ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.
విదురుడెట్లు చనిపోయాడు?
2.
భారతంలోని 18 పర్వాలు
ఏమిటి?
3.
బాహ్లికుడెవరు? ఎవరిచేతిలో చనిపోయాడు?
4.
విరాటుడెవరిచేతిలో చనిపోయాడు?
5.
ఉత్తరుని పతాకం ఏమిటి?
సమాధానములు (జవాబులు):
1. ధర్మరాజు చూడటానికి వచ్చినపుడు విదురుడు
యోగ బలంతో ధర్మరాజుని చూస్తూ ప్రాణాలు వదిలాడు. ఒక తేజస్సు విదురునిలో నుండి ధర్మరాజును
చేరింది. ధర్మరాజు శరీరం అంటే యముని మారు తనువు గనుక.
–
ఆశ్రమవాసపర్వము – ద్వితీయాశ్వాసము – 60పద్యము
సీ|| ధర్మతనూజుండు తత్సమీపంబున
కేగి యయ్యోగికట్టెదుర నిలిచి
యాతండు నయనంబు లర్ధమీలితము లై యుండగ
నూరక యున్నఁ గాంచి
నిర్మలాత్మక యేను ధర్మసూనుఁడ నన్నుఁ
గనువిచ్చి చూడవే యనుఁడు నతఁడు
ఱెప్పల నెగయించి యప్పాండవోత్తముఁ తప్పక
చూచి యుదాత్తయోగ
తే|| బలము గైకొని యింద్రియములను
బ్రాణ
ములను నింద్రియములుఁ బ్రాణములును గలపి
నిజ్శరీరంబు విడిచి యానృపతితనువు
చొచ్చెఁ తేజోమయత్వవిస్ఫూర్తి మేరయ.
(60)
2.
18 పర్వములు– ఆదిపర్వము; సభాపర్వము; ఆరణ్యపర్వము; విరాటపర్వము; ఉద్యోగపర్వము; భీష్మపర్వము; ద్రోణపర్వము; కర్ణపర్వము; శల్యపర్వము; సౌప్తికపర్వము; స్త్రీపర్వము; శాంతిపర్వము; అనుశాసనిక;
అశ్వమేధపర్వము;
ఆశ్రమవాసపర్వము; మౌసలపర్వము; మహాప్రస్థానీకపర్వము; స్వర్గారోహణపర్వము
3.
భీష్ముని పినతండ్రి; కౌరవపక్షంలో యుద్ధంచేసి భీముని చేతిలో 14వ రోజు రాత్రి
చనిపోయాడు. – ద్రోణపర్వము – పంచమాశ్వాసము – 90&91పద్యములు
చ|| తనయుఁడు మూర్ఛపోయిన నుదగ్రత
బహ్లికుఁ డచ్యుతనుజ
న్ముని దలపడ్డ నాతనికి మించి వృకోదరుఁ
డన్న రేంద్రు నే
సిన నతఁ డుగ్రశక్తి వయిచెన్ మెయి నాటుడు సోలి యంతలో
నన తెలి వొంది ముద్గరమునం బవనాత్ముజుఁ
డేచి వైచినన్. (90)
క|| తల వ్రయ్య లైన నిస్ఠుర
కులిశగతిం బగిలి కూలుకులపర్వతముం
దలఁపించుచుఁ గురువృద్ధుం
డిలఁ గూలెం బ్రతిబలంబు లేపారంగాన్.
(91)
4.
ద్రోణుని చేత 15వ రోజు చనిపోయాడు – ద్రోణపర్వము – పంచమాశ్వాసము
– 283 పద్యము
మ|| చంచద్బాణపరంపరాప్రహతులన్
సైనంబుఁ గ్రూరోద్ధతిం
జించెం జించిన నింక నెన్నఁటికి నిస్సీ
భూరిబాహాబలం
బంచుం గూడి కడంగి నొంపఁ గుపితుం డై
మత్స్యభూవల్లభుం
బాంచాలక్షితినాథునిం దునిమె దర్పస్ఫూర్తి
శోభిల్లఁగన్. (283)
5. సింహం – విరాటపర్వము
– చతుర్థాశ్వాసము – 170 వచనము
వ||
తదనంతరంబ యగ్నిదేవుం దలంచిన నతండును దనవరంబున మున్నకలిగి విశ్వకర్మనిర్మితంబును
మాయామయంబును వానారాకారంబును నగుమహోగ్ర కేతనంబును దదాశ్రితంబు లైనవికృతాభీలనానావిధ భూతంబులఁ
బుత్తెంచిన నుదాత్తచిత్తుం డయి యుత్తరుసింహపతాకశమీవృక్షంబునం బెట్టించి నిజ
ధ్వజంబు రథంబునం గత్తించి దివ్యంబు గావున దేవదత్తంబు చిత్తజ్ఞత్వంబున సన్నిధి సేసిన
సవినయంబుగాఁ గైకొనియె నక్కుమారుండును
నాయితం బైనొగ లెక్కి పగ్గంబు లమర్చికొని యగ్గలికతోడం దురంగంబులయంగంబులు
దొడయుచు వనిజవసత్త్వంబులు వేఱువేఱ వర్ణించిన. (170)
*********************************************************************************
No comments:
Post a Comment