Translate

01 May, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 078 (386 – 390)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1. సైంధవుని తండ్రి ఎవరు?
2.పాండవులకు శల్యుడేమవుతాడు?
3. అభిమన్యుడు ఉపపాండవులు వీరిలో పెద్ద ఎవరు?
4.ధర్మరాజు యొక్క శంఖం పేరేమి?
5.ధర్మరాజు యొక్క అశ్వమేథం గురించి ఒక ముంగిస విమర్శ చేసింది ఏమని?
---------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.వృద్ధక్షత్రుడు ద్రోణపర్వముచతుర్థాశ్వాసము – 328 వచనము
వినుము వృద్ధక్షత్రుండనుసింధుదేశాధీశుండు సంతానకరణతపోవిశేషంబున నీ జయద్రథుం బడసె నితండు కుమారుం డై వర్తిల్లుసమయంబున నొక్కనాఁ డశరిరవాణివీఁడు సంగ్రామంబున నేమఱి తలదునుమం బడు నని యాదేశించిన నతం డెల్లవారును విన వీనిమస్తకంబు మహిం బడ నెవ్వఁ డేసె వానిశిరంబు శకలశతం బయ్యెడు మని తనతపంబుబలిమిం బలికి యతనిఁ బట్టంబు కట్టి వనంబునకు నియతుం డై యరిగె నట్లు కావున. (328)

2. మేనమామ మద్రదేశానికి అధిపతి.  మద్రదేశపు కూతురు మాద్రి ఆమె నకుల సహదేవుల తల్లి. శల్యపర్వము ప్రథమాశ్వాసము – 93 పద్యము
 అతఁడు మేనమామ యనుకృపతక్కుము
     రాజధర్మమును బురస్కరించి
     యతులవిక్రమక్రియాపాటవంబున
     నవిరోధినామ మడఁప వలయు. (93)

3.  అభిమన్యుడు ఆదిపర్వము అష్టమాశ్వాసము – 226 , 227 & 228
|| ఇ ట్లుదయించిన యభిమన్యుండు దల్లి దండ్రులకు సకలజనులకు నానందంబొనరించుచు ధౌమ్యనిర్మితజాతకర్మచౌలోపనయనుం డయి పెరుఁగుచు. (226)
మత్తకోకిలము|| ఆదిఁగోలెను గృష్ణుచే దయ నావృతుం డయి ధౌమ్యుతో
                       వేద మంగయుతంబుగాఁ జదివెన్ ధనంజయుతో ధను
                       ర్వేద మిమ్ముగ నభ్యసించెఁ బ్రవీరవైరిపతాకినీ
                       భేదమార్గము లెల్ల నేర్చె నభేద్యవిక్రమసంపదన్. (227)
|| అంత ద్రుపదరాజనందనయుం గ్రమంబునఁ బాండురాజనందనులవలనఁ బ్రతివింధ్య శ్రుతసోమ శ్రుతకీర్తి శతానీక   శ్రుతసేను లనువారిఁ బంచోపపాండవులను సుపుత్రులం బడసిన. (228)

4. అనంతవిజయము - భీష్మపర్వము- ప్రథమాశ్వాసము- 176 వచనము
|| అప్పుడు కృష్ణార్జునులు పాంచజన్యదేవదత్తంబులును భీమసేనుండు పౌండ్రంబును యుధిష్ఠిరుం డనంతవిజయంబును నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును పాంచాల విరాట సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖదండ నాయకులు తమతమశంఖంబులుఁ బూరించిన. (176)

5.  సక్తుప్రస్థుని ధర్మంతో ఈ యజ్ఞం ఏ మాత్రమూ సరిపోలదని. అశ్వమేధపర్వము చతుర్థాశ్వాసము 218 పద్యము
సీ|| ఒక్కబిలంబుననుండి వెల్వడి యొక్కనకులంబు విప్రజనంబునడుమ
     నిలిచి సక్తుప్రస్థునలఘుధర్మంబు నేమియుఁబోల దీయశ్వమేధ మనిన
     నవ్విప్రు లతివిస్మయం బంది యమ్ముంగిఁగనుగొని మంత్రవర్తనముఁ దంత్ర
     గమనికయును వివిధములైమ దానవిధుల బహుళత్యాగములను లోక
తే|| సంస్తుతము లయ్యె భక్తియు శ్రద్ధయును బ్రి
     యంబు వినయంబు సురమునిహర్ష మావ
     హిల్లఁ జేసె నీ వేమిట నిమ్మహాధ్వ
     రంబుఁ గీడంటి చెప్పుమ ప్రస్ఫుటముగ. (218)
************************************************************************************************

No comments:

Post a Comment