుఆయన (శ్రీయుక్తేశ్వర్ జీ),విచక్షణ అనే సున్నితపు త్రాసులో తూచేవారు.
  • విశ్వాసఘాతుకుడైన స్నేహితుడిలాంటిది శరీరం.  దానికి ఇయ్యవలసినంత మట్టుకే ఇయ్యండిఅంతకు మించి వద్దు.  
  • కష్టం, సుఖం అనేవి అస్థిరమైనవి.  ఈ ద్వంద్వాలప్రాబల్యం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే వాటి నన్నిటినీ నిబ్బరంగా ఓర్చుకోండి.
  • జబ్బు స్వస్థతా కూడా ప్రవేశించే ద్వారం ఊహమీకు జబ్బుగా ఉన్నప్పుడయినా సరేజబ్బు అనేవాస్తవాన్ని నమ్మకండిగుర్తింపు పొందని  సందర్శకుడు పలాయనం చిత్తగిస్తాడు !
  • చిత్తశుద్ధి లేని సభ్యత నిర్జీవమైన సుందరాంగి వంటిది.
  • సభ్యతలేని ఋజుత్వంవైద్యుడికత్తిలాగపనికి వచ్చేదే కాని అప్రియమైనది.  మర్యాదతో కూడిననిష్కాపట్యం హాయకరమైనదే కాకప్రశంసనీయమైనది కూడా.
  • ఈ భూమిమీద ఉచితంగా లభించే గాలి పీలుస్తున్నంత కాలం, కృతజ్ఞతాపూర్వకమైన సేవ చెయ్యవలసిన బాధ్యత మనమీద ఉంటుంది. ఊపిరి అవసరంలేని సమాధిస్థితిని పూర్తిగా సాధించినవాడు మాత్రమే ప్రాపంచికవిధులనుంచి విముక్తి పొందుతాడు.
  • అహంకారం పోయిన తరువాతే భగవత్ప్రవేశానికి అవరోధాలు లేని మార్గమేర్పడుతుంది.  స్వార్ధంతో బండబారిన గుండెల్లోకి చొరబారడానికి దేవుడు చేసే ప్రయత్నం వృథాయేఅవుతుంది.
  • మెత్తని మందలింపులకే ఎదురుతిరిగే సున్నితమైన మానసిక బలహీనతలుసున్నితంగాతాకేలోగానే ఎదురుతిరిగేరుజాగ్రస్తమైన శరిరావయవాల వంటివి.
  • అహంకారం చొరబారిన మానవులు అనే ముడిఖనిజాన్ని మార్చడానికి పూనుకొన్న గురువేనిజంగా ధైర్యశాలి!
  • యోగ్యుడైన నాయకుడికి సేవ చెయాలన్న కోరికే కాని అధికారం చలాయించాలన్న కోరిక ఉండదు.
  • ఇంద్రియ ప్రలోభాలు ఎప్పటికీ పచ్చగా ఉండే గన్నేరు మొక్కలాంటివిసువాసన వెదజల్లుతూగులాబి వన్నెపూలు గల  మొక్కలో ప్రతి భాగమూ విషపూరితమైనది.
  • స్వస్థత చేకూర్చే లోకం లోలోపల ఉంటుంది సుఖంకోసం బయట వెయ్యివైపుల మనంగుడ్డిగా వెతుకుతూ ఉంటామో  సుఖం లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది.
  • తీక్షణమైన బుద్ధి రెండువైపులా పదునున్న కత్తిలాంటిది.  దాన్ని కత్తిలా నిర్మాణాత్మకంగాఅజ్ఞానమనే కురుపును కొయ్యడానికి కానివిధ్వంసాత్మకంగా తల తెగ్గోసుకోవడానికి కానిఉపయోగించవచ్చు.
  • అసహ్యమైన బురదలో పొర్లాడుతున్నప్పుడుప్రపంచపు సూక్ష్మసుగంధాలు వాళ్ళకు సోకవు.  పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ నశిస్తాయి.
  • చెడ్ద కోరికల్ని ఇప్పుడు నాశనం చెయ్యిలేకపోతేఅవినీ సూక్ష్మశరీరం భౌతికకోశంనుంచివిడివడ్డ తరువాత కూడా నీతోనే ఉంటాయి.
  • శరీరంవాటిని (కోరికల్నినిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనస్సు ఎప్పుడూనిరోధిస్తూ ఉండాలి.  వాటి ఆకర్షణ కనకక్రూరమైన శక్తితో నీమీద దాడి చేస్తున్నట్లయితేనిష్పాక్షిక విశ్లేషణతోనూ అజేయమైన సంకల్పబలంతోనూ దాన్ని జయించాలి.  ప్రకృతిసహజమైన ప్రతి వాంఛనూ జయింపవచ్చు.
  • మీ శక్తుల్ని పదిలపరుచుకోండి.  ఇంద్రియాలనే ఉపనదులన్నింటినీ తనలో కలుపుకొనే విశాలమైన మహాసముద్రంలా ఉండండి. 
  • ప్రతి నిత్యం మళ్ళీ మళ్ళీ కలిగే ఇంద్రియవాంఛలు మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి.  అవి జలాశయానికున్న బెజ్జాలలాంటివి; దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతికత్వమనే ఎడారి నేలలో వ్యర్థమయ్యేట్టు చేస్తాయవి.
  • చెడుకోరిక తాలుకు బలీయమైన ప్రచోదకప్రేరణ మానవుడి సంతోషానికి మహాశత్రవు. 
  • ఆత్మనిగ్రహ సింహంలా ఈ ప్రపంచంలో తిరగండి; ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు మిమ్మల్ని లోకువకట్టి ఆటపట్టించకుండా చూసుకోండి!
  • దైవసాక్షాత్కారం పొందడమంటే అన్ని దుఃఖాలికీ అంత్యక్రియ జరిపించడమే నన్న సంగతిగుర్తుంచుకోండి.
  • పెద్ద పెద్ద మాటలు వాడడంఒక విషయం బాగా అవగాహనచేసుకోడం ఒకటేననిపొరబడకండి.
  • కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనబడాలని చూస్తారు!
  • కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడికన్నా బలిష్ఠుడుతన ఆత్మను తానుపాలించుకొనేవాడు ఒక పట్నాన్ని పట్టుకున్న వాడికన్నా గొప్పవాడు.- సామెతలు 16:32(బైబిలు)
  • కోపంఅహంభావం అనే ఆంతరిక దుర్గాల్ని కూలగొట్టడంమే (వాటి పతనమేమానవుడిఔన్నత్యానికి నిదర్శనం.
  • కోపమన్నది తీరని కోరికలవల్లే పుడుతుంది.
  • బాహ్య కామనలు మనని లోపలున్న స్వర్గం నుంచి తరిమేస్తాయిఅవి కేవలంఆత్మానందపాత్రను అభినయించే మిథ్యాసుఖాల్ని మాత్రమే చేకూరుస్తాయి.  పోయిన స్వర్గాన్నిదైవధ్యానం ద్వారా తొందరగా తిరిగి పొందడం జరుగుతుంది.
  • నీవు దేవుణ్ణి నీ వేసవి (పడుచుతనంఅతిథిగా ఉండమని ఆహ్వానించకపోతేనీ జీవితపుచలికాలం (ముసలితనంలో ఆయన నీ దగ్గరికి రాడు. (లాహరీ మహాశయులు)
  • ఇసకా పంచదారల మిశ్రమంలాగ  భూమిమీద ఉన్న ప్రతీదీ మిశ్రమ స్వభావం కలిగినదే.  పంచదా మాత్రమే తీసుకుని ఇసకను ముట్టకుండా వదిలేసే తెలివైన చీమ మాదిరిగా ఉండు. (బాబాజీ మహాశయులు)
  • చెడును విషం కలిపిన తేనెతో పోల్చవచ్చు; అది మనకి మోహం పుట్టిస్తుంది,కాని అందులో మృత్యువు పొంచి ఉంది.
  • చెడును మంచితోనూ, విచారాన్ని సంతోషంతోనూ, కౄరత్వాన్ని దయతోనూ, అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించు.





No comments:

Post a Comment