ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.
బభ్రువాహనుని చేతిలో చనిపోయిన అర్జునుడు
మరలా ఎట్లా బ్రతికాడు?
2.
కొడుకు పొందిన శాపాన్ని వరంగా మార్చాడొక
తండ్రి – ఎవరా తండ్రి కొడుకులు?
3.
బలరాముడు భీముని “దూష్యగర్వం” పనికి రాదంటాడు - ఎందుకు?
4.
పరీక్షిత్తుని శపించిన దెవరు?
5.
అంబను ఎవరు ప్రేమించినాడు? అతనిని పెండ్లి ఆడినదా?
సమాధానములు (జవాబులు):
1.
ఉలూచి యొక్క సంజీవనీ మణిచేత – అశ్వమేధపర్వము – చతుర్థాశ్వాసము – 64&80-82,84 పద్యములు; 83 వచనము
క||
వడి
నది
వీపున
వెడలినఁ
బడియె బుడమి నర్జునుండు పదపడి త్రెళ్లెం
గొడుకును ము న్నతఁ డేసిన
బెడిదపు టేటులయలంతఁ బృధ్వీనాధా. (64)
ఆ||
అట్లు
తెంపు
చేసి
యాసీను
లైనయా
తల్లిఁ గొడుకు నవనిఁ ద్రెళ్లి యున్న
విజయుఁ జూచి పాఁపవెలఁది సంజీవన
మణి దలంచెఁ గురుసమాజముఖ్య. (80)
వ||
తలంచిన
భుజంగమంబులకుఁ బరాయణం బైనయమ్మణి యమ్మహాభాగహస్త తలంబునకు వచ్చిన నాభామిని బభ్రువాహనునాననం బాలోకించి (81)
సీ||విజయుండు చచ్చునే వేఁదుఱులార యింద్రునిచేత నైన నీతనికి నొక్క
ప్రియము చేయంగఁ గోరియును నీకొలదియారయుబుద్ధి
నీతండు
రణమొనర్పఁ
దలఁచిన నవ్వీరుతలఁపు సిద్ధింపంగఁ జేయుటకును నింతచేయవలసె
నాకుఁ గావున మోహనం బగుమాయాప్రయోగంబు
నడపితి
నుజ్జ్వలాత్మ
తే||నరుఁడు నారాయణుఁడు మహత్తరము సువ్వె
యితని తేజమెవ్వరికినినెట్లుదాని
నార్పవచ్చు మీవగపెల్ల దీర్ప నిపుడ
యుత్థితుం డగు నీకౌరవోత్తముండు. (82)
వ||మాయాప్రయోగంబ వేఱొండు కాదు నీకు మీతండ్రితోడ భండనంబు చేయబుద్ధి పుట్టించితి నింతమాత్ర యని
తత్ప్రదేశంబున నున్న యెల్లజనంబుల నుల్లంబుల నానందంబు నొందఁ బలికి
యమ్మణిపూరపుర్పతికరతలంబుననమ్మణి యిడి దీని నిమ్మహాత్మునిహృదయ దేశంబుమోపు మనవుడు
నతం డట్ల చేయుటయుం బార్థుండు ప్రత్యుజ్జీవితుం డై. (83)
తె||లేచికూర్చుండి కలయంగఁ జూచి యెఱ్ఱ
సెరలకాంతియు దంతరుచియును బెరయు
టతిమనోహరముగఁ
దనసుతునితోడ
మనుజనాయక
కుశలమే యనుడు నతఁడు. (84)
2.
ఇంద్రుడు-అర్జునుడు – ఆరణ్యపర్వము – ప్రథమాశ్వాసము – 367 పద్యము
ఇంద్రుడు – నపుంసకత్వము పొందుమని ఊర్వశి శపిస్తే ఇంద్రుడు దాన్ని అజ్ఞాతవాసంలో అనుభవించితే సరిపోతుంది అని వరంగా పరిణమింపజేశాడు. –
తే||అనఘ యూర్వశి యిచ్చినయట్టిశాప
మనుభవింపంగవలయు నీ కవనియందు
నింక మీపదుమూఁడవ యేఁడుసత్య
సరణి నజ్ఞాత్వాసంబు సలుపవలయు. (367)
3.
దుర్యోధనుని శిరస్సు తన్నినందుకు – తొడలు విరిగిపడిన దుర్యోధనుని శిరస్సును తన్నడం అధర్మం అని చెబుతూ బలరాముడు
అంటాడు. ధర్మపరులకు దూషింపదగిన గర్వం ఉండరాదంటాడు. –
శల్యపర్వము – ద్వితీయాశ్వాసము –
289 పద్యము
క|| మును లోకము ధర్మపరుం
డనఁబరిఁగినవాఁడ
విట్టు లనుచితకృత్యం
బునకుఁ
జన దగునె దీనం
గనియెడుఫల
మేమి దూష్యగర్వం బేలా. (289)
4.
శృంగి – శమీకుని కుమారుడు. తపస్సు చేసుకొనే శమీకుని మెడలో పరీక్షిత్తు
చనిపోయిన పాము వేశాడు. శృంగి దాన్ని చూసి “ఈతని మెడలో పాము వేసినవాడు వారంలో పాము విషంతో చనిపోతాడని” శపించాడు. – ఆదిపర్వము – ద్వితీయాశ్వాసము –
171 వచనము
వ॥శాపజలంబు లెత్తికొని విజనంబైన విపిన స్థానంబున
విజి తేంద్రియుండై మొదవులచన్నులువత్సంబులు గుడుచునప్పు డుద్గతంబగు పయఃఫేనంబ
తనకాహారంబుగా మౌనవ్రతంబునం దపంబుసేయుచున్న మహావృద్ధు మదీయజనకు నవమానించిన పరీక్షితుండు
నేఁడు మొదలుగా సప్తదివసంబులలోనఁ దక్షకవిషాగ్ని దగ్ధుండై యమసదనంబున కరిగెడుమని శాపంబిచ్చి
తండ్రి పాలికిం జని. (171)
5.
సాల్వరాజు – లేదు – భీష్ముడు తీసుకొనివెళ్లటంవలన
తదుపరి ఆమెను తిరస్కరించాడు. – ఆదిపర్వము –
చతుర్థాశ్వాసము
– 213 పద్యము & ఉద్యోగపర్వము
– చతుర్థాశ్వాసము – 275,276 & 278 పద్యములు.
ఆ|| పరఁగ నన్ను సాల్వపతి వరియించినఁ
దండ్రిచేతఁ
బూర్వదత్తనైతి
నమ్మహీశునకు
నయంబున నెయ్యది
ధర్మువెఱిఁగి
దానిఁ దలఁపు మిపుడు. (213)
తే|| సౌంభపురవల్లభుం డైనసాళ్వుమీఁదఁ
దలఁపుగలదు
నాకతఁడునుదగులు గలిగి
యుండు నాదెస నీవు ధర్మోత్తరుండ
నతనిపాలికిఁ దగ నను ననుపవయ్య.
(275)
క|| అన విని సత్యవతికిఁ జె
ప్పిన నాయమ వనుప నంబఁ బెంపుగ వృద్ధాం
గనలం దోడుగ నప్పుడ
పనిచి యనిచితిని జనంబు ప్రస్తుతి సేయన్.
(276)
క||
అంబయు నట సాళ్వునికడ
కుం బోయిన నతఁడు భీష్ముకొనిపోయినదా
నిం బరచుం గైకొన ధ
ర్మంబే కన్యాత్వ మెడలె మగువా నీకున్.
(278)
******************************************************************************
No comments:
Post a Comment