ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.
అజ్ఞాత వాసంలో అర్జునుని పేరేమి?
2.
భీముని శంఖం పేరు ఏమిటి?
3.
వ్యాసుని కుమారుడెవరు?
4.
17వ రోజు సాయంకాలం దుర్యోధనుని సంధిచేసుకొమ్మనిఎంతగానో
బోధించాడొక వీరుడు. ఎవరాతడు?
5.
వ్యాసుడు ఒకసారి ధృతరాష్ట్రునికి చూపు
ఇస్తాడు ఎపుడు?
సమాధానములు (జవాబులు):
1. బృహన్నల – విరాటపర్వము
– ప్రథమాశ్వాసము – 89 పద్యము
క॥అని కొలిచి యే బృహన్నల
యనునామముతోడఁ
గన్యకాంతఃపురవ
ర్తన మొనరించుచు
లాసిక
తనమున
నిపుణుండ నై యతని మెచ్చింతున్. (89)
2. పౌండ్రము – భీష్మపర్వము – ప్రథమాశ్వాసము – 176 వచనము
వ॥అప్పుడు కృష్ణార్జునులు పాంచజన్యదేవదత్తంబులును భీమసేనుండు
పౌండ్రంబును యుధిష్థిరుం
డనంతవిజయంబును
నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును పాంచాల విరాట సాత్యకి
ధృష్టద్యుమ్న శిఖండి
ప్రముఖదండనాయకులు తమతమశంఖంబులుఁ బూరించిన. (176)
3. శుకుడు – శాంతిపర్వము
– షష్ఠాశ్వాసము
-246 వచనము
వ॥కృష్ణద్వైపాయనపుత్రుం డనుమాత్రమకాని శుకుని జన్మంబు తెఱంగునునతని
తల్లిని నతండు బాల్యంబున
మహనుభావుం
డగుటకుం గతంబును నతండు సిద్ధి పొందినభంగియు నెఱుంగ నవి యెల్ల నెఱింగింపుము.
(246)
4. కృపాచార్యుడు – శల్యపర్వము
– ప్రథమాశ్వాసము – 41& 63 వచనములు;
42-62
పద్యములు
వ॥మందిరంబుఁ బ్రవేశింపక యొక్కబయల నఖిలబంధుమిత్రపరిజనవృతుం
డై నిలిచె నయ్యవసరంబునఁ
గృపార్దచిత్తుం డై కృపాచార్యుం డన్నరేంద్రునకి
ట్లనియె. (41)
క॥సమరము మిముబోంట్లకు ను
త్తమధర్మం బిదియ తొంటిధాత్రీశులు కృ
త్యముగఁ గొని యాచరించిరి
తమకు సుగతి గోరి కీర్తితస్ఫురణమెయిన్.
(42)
క॥ఐననునొకపలు కడ్డము
గా నొడివెద దని లెస్సగా
విని యది మే
లైనని జేసెదు కాదే
న్మానెద నెర్పడఁగ వినుము
మనుజాధీశా. (43)
ఉ॥ఇంతకమున్ను చెల్లెఁ బదియేడుదినంబులసంగరం బతి
శ్రాంతతఁ గుంది రిందుఁ
గలసైనికు లద్దెసఁ గల్గుయోధు లా
క్రాంతవిరోధిదర్పుఁడు పురందరనందనుబల్మికల్మి ని
శ్చింతత నుల్లసిల్లెదరు
చెక్కు చెమర్పక కౌరవేశ్వరా. (50)
క॥సమరము నిష్కారణవై
రమునం బాటిల్లె నెల్ల
రాజులు భరతో
త్తములును మడిసిరి విడు
కో
పము దీర్ఘక్రోధుఁ డైనపతి
కీడొందున్. (55)
క॥తమకు బలం బెక్కినతఱి
సముచిత మగు విగ్రహంబు
శత్రుల కుత్సా
హము మీఱినపుడు కర్త
వ్యము సంధి యనంగ విందు
మార్యులచేతన్. (56)
చ॥హరియును గా దనండు కరుణాన్వితు లై తగ న్నమ్మహాత్ము
లె
ప్పరుసునఁ గార్యనిశ్చయము
పల్కినఁ గీచకవైరియుం బురం
దరతనయుండునుం గవలు దానికి
మా ర్పలుకంగ నెమ్మెయిం
జొర రగు సంధి యెట్లు
ననసూయత నూల్కొని చేయు మిత్తఱిన్ . (61)
ఆ॥ఇంత చెప్పు టనికి నే నోడి ప్రాణర
క్షణము చేసికొనుట కాదు
నీకుఁ
బథ్య మనియుఁ దఱిమి
పల్కితి విను విన
వేని నొచ్చి తలఁచె
దిట్టులగుట. (62)
వ॥అని యగ్గౌతముండు శోకాయత్తచిత్తుం డగుచుం దనకు
హితోపదేశంబు చేసిన విని దుర్యోధనుండు వేఁడినిట్టూర్పు నిగిడించి యొక్కింతసేపు చింతాక్రాంతు
డై యూర కుండి వ్రాల్చిన కనుదోయి విచ్చి యవ్విప్రవరుమొగంబు చూచి యి ట్లనియె. (63)
5. యుద్ధంలో చనిపోయిన వీరుల విశేషాలు చూపించడానికి
– ఆశ్రమవాసపర్వము – ద్వితీయాశ్వాసము
– 121
పద్యము
క॥తగ నాకురువృద్ధునకు నొ
సఁగె
నాఁటికి దివ్యదృష్టి సాత్యవతేయుం
డగణితతపఃప్రభావం
బు గని
యధికవిస్మయంబుఁ బొందఁగ జనముల్. (121)
*************
No comments:
Post a Comment