ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. 18వ రోజురాత్రి కృష్ణుడొక్కడూ హస్తినాపురానికి
ఎందుకు వెళ్లాడు?
2. ధృతరాష్ట్రుడు చివరకు ఎట్లా తనువు చలించాడు?
3.
“ఆనాడు మమ్ములను ….. అని పరిహసించారు. ఇపుడు మేము మిమ్మల్ని అని పరిహసిస్తున్నామురా” అని
భీముడు,
దుశ్శాసనుడూ దుర్యోధనుడూ పడినప్పుడు అంటాడు. ఆ
మాట ఏమిటి?
4.
ఘటోత్కచుని చావు విని కృష్ణుడు సంతోషించాడుట. ఎందుచేత?
5.
ద్రుపదుడెవని చేత చనిపోయాడు?
సమాధానములు (జవాబులు):
1.
గాంధారి నోదార్చటానికి. అపుడే వ్యాసుడు కూడా వచ్చాడు. కృష్ణుడు ఓదార్చటంలో జరిగిన సంగతులన్నీ
ఏకరువు పెడతాడు. అవన్నీ నిజమని వ్యాసుడు ధ్రువీకరిస్తాడు. – శల్యపర్వము – ద్వితీయాశ్వాసము – 360
వచనము
వ॥పనిచెం గాని ధృతరాష్ట్రు నుద్దేశించి కా దట యచ్యుతుం డరిగి
యప్పటి కుచితం బగువిధంబునఁ గార్యంబు
నడపె నాకర్ణింపు
మట్లు తన్నుఁ బ్రార్ధించిన నప్పురుషోత్తముండు పనితెఱం గడిగి బాండవాగ్రజుండు చెప్ప విని
రథారూఢుండై
యతిరయంబునఁ గరినగరంబున కరిగి మొగసాల నిలిచి యాంబికేయునకుఁ దన రాక
యెఱిఁగించి పుచ్చి తగం జొచ్చి
యంతకమున్న గాంధారీ ద్వితీయుఁ డై కొడుకులదెస వగలం బొగులుచున్న
యమ్మహీకాంతునివలని కారుణ్యంబున
నతనికడకుం జనుదెంచి యున్నకృష్ణద్వైపాయనమహామునిం గని
వినయసంభ్రమంబులు తలకొనఁ దత్పాదంబులకుఁ
బ్రణమిల్లి యక్కురురాజునకు గాంధారరాజనందనకు
నమస్కరించి కులపతిసన్నిధి యగుట నిలాతలంబునం
గూర్చున్న యజ్జననాథుసమీపంబున నాసీనుం డై.
(360)
2.
అడవిలో దావాగ్నికి ఆహుతి అయ్యాడు.
గాంధారి, కుంతి కూడా అలాగే ఆహుతి అయ్యారు.
–
ఆశ్రమపర్వము – ద్వితీయాశ్వాసము –155&156 పద్యములు
ఆ॥ఒక్క తెఱపి సంజయుఁడుచని హిమశైల
మెక్కె నంత వారి నెల్ల నగ్ని
పొదవికొనియె నిట్లు పోయి రమ్మువ్వురుఁ
బుణ్యలోకమునకు భూపవర్య. (155)
సీ॥ పదపడి నృప
యేను భాగీరథీతీరమున వచ్చుచుండి యవ్వనము దివ్య
మునులచే
మీ రటఁ జని క్రమ్మఱంగ వచ్చినది యాదిగ నయ్య శేషవృత్త
మును
నేర్పడఁగ వింటి మూఁడుకళేబరములుఁ గంటి నక్కురుపుంగవుండు
భార్యయుఁ
బాండునిపత్నియు సద్గతి నొందిరి నీవింక నుమ్మలింప
ఆ॥ కుండు మనినశోక
మొదవి యాతఁడు బాహు
లెత్తి
యెలుఁగు చెలఁగ నేడ్వఁదమ్ము
లడలు కదిరి యేడ్చి రవ్వార్త నంతఃపు
రమున రోదనార్తరవము లెసఁగ.
(156)
3.
పశువులు – శల్యపర్వము – ద్వితీయాశ్వాసము – 280 పద్యము
క॥పసు లని యార్చుచు మము ను
ల్లస
మాడినధర్మహీనులను నృపధర్మం
బెసఁగఁగ
నే మిదె యిప్పుడు
పసు లని
యార్చెదము మగుడ బంధుద్రోహీ. (280)
4.
అర్జునుడు బ్రతికాడని – ఇంద్రుడిచ్చిన శక్తితో కర్ణుడు అర్జునుని చంపకుండానే ముందుగానే ఘటోత్కచుని
చంపవలసి వచ్చింది.
– ద్రోణపర్వము – పంచమాశ్వాసము – 239 వచనము
వ॥అనుటయు నయ్యచ్యుతుం డతని కిట్లను నింద్రుండు కుండలంబులు
కొనుచుండి కర్ణుని కిచ్చినశక్తి యతనికడ
నున్నంతకాలంబును నిన్ను బ్రదికించుట దుష్కరం బని తలంచుచుండుదు నేఁడు హిడింబానందనుమీఁద
నదిపోయినం
బ్రమోదంబు నొందితి నాసూతనందనుం డది చేత నుండెనేనిఁ జక్రగాండీవధరుల మై
మనమిరువురముం గవిసితి
మేనియు జయించు నతండు దేవసన్నిభుండు దివిజ పతివేఁడినఁ
గవచకుండలంబులు వికృత్తంబులు చేసి
యిచ్చుట వై కర్తనుండనం బరఁగు నీకై మీతండ్రి యిట్లుచేయఁ
డయ్యెనేని వాని కెదు రెవ్వరు
కవచకుండల విహీనుం
డై మానవసామాన్యంబు నొందుటను
శక్రదత్తసాధనంబులేమింజేసియు నింక నీకు గెలువ వచ్చు నిట్ల యేకలవ్యశిశుపాలజరాసంధాదుల
నీక కా
నొక్కక్క తెఱంగునం బిలుకుమార్చితి నిత్తఱి వార లున్నఁ గౌరవపతి వారలం
దెచ్చుకొను నమ్మువ్వురుఁ
గూడిన నెవ్వరికి నోర్వ రా కుండు ఘటోత్కచుండును గిమ్మీర బక హిడింబులతోడివాఁడ
ధర్మ ద్వేషంబును
రోషంబును గలిమింజేసి యొక్కప్పు డొప్పమి వచ్చుం గావున నద్దానవులయట్ల
వీని పొలసిపోకయు నా
కభిమతంబు వీఁడు రావణునట్టివాఁ డగుట నిపుడు చావకుండెనేనిఁ బదంపడి
నాకుం జంపవలయు నిది
సంతోషకాలంబు కాని శోక సమయంబు కాదు మనమొనలు కలంగెఁ గురుబలంబు
పైకొనియెడు నీవుఁ దెలిసి
యుత్సాహంబు పాటింపు మనియె నని చెప్పిన విని ధృతరాష్టుండు సంజయుదిక్కు మొగం బై.(239)
5.
ద్రోణుని చేత - ద్రోణపర్వము – పంచమాశ్వాసము – 283 పద్యము
శా॥చంచద్బాణపరంపరాప్రహతులన్ సైన్యంబుఁ
గ్రూరోద్ధతిం
జించెం
జించిన నింక నెన్నఁటికి నిస్సీ భూరిబాహాబలం
బంచుం
గూడి కడంగి నొంపఁ గుపితుం డై మత్స్యభూవల్లభుం
బాంచాలక్షితినాథునిం
దునిమె దర్పస్ఫూర్తి శోభిల్లఁగన్. (283)
******************************************
No comments:
Post a Comment