ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ఎవరి ప్రేరణతో ధర్మరాజు అశ్వమేధయాగానికి
పూనుకొన్నాడు?
2. యాదవ వినాశాన్ని గురించి ధర్మరాజుకు
తెలిపిన దెవరు?
3. ధర్మరాజు నరకం చూడటానికి కారణం ఏమిటి?
4. మహాప్రస్థానానికి బయలుదేరిన వారెంత మంది?
ఎవరు?
5. విరాటుని దేశం పేరేమి?
సమాధానములు (జవాబులు):
1.
వ్యాసుని ప్రేరణ – అశ్వమేధపర్వము – తృతీయాశ్వాసము – 209 పద్యము
ఆ॥తురగ మేధ మఖిలదుష్కృతహరము నీ
వది సమరదక్షిణాన్వితముగఁ
జేసి
నిర్మలత్వభాసమానుండ వై
వెలయు మమృతకిరణకులవరేణ్య.
(209)
2. దారుకుడు – కృష్ణుని సారధి – మౌసలపర్వము – ఏకాశ్వాసము – 95
పద్యము
సీ॥అవనీశ విను మంత నద్దారకుఁడు చని పాండవేయులఁ గని పరమమునులు
యాదవకులముఁ
బేరలుకమైఁ దొల్లి శపించుట మునుఁ దలఁపించి పిదప
జలధితీరముల
నాసవపానమత్తు లై వృష్ణిభోజాంధకవీరు లెల్ల
మునివరనిర్దిష్టముసలాత్మకము
లైనముయ్యంచుతుంగల మోఁదులాడి
తే॥పేర్చి యొండొరువులఁ బరిమార్చుటయును
రామకృష్ణులయునికియు
నామురారి
తన్నుఁ
బుత్తెంచుటయు సవిస్తారభంగిఁ
జెప్పె
వరలు పెనువగఁ జేడ్పడంగ. (95)
3.రాజయినవాడు నరకం ఒకసారి చూడాలి గనుక
– స్వర్గారోహణపర్వము – ఏకాశ్వాసము -38 పద్యము
క॥విను మొక్కటి చెప్పెద రా
జనువానికి
నెల్లఁ దప్ప దవనీశ్వర యె
ట్లను
నారకస్థలంబుం
గనుఁగొనవలయు
టిది వేదకథితము సుమ్మీ. (38)
4. ఏడుగురు-పాండవులు
– 5గురు, ద్రౌపది, కుక్క. – మహాప్రస్థానికపర్వము – ఏకాశ్వాసము – 19
వచనము
వ॥వల్కలాజినంబులు ధరియించినం దమ్ములు ద్రౌపదియు నట్లు చేసి
రందఱుం దత్కాలోచితంబు లగు నిష్టావిధానంబు లాచరించి యగ్నుల నంబుగతంబులు చేసి మొగంబులం
దెలి వగ్గలింప గృహంబు వెలువడి రప్పుడు ద్రౌపది షష్ఠత్వనిష్ఠం బోవ సప్తమం బై యొక్క సారమేయంబు
వారల వెనుకఁ జనియె నప్పుడు. (19)
5. మత్స్యదేశం- విరాటపర్వము
– ప్రథమాశ్వాసము – 64 పద్యము
ఆ॥నాకుఁ జూడ మత్స్యనరపతిసద్ధర్మ
వర్తి
సుజనహితుఁ డవార్యబాహు
బలుఁడు గాన నతనిపాల నందఱుఁ దగ
వైనపనుల నిలుచు టభిమతంబు.
(64)
*******************************