ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.
శ్రీ మహాభారతం చెప్పటానికి వ్యాసమహర్షికి
ఎంతకాలము పట్టింది?
2.
కృష్ణుని సారధి ఎవరు?
3.
శ్రీమహాభారతనికి సంస్కృతంలో మరో పేరుంది,
ఏమిటది?
4.
భారతయుద్దంలో కర్ణుడు ఎన్నిరోజులు యుద్ధం
చేశాడు?
5.
యుద్ధభూమిలో తిరుగుతున్న సంజయుని కొట్టబోయిన
వీరుడెవరు?
-----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
మూడు సంవత్సరములు – స్వర్గారోహణపర్వము – 81వచనము
వ|| పాండవుల కీర్తిం బ్రకటించుటకును
మఱియుం గొందఱు జనపతులచరిత్రంబుల జనుల కెఱింగించుటకును దేవ దేవుం డగువాసుదేవుని సంక్రీడావిశేషంబులు
వివరించుటకును సర్వదేవజాతులజన్మంబులును దదీయసాయుజ్యంబులును దేటపఱచుటకును సకలధర్మంబులునుం
దెలుపుటకును గాఁ బంచమవేదం బయి పరఁగునిమ్మహాభారతసంహిత యొనర్చె నిమ్మహితేతిహాసంబు సంవత్సరత్రయ
కృతంబు దీని విశేషంబు వినుడు. (81)
2. దారకుడు - ఉద్యోగపర్వము – తృతీయాశ్వాసము –
132 వచనము
వ|| దుర్యోధనుండు దుష్టాత్మకుం
డతండు మన్నించు మానుసులునుం గుటిలబుద్ధులు గావునఁ జక్రగదాద్యాయుధంబులు రథంబునం బెత్తింప
వలయు నని చెప్పి పనిచి సమయజ్ఞతం బోడసూపి నిలుచున్నతారుకుం జూచి తేరు పూన్ప నియోగించిన
నతండును మణిగణప్రభాపటలజటిలం బగునరదంబు వన్ని శైలసుగ్రీవమేఘపుష్పవలాహకంబు లనం బరఁగుతురంగంబులం
బూన్చి గరుడధ్వజంబెత్తి తెచ్చినం…. (132)
3.జయము - స్వర్గారోహణపర్వము
– 89 పద్యము
ఉ|| భ్రాజితవృత్తమైఁ బరఁగుభారతసంహిత
సమ్యమీంద్రులా
రా జయనామకంబునను రాజితభంగి
జగత్రయంబునం
బూజితకీర్తియై నెగడు భూరిజయోన్నతిఁ
గండ్రు దీనిచే
రాజు లిలాసురుల్ మఱి యరాతుల గెల్తురు
విన్నయంతటన్. (89)
4.7 1/2రోజులు; భీష్ముడు
పడిపోయిన తరువాత కర్ణుడు యుద్ధానికి వచ్చాడు. ద్రోణుని అధ్యక్షతలో
5రోజులు; తన అధ్యక్షతలో 2 1/2రోజులు – ఆదిపర్వము – ప్రథమాశ్వాసము – 68 పద్యము.
క|| పదిదినము లైదు ప్రొద్దులుఁ
పదపడి రెన్నాళ్లు నొక్క పగలున్ రేయున్
మదమున రణ మొనరించిరి
నదిసుతగురుకర్ణశల్యనాగపురీశుల్. (68)
5.సాత్యకి –
అపుడు వ్యాసుడు కనపడి వారించాడు. – శల్యపర్వము – ద్వితీయాశ్వాసము – 8 వచనము
వ|| ఆశైనేయుండు వాలుపెఱికి
వ్రేయం జూచునంతఁ గృష్ణద్వైపాయనుండు సన్నిధిచేసి యతని వారించి సంజయుం జంపుట యనుచితంబు
ముందల విడువుమని యానతిచ్చిన నతండును వినతుం డై యట్ల కాక యని పలికి నన్ను విడిచెఁ గృష్ణద్వైపాయనుండు
మదీయాననం బాలోకించి బ్రదికిపోయి తెక్కడకైనం బొ మ్మనుటయు నమ్మునీంద్రు వీడ్కొంటి నంత
నతఁ డంతర్ధానంబు చేసె నేను దత్ప్రదేశంబు పాసి నీసుతుండు చనిన చక్కటికిఁ గ్రోశమాత్రంబు
పోయి ద్వైపాయనం బనం బ్రసిద్ధం బైన యమ్మడువు సమీపంబున. (8)
****************************************************************************************
No comments:
Post a Comment