ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.
సాత్యకి తండ్రి, తాత ఎవరు?
2.
బకాసురుని తమ్ముడెవరు? అతనిని ఎవరు చంపారు?
3.
దుశ్శాసుని మరణం చూసిన తరువాత ఒక తీవ్రవాది
దుర్యోధనుని సంధి చేసుకొమ్మని సలహా ఇచ్చాడు –
కర్ణుడుండగానే
ఎవరాతడు?
4.
పాండవులు అజ్ఞాతవాసంలో తమ ధనుర్భాణాలను
ఎక్కడ దాచారు?
5.
రాయబారానికి వెళ్ళేటప్పుడు కృష్ణునితో
ఎవరు వెళ్లారు?
------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
తండ్రి – సత్యకి; తాత-
శని.-
2.
కిమ్మీరుడు – భీముడు. – ఆరణ్యపర్వము – ప్రథమాశ్వాసము – 119 వచనము
వ|| ఇట్లొక్కముహూర్తంబు వృక్షయుద్దంబు
సేసి యాసన్నమహీరుహంబులు సమసిన నయ్యిద్దఱు శిలయుద్ధంబునకుఁ దొడంగి చేయునెడం బవననిక్షిప్త
నిష్టురశిలాహతహృదయుం డై భానుం బట్టుకొను స్వర్భానుండునుం బోలెఁ గిమ్మీరుండు భీముం బట్టుకొనిన
భీముండు వాని హీనబలుం గా నెఱింగి కృతాంతదండానుకారంబు లయిన తన బాహుదండంబుల నమ్మనుజకంటకుకటికంఠప్రదేశంబులు
పట్టుకొని నేలం బెట్టి దేహయష్టి విఱిచి బకుం జంపినవిధంబునఁ గిమ్మీరు విగతప్రాణుం జేసి.
(119)
3.
అశ్వత్థామ – కర్ణపర్వము – తృతీయాశ్వాసము –
266 & 268 వచనములు; 267-273 పద్యములు
వ|| ……రయ్యవసరంబున నశ్వత్థామ కురుపతిఁ జేరం జని కరంబు చేతం దెమల్చి సాంత్వన స్వరంబున
ని ట్లనియె. (266)
చ|| వలవదు నన్నునుం గృపు నవధ్యులఁగాఁ
గొని క్రీడి గెల్వ శ
క్తు
లని తలంప భీష్ముఁడును ద్రోణుఁడు లోక మెఱుంగఁగా నవ
ధ్యుల
హరికల్మి నారథికు దోర్బలలీల నడంగి పోరె య
చ్చలమొ
ఫలంబొ యిం కయిన సంధి యొనర్చుట మేలు వారితోన్. (270)
క|| వెడతలఁపు లుడిగి సంధికి
నొడఁబడు
మిది లెస్స దీని కొడఁబడమి కడుం
జెడు
తెరు విప్పటి పదనున్
గడవఁబడుట
త్రాటఁ దప్పుకరణియ చుమ్మీ. (273)
4.
శమీవృక్షం మీద – విరాటపర్వము –
ప్రథమాశ్వాసము – 173 వచనము & 172
&174 పద్యములు
ఆ|| గొనయములు వదల్ప ననుమతి
సేయుడు
వారు
నట్ల చేసి తేరఁ జాప
ములును
దొనలు వర్మములు నసిముద్గరా
ద్యాయుధములుఁగూడ
నతఁడుగట్టె. (172)
వ|| ఇట్లు పూర్వోక్తప్రకారంబునం
బొదివి మహోరగంబులం బెట్టియలంబెట్టి కట్టు చందంబున బంధించి వానిం గొనుచు నయ్యజాతశత్రుండు
ధర్మదేవతాదత్తవరుం డగుటంజేసి నిశ్శంక బైనయంతఃకరణంబుతోడ శమీవృక్షసమారోహణం బాచరించి.
(173)
తే||
బ్రహ్మవిష్ణుమహేశదిక్పాలచంద్ర
సూర్యవనదేవతాపితృస్తుతు
లొనర్చి
దివియు
భువియును జూచి ప్రార్ధించి యొక్క
విపులశాఖ
నాయుధములు వ్రేలఁ గట్టె. (174)
5.
సాత్యకి – ఉద్యోగపర్వము – తృతీయాశ్వాసము –
131 పద్యము; 132 వచనము
క|| మనప్రజలోఁ గరిపురికిం
జనుదేరఁగ
వలయువారి సవరణతో రం
డని యేర్పడ
నియమింపు ప
యన మై
యేతెమ్ము నీవు నని తగ మఱియున్. (131)
వ|| దుర్యోధనుండు దుష్టాత్మకుం
డతండు మన్నించు మానుసులునుం గుటిలబుద్ధులు గావునఁ జక్రగదాద్యాయుధంబులు రథంబునం బెత్తింప
వలయు నని చెప్పి పనిచి సమయజ్ఞతం బోడసూపి నిలుచున్నతారుకుం జూచి తేరు పూన్ప నియోగించిన
నతండును మణిగణప్రభాపటలజటిలం బగునరదంబు వన్ని శైలసుగ్రీవమేఘపుష్పవలాహకంబు లనం బరఁగుతురంగంబులం
బూన్చి గరుడధ్వజంబెత్తి తెచ్చినం దానునుం బయనంపుఁజందంబున గట్టాయితం బై జనంబుల చూడ్కులకుం
బండు వగుచుఁ బుండరీకాక్షుండు మంగళతూర్యంబులుసెలంగఁ జామరంబు లుల్లసిల్ల రథం బెక్కినయవసరంబున
యాదవపరివారంబుతో నరుగుదెంచినసాత్యకిం దనరథ బెక్కించుకొని యాంగికంబు లైనశుభసూచకంబులు
గైకొనుచుఁ బూర్ణకలశవృషభాదిభద్రపదార్థంబుల నవలోకించుచుఁ బుణ్యాంగనలు సేసలోలుకఁ జిత్తంబు
ప్రసన్నతం బొంద వెడలునప్పుడు. (132)
**********************************************************************************************************
No comments:
Post a Comment