ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.
అజ్ఞాతవాసంలో నకులుని పేరేమి?
2.
గురుని కేతనం ఏమిటి?
3.
యుద్ధంలో మొదటిరోజు పాండవుల పక్షాన చచ్చిన
ప్రసిద్ధుడెవరు? ఎవరిచేత?
4.
బభ్రువాహనుడెవరు?
5.
యుధామన్యుడెవరు? ఎవరి చేతిలో చనిపోయాడు?
------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
దామగ్రంధి – విరాటపర్వము – ప్రథమాశ్వాసము –
96 పద్యము
క|| దామగ్రంధి యనఁగ నొక
నామము
వెట్టుకొనువాఁడ నాతొంటివిధం
బామనుజేశ్వరుఁ
డడిగిన
నే మీకడవాఁడ
నందు నిది దెఱఁ గధిపా. (96)
2.కాంచనమయ వేదిక – భీష్మపర్వము – ప్రథమాశ్వాసము – 87
పద్యము
సీ|| కాంచనమయ వేదికాకనత్కేతనోజ్జ్వలవిభ్రమం
బొప్పఁ గలశజుండు
గనకగోవృషసాంద్రకాంతికాంతధ్వజవిభవవిలాసంబు
వెలయఁ గృపుడు
మణిసింహలాంగూలమహిత కేతు ప్రభాస్ఫురణంబు
మెఱయంగ గురుసుతుండు
రత్న శిలారశ్మి రాజితకదళికామహిమ శోభిల్లంగ
మద్రవిభుఁడు
తే|| వెడలి తమతమచతురంగవితతు
లెల్ల
నుచితగతి నూల్కొనంగఁ జేయుచు గడంగి
సంగరోత్సవసంభృతోత్సాహు లగుచు
నగుచుఁ దగుమాటలాదుచు నడచి రెలమి.
(87)
3. ఉత్తరుడు – శల్యునిచేత – భీష్మపర్వము – ప్రథమాశ్వాసము – 283 పద్యము
తే|| శల్యుఁ డుగ్రకోపంబున శక్తి
యెత్తి
రయము మెఱయ వైరాటియురస్థ్సలంబు
దూఱ వైచిన నంకుశతోమరములు
విడిచి నడుమన చచ్చుచుఁ బుడమిఁబడియె.
(283)
4. అర్జునునికి చిత్రాంగద యందు కలిగినవాడు.
–
ఆదిపర్వము – అష్టమాశ్వాసము – 163 వచనము.
వ|| ….నర్జనుండును గ్రమ్మఱి మణిపూరుపురంబునకువచ్చి రాజ్యలీల సుఖం బుండి చిత్రాంగదయందు
బభ్రువాహనుం దనుపుత్రుం బడసి చిత్రవహనునకు వంశకరుంగా నిచ్చి వాని వీడ్కొని గోకర్ణంబుఁ
జూచుచు బశ్చిమసముద్రపార్శ్వంబునఁ బ్రభాసం బను తీర్థంబునకుఁ జని యందులకు ద్వారవతీ పురంబు
కుఱంగలి యని విని. (163)
5. ద్రుపదపుత్రుడు – అశ్వత్థామ 18వ రోజు రాత్రి
చంపాడు. – సౌప్తికపర్వము – ప్రథమాశ్వాసము - 169 పద్యము
సీ|| అలికిడి మేల్కనునతని ధృష్టద్యుమ్నుఁ
బట్టినక్రియఁ దలపట్టి యీడ్చి
యాతనిఁ జంపినయట్టులు పశుమరణాతికౌతుకమున
నవనిఁ బెట్టి
చంప నచ్చేరువఁ జప్పరంబున శయనించు యుధామన్యుఁ
డెఱిఁగి కడఁగి
చనుదెంచి రాక్షసుఁ డని తలంచియుఁ గొంకు
పెట్టక పెనుగద బెట్టు వ్రేయ
ఆ|| వ్రేటు వడి చలింప కాటోపదీపితుఁ
డగుచు గురుతనూజుఁ డక్కుమారు
నగ్రజన్ముఁ బోలె నుగ్రత వధియించెఁ
గాని ఖడ్గలీల కలుగదయ్యె. (169)
********************************************************************************************
No comments:
Post a Comment