Translate

23 May, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 087 (431 – 435)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1.              భారత యుద్ధంలో భీష్ముని తరువాత కౌరవ సైన్యాధ్యక్షులెవరు? ఎవరు ఎన్నిరోజులు చేశారు?
2.             ఆగ్నేయాస్త్రం అర్జునకు ఎవరు ఇచ్చారు?
3.             భీమాదులు పద్మవ్యూహంలో ప్రవేశించకుండా అడ్డుకున్నదెవరు?
4.             యక్షుడు ధర్మజుని తమ్ములలో ఒకరిని కోరుకొమ్మంటే ధర్మజుడు ఎవరిని కోరాడు?
5.             అశ్వత్థామ అని అతనికి పేరెందుకు వచ్చింది? ఆ నామకరణం ఎవరు చేశారు?
-------------------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.   ద్రోణుడు 5 రోజులు; కర్ణుడు 2 రోజులు; శల్యుడు – ½ రోజు; దుర్యోధనుడు - ½ రోజు ఆదిపర్వము  
   ప్రథమాశ్వాసము – 68 పద్యము
పదిదినము లైదుప్రొద్దులుఁ
    పదపడి రెన్నాళ్లు నొక్కపగలున్ రేయున్
    మదమున రణ మొనరించిరి
    నదిసుతగురుకర్ణశల్యనాగపురీశుల్. (68)

2.  ద్రోణుడు. అగ్ని > బృహస్పతి > భరద్వాజుడు > భార్గవుడు > ద్రోణుడు > అర్జునుడు  - ఆదిపర్వము  
   ప్రథమాశ్వాసము – 45 పద్యము
సీఅగ్ని దేవుండు బృహస్పతి కిచ్చె ము న్నతఁడు భరద్వాజుఁ డనఁగ బరఁగు
    ముని కిచ్చె నమ్మహాముని భార్గవుండును గుంభభవున కిచ్చె
    నమ్మహాత్ముండు నా కతిదయ నిచ్చె నియ్యనలాస్త్ర మని దాని నమ్మహోగ్ర
    గంధర్వుపై వైచె ఘనుఁ డింద్రసుతుఁ డంతఁ దద్రథం బప్పుడు దగ్ధమయిన
నగ్ని దాహభీతి నంగారపర్ణుండు
     బమ్మరిల్లి నేలమౕ బడిన వానిఁ
     గొప్పు వట్టి యీడ్చికొని వచ్చె ధర్మజు
     కడకు నింద్రసుతుఁడు కడిమి మెఱసి. (45)
3.  సైంధవుడు -  ద్రోణపర్వము – ద్వితీయాశ్వాసము – 63 పద్యము & 64 వచనము

వినుము నరేంద్ర పాండవులు విక్రమదుర్దముఁ డైన్ పార్థనం
    దనునకుఁ దోడ్పడం గడఁగి దంతితురంగరథోత్కరంబులం
    దున్ముచు సత్వరస్ఫురణఁ ద్రోచిన నీపెనుమూఁక పాయవి
    చ్చి నిలిచి చూచుచుండె నవిచేష్టితు లైరు బలాధినాథులున్. (63)
పాంచాల యాదవ పాండ్య కేకయ మాత్స్యప్రముఖమహనీయ సైన్యంబులతో న ట్లురవడించిన నయ్యుధిష్టిరుం డనుమహావాయువునకు జయద్రథుం డద్రియ పోలె నడ్డపడియె నని చెప్పుటయు విస్మితుం డ్గుచు వైచిత్రవీర్యుం డతని కి ట్లనియె. (64)
                                                                        
4. నకులుని కుంతీపుత్రులలో ధర్మరాజు మిగిలినాడు.  మాద్రి కొడుకులలో పెద్దవాడని ఆరణ్యపర్వము
   సప్తమాశ్వాసము – 457 పద్యము
సీశ్యామాంగు నారక్తజలరుహనేత్రు సాలప్రాంశు నున్నతలలితబాహు
    నకులుని బ్రదికింపు నావుడు యక్షుండు భీమఫల్గును లతిభీమబలులు
    ప్రియులు నీ కెంతయుఁ బృథివీశ వీరిలో నొకనిఁ గోరక యిట్లు నకులుఁ గోరి
     తనుడు ధర్మాత్మజుఁ డనియెను మాతండ్రి యగుపాండువిభునకు మగువ లిరువు
రందు గొంతికొడుకు లైనమువ్విరిలోన
    నేను బ్రదికినాఁడ నింక మాద్రి
    తనయు లిరువురందుఁ దగ నిప్పుడొక్కఁడు
    బ్రదుక వలదె చెపుమ పాడి తెఱఁగు. (457)
5. పుట్టినపుడు వాడు గుర్రం వలె ఏడ్చాడు.  అందుచేత అశరీరవాణి ఆ నామకరణం చేసింది. -

No comments:

Post a Comment