Translate

23 May, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 086 (426 – 430)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1.              అభిమన్యుడు చనిపోయినది ఎన్నోరోజు యుద్ధములో?
2.             పరీక్షిత్తు డెవరి కుమారుడు?
3.             భీముడికి గదని ఎవరిచ్చారు?
4.             సభలో కృష్ణుని బంధించటానికి కౌరవులు ప్రయత్నిస్తున్నారని ముందుగా పసిగట్టినదెవరు?
5.             దక్షిణ గోగ్రహణం చేసిందెవరు?
------------------------------------------------------------------------------------       
 సమాధానములు (జవాబులు):
1.              13వ రోజు యుద్ధంలో ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము

2.             ఉత్తరాభిమన్యుల కుమారుడు.  ఇతనికే శుకుడు భాగవతం వారం రోజుల్లో చెప్పాడు. సౌప్తికపర్వము  
    ద్వితీయాశ్వాసము – 86 వచనము
|| అని పలికి పరమాదరణీయు లగుసాత్యవతేయ దేవకీనందనులవాక్యంబు లాదరింపక పాండవసంతానసకలగర్భవిషయంబుగా నస్త్రప్రమోచనంబు చేసిన నుపలక్షించి వాసుదేవుం డతనితో నిట్లను ద్రికాలవేదియగునొక్కబ్రాహ్మణుండుపప్లావ్యంబునకు వచ్చి యుత్తరను జూ నీ పుణ్యంబునఁ బ్రాణంబులు పరిక్షీణంబు లైనపుత్రుండు జనియింపం గలవా డది కారణంబుగా భవదీయ గర్భస్థునకుఁ బరిక్షిన్నామధేయం బగు నని పలికె నమ్మాహాత్మునివచనం బనృతంబు కానేరదు భవత్కృత్యం బకృతసమంబ యబ్బాలకుండు పాండవవంశకరుండగు నని చెప్పి తనచిత్తంబున రోషం బావహిల్లుటయు బాలఘాతి వగునీకు నశనంబు దుర్ల భం బై సహాయరహితుండ వై దుర్గంధరక్తంబు నంగంబు దిగ్ధం బగుచుండ మూఁడువేలేండ్లు తిరుగుము నాచేత రక్షితుండై యక్కుమారుండు కృపాచార్యువలన ధనుర్వేదవిదుం డై సర్వశస్త్రాస్త్రంబులు పడసి బహుసంవత్సరంబులు వసుధఁ బాలింపఁగలవాడు వానికి జనమేజయుం డనుమహారాజు ప్రభవించి నీవు చూచుచుండ నుజ్జ్వలుం డై ప్రవర్తించు మదీయంబు లగుతపస్సత్యంబులమహనీయప్రభావంబులు చూడు మని యాడె నప్పుడు కృష్ణద్వైపాయనుండు గురునందనున కి ట్లనియె. (86)
3.             మయుడు సభాపర్వము ప్రథమాశ్వాసము – 8 వచనము
తొల్లి వృషపర్వుం డనుదానవేంద్రున కొక్కసభ నిర్మింప సమకట్టి వివిధరత్నమయంబు లయిన యుపకరణంబు లొడఁగూర్చి బిందుసరం బనుకొలనసంగ్రహించినవాఁడ నయ్యుపకరణంబుల దాని విచిత్రంబుగా రచియించి తెచ్చి ధర్మరాజున కిచ్చెద మఱియును భౌమాదిత్యుం డనురాజర్షి చేత నిహితం బయి సకలశత్రుఘాతిని యైనదాని భీమసేనున కొక్కగదను దారుణం బయినదివ్య ఘోషంబు గలుగుదేవదత్తం బనుశంఖం బర్జునునకును నిచ్చెద నని చెప్పి ధర్మరాజుచేత సత్కృతుం డై మయుం డరిగె నంత నిట నారాయణుండును బాండవుల వీడ్కొని పితృదర్శనలలుసుం డై ద్వారవతీపురంబున కరిగెనట మయుండును బూర్వోత్తరదిశాముఖుం డై పోయి కైలాసంబును త్తరంబున మైనాకశైలంబునందు హిరణ్యశృంగంబున. (8)

4.             సాత్యకి ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము 393,394 పద్యములు; 395 వచనము
అడఁకువ లేమి నల్కి యురియాడుట నొండొరుఁ గూడ కుండుటన్
    బుడిబుడి మాటలాడుటను బోవుచు వచ్చుచుఁ గ్రందు గ్రమ్మఱం
    బడుతను దెల్ల మైన మును పన్నుగఁ దాఁ బరికించి యున్కి న
    ప్పుడు హరిఁ బట్టుసంకులము వుట్టుట సాత్యకి నిశ్చయించుచున్. (393)
తేబఱటి కొనిపోయి కృతవర్మఁ బన్నఁ బనిచె
    నీవు బలమును వాకిఁట నిలువు మేను
    లోపలికి నెల్ల జాలుదుఁ బాపబుద్ధు
    లన్న్ దెసఁ దప్పి రని నిర్భయమునఁ జెప్ప.(394)
ఇట్లు పరమాప్యుం డగుహార్దిక్యు నట వుచ్చి సాత్యకి సత్వరంబుగాఁ జనుదెంచి జనార్దనునకు నెత్తెఱం గెల్ల
     నెఱింగించి తదనుమతిం గౌరవేశ్వరబాహ్లికభీష్మ విదురులతో ని ట్లనియె. (395)

5.             సుశర్మ విరాటపర్వము తృతీయాశ్వాసము – 132వచనము
సుశర్మయు నేలినవానిపనిఁ బూనిజోడుపక్కెర కైదువు బిరుదు రవణంబు మొద లైనసవరణంబులం జూడ నక్కజంబుగాఁ గూడి పరదేశం బాపోశనంబు గొనం దమకించుతనబలంబులగజబిజి యుడిపికొని గోగణంబులయగపాటూహించి జతనంబుతో నడచుచుండియు వెసగుందక వేగిరంపుఁబయనంబులయ్యును ప్రజల నోలాకుపడనీక యెత్తెడుచోట్లను విడిదలలయందును లోనుగా నిస్సాణాదు లైనయుద్భటచిహ్నంబులు ప్రకటింపక దాడిమెయిం జని వేగులవారివలన విరాటుతొఱ్ఱు లున్నయెడ యెఱింగి గ్రద్దనం గదుపుల గార్చిచ్చుచందంబునం బొదివి వెలిచిన. (132)
***********************************************************************************************

No comments:

Post a Comment