श्रीगुरुभ्यौनम:। घन्यवादमुलु.🙏🏼
శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
బ్రహ్మశ్రీ గుండ్ల పుండరీకాక్షరావుగారి ప్రవచనములుః
1.కాలాన్ని సద్విని యోగము చేసికో....
శ్లో. ప్రాతః కాలే జూదప్రసంగః. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగం
సాయంకాలే చోరప్రసంగము. ఏతే ముక్తి దాయకమ్.
(ఇందున ధ్వని ఉన్నది)
(ఇందున ధ్వని ఉన్నది)
భావముః
ఉదయము జూదప్రసంగము, మధ్యాహ్నము స్త్రీప్రసంగము, రాత్రి చోరప్రసంగము. ఇవి మోక్షమును ప్రసాదించును. పైకి అర్థము అనర్థాలను సూచిస్తున్నది- కాని లోపల మహాఅర్థము
దాగి ఉన్నది. జూదమాడిన సందర్భము భారతములోఉన్నది. ఉదయము భారతము చదువుము. పాండవులు జూదమాడి కష్టాలనుభవించారు -జూదమాడకుము-భారతము పంచమవేదము. ఇందులో భగవద్గీత ఉన్నది. నిన్ను ఉద్ధరించుతుంది. మధ్యాహ్నము స్త్రీ ప్రసంగమనగా, సీతారాముల చరిత్ర గల రామాయణమును చదువుమని - రావణుడు స్త్రీ లౌల్యమువలన వినాశము పొందినాడు. స్త్రీ లౌల్యము పనికి రాదని గ్రహించుము. రామాయణములోని ధర్మాచరణను అర్థము చేసికొని రామునివలె ప్రవర్తించుమని భావము. ఆదిత్యహృదయము వేదసారము. ఈ స్తోత్రమును పఠించి భగవత్కృపకు పాత్రుడవగుమని ఉపదేశము. రాత్రి చోర ప్రసంగమనగా భక్తుల మనసులను దొంగిలించివాడు, అనగా భక్తుల మనసులను ఆకర్షించువాడు, కృష్ణుడు. కృష్ణుని గురించిన గ్రంథము భాగవతము. రాత్రి భాగవతము చదువుమని భావము -భాగవతము ముక్తిదాయకము -నారాయణుని దశావతారములు వర్ణితము. ఈ దివ్య అవతారములను అవగాహన చేసికొనిన ముక్తి లభించును.

భగవద్గీత (4-9).... జన్మ కర్మ చ----
ఈ మూడు అమృతభాండములను మహర్షులు మనకు ప్రసాదించిరి. ఇవి మనకు చతుర్విధపురుషార్థములను ప్రసాదించునవి. ఈ మూడు గ్రంథములు త్రికోణముయొక్క మూడు బిందువులు -త్రికోణములోని మహాబిందువు భగవద్గీత - భగవద్గీత వేదసారము. మానవవికాసమునకు కరదీపిక. భగవద్గీత కాంతులు వీటిలో ప్రసరించుచున్నవి. భగవద్గీత థీరి. భారతాదులు ప్రాక్టికల్స్. కనుక వ్యసనముల జోలికి పోక మహర్షులు ప్రసాదించిన అమృతమును సేవించి కాలాన్ని సద్విని యోగము చేసికొని సన్మార్గమున పయనించుమని ఇందలి భావము.
ఓం శాంతిఃశాంతిఃశాంతిః.
2.ధనుర్మాసము - తిరుప్పావై (16-12-2015 నుండి నెలరోజులు)
సూర్యుడు ధనురాశిలో ఉన్న మాసము ధనుర్మాసము. ఇది సౌరమానము ప్రకారము - మార్గశిరము, చాంద్రమానము ప్రకారము - ఈ రెండూ హేమంత ఋతువులోనివే. ఈ మాసము పుణ్యప్రదము -కార్తికము శివునకు - ఈ మాసము విష్ణువుకు - శివుడు జ్ఞానస్వరూపుడు - విష్ణువు ధర్మస్వరూపుడు - జ్ఞానధర్మములు రెండూ మనకు కావలసినవే. రెండుమాసములను యథావిధిగా ఆచరించవలెను. ఈ మాసమున తిరుప్పావై పారాయణ చేయలేనివారు భగవద్గీతను పారాయణ చేయవలెను.
" మాసానాం మార్గశీర్షోహమ్ "అని గీత
కృష్ణపరమాత్మ మాసములలో మార్గశిరమును నేనే. అని తన విభూతిని ఉపదేశించాడు - మార్గశిరములో నదులలో, సరస్సులలో జలము
నిర్మలముగా ఉంటుంది -పద్మములు వికసించి ఉంటాయి - పక్షులు ఆనందంగా విహరించుచూ ఉంటాయి. - ఆకాశము నిర్మలముగా ఉంటుంది - ఈ సహజప్రకృతి మానవునకు ఆనందముకలిగించుతూ ఉంటుంది. రామాయణములో రాముడు చక్కగా మార్గశిర ప్రకృతిని దర్శించి ఆనందించినాడు. ఈ ఋతువులోని ప్రకృతి శోభను పరమాత్మగా భావించి ఆనందించి పరవశించినది గోదాదేవి. శ్రీరంగనాథునికి తాను ధరించిన మాలను సమర్పంచి స్వామిలో ఐక్యమైనది -----
శ్రీకృష్ణదేవరాయలు రచంచిన ఆముక్తమాల్యద కావ్యము గోదాదేవి వివాహమును తెలియచేయుచున్న ఉత్తమ కథా కావ్యము.
ఈ నెలరోజులు తిరుప్పావై పఠించినవారు పుణ్యప్రదులగుదురు - తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతము -శ్రీవ్రతమును ఆచరించి శ్రీరంగనాథుని కరుణాకటాక్షములకు పాత్రులగుదురు గాక.
కృష్ణపరమాత్మ భగవద్గీతలో ఉపదేశించిన అంశములే తిరుప్పావై లోని సారాంశము. వైష్ణవులకు పరమపవిత్రమైన గ్రంథము తిరుప్పావై.
విష్ణుఆలయములలో తిరుప్పావైలోని పాశురములను భక్తి శ్రద్ధలతో పారాయణచేసి భగవంతుని కృపకు పాత్రులగుదురు గాక.

కృష్ణం వందే జగద్గురుమ్.
ఓం శాంతిఃశాంతిఃశాంతిః
3.మానవజన్మ
శ్లో. వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్-నిశార్ధమర్ధం దివసే
యతేతవార్ధక్యహేతోర్వయసా నవేన- పరత్రహేతోరిహ
జన్మనాచ.
భావముః
వర్షముకొరకు ఎనిమిది నెలలు గడుపుము. రాత్రికొరకు పగలు గడుపుము. వార్ధక్యముకొరకు యౌవనమును గడుపుము. పరలోకముకొరకు ఈ జన్మలోనే పుణ్యము సంపాదింపుము.
వర్షము జీవనాధారము-నాలుగు నెలల వర్షముకొరకు ఎనిమిదినెలల కాలము గడుపుము. రాత్రి సుఖము నిచ్చును కనుక రాత్రికొరకు పగలు కాలము గడుపుము. వార్ధక్యములో జ్ఞానము సంపాదించవలెను. ఇది వానప్రస్థ ధర్మము కనుక యౌవనమును గడిపిన తరువాత వార్ధక్యము. వార్ధక్యము తరువాత పరము - పరము(ముక్తి) కొరకు ఈ జన్మలోనే జ్ఞానమును సంపాదింపుము. వర్షమువలన పంటలు పండును- పంటలవలన మన ప్రాణమలు నిలుచును. క్రమముగా పంచకోశములకు ఆధారము వర్షము. పంచకోశములుగల మనశరీరముతో పగలంతయూ కష్టపడి రాత్రి సుఖమును పొంది ఇంద్రియములకు విశ్రాంతి నిచ్చి సుఖమయజీవితమును సాగించుచుచున్నాము. ఇది ఇహ జీవితము. ఈ జీవితమున శరీరము వికారములు పొందుచూ వార్థక్యమును పొంది అంతమునందు ప్రాణములు విడుచుచుచన్నది. అనగా ఆత్మ శరీరమునుండి వెలువడి మరియొక శరీరమును పొందుచున్నది.
ఈవిధముగా జీవుడు జనన మరణ చక్రమున తిరుగుచున్నాడు. జీవునకు ముక్తి లేదు - కనుక ముక్తి కొరకు ఈజన్మలోనే జ్ఞానమును సంపాదింపుము. జ్ఞానము వలన మోహము నశించి జ్ఞానము సూర్యునివలె మన హృదయములో ప్రకాశించును. ఈ జన్మలోనే ఇహముపై శ్రద్ధ చూపినట్లే, పరముపై కూడా శ్రద్ధ చూపవలెను. అందువలన పరమాత్మను సూచించుచు జ్ఞానముగల ద్వైత-విశిష్టాద్వైత-అద్వైత మతములను అవగాహన చేసికొనుము. అందులకు గురువునాశ్రయింపుము.

మంచి విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteమీ సహృదయ స్పందనకు ధన్యవాదములు
ReplyDelete