తాతయ్యచెప్పిన కథ (1997)
అది వైశాఖమాసం, ఎండ తీవ్రత ఎక్కువైంది.రోజూ సాయం సమయంలో తను వెళ్ళి కూర్చుని గతాన్ని నెమరువేసుకొనే పార్కులోకిదారి తీసారు రామయ్యగారు. ప్రభుత్వంవారి పుణ్యమా అని, సంధ్యాసమయంలో దీపాలు వెలిగించుకొనడానికికూడా నోచుకొని రోజులవి. ఇక ఎండ ఉక్కకు ఉపసమననాకి వాడే కూలర్స్,పంకాలుకు స్వస్తి చెప్పి అందరూ ఒంటరిగా, జంటగా,గుంపుగా, దిగులుగా, కేరింతలుకొడ్తూ బిల, బిలా ఆ ఊరిలోఉన్న అపురూపమైన పార్కుకు చేరుకుంటారు.
దీపాలు లేకపోయినా,అ పార్కును దత్తత తీసుకొన్న కొందరి ధర్మదాతల పుణ్యమా అని, ఆ పార్కుని తన కన్నబిడ్డ వలె కాపాడుకొంటూ వస్తున్న తోటమాలి రంగయ్య నిరంతర శ్రమవలన,చల్లని సువాసనలు వెదజల్లే పూలచెట్లు, పట్టుపరుపులాంటిమెత్తని పచ్చిక వారందరికీ ఓ వరం! ఓ దివ్యస్థలి. అటువంటి అ పార్కుకి రామయ్యగార్కిఓ మరుపురాని మధురమైన బంధం. తను భద్రతాధికారిగా బొంబాయిలో ఓ మిల్లులోఉద్యోగ విరమణ చేసి, తన శేషజీవితాన్ని ప్రశాంతంగా తన స్వస్థలంలోగడపాలని తనకు రావలసిన మొత్తం డబ్బును తీసుకొనివచ్చి, ఈ ఊరిలోఓ ఇల్లు కొనుకొన్నారు. పిల్లాజెల్లా బాదరబందీ లేకపోవటంతో రోజూ కాలక్షేపానికి ఈ పార్కుకు వచ్చేవారు. అలా గత పదిహేను సంవత్సరాలనుంచీ వస్తున్నారు. కానీ, ఐదు సంవత్సరాలక్రితం జరిగిన ఓ సంఘటన రామయ్యగారి రాకకు ఓ మలుపు, ఓ ప్రత్యేకతచేకూర్చింది.
ఆరోజు, రామయ్యగారు ఎప్పటిలాగే సాయంత్రం పార్కులో కుర్చుని ఉన్నారు. ఇంతలో ఓ ఆక్రందన… “అమ్మా!”అన్న కేక, వెనువెంటనే కీచుమని పెద్ద శబ్దంచేస్తూ బస్సు ఆగిన శబ్దం. అరుపులు, కేకలు…
ఏమిటా అని బయటకు వచ్చిన రామయ్యగారు,రక్తపుమడుగులో పడిఉన్న ఓ పదేళ్ళ బాలున్ని చూసి.. ఒక్కసారి నిశ్చేష్టుడై, వెంటనే తన గత ఉద్యోగానుభవం వెన్నుతట్టగా..ఒక్కసారి, ఆ బాలుడు దగ్గరకు చేరుకొన్నారు. అప్పటికే, చాలామంది ఏమిచేయాలో తోచక వింతచూద్దామన్న వింత తాపత్రయంతో నెట్టుకొని ముందుకొస్తున్నారు. కొంతమంది, బహుజాగ్రత్తపరులు, ఎందుకొచ్చిన పెంట.. ఇక్కడుంటేపోలీసులు, సాక్షాలూ, కక్షలూ తలనొప్పనుకొంటూచకచక దాటి వెల్తున్నారు. బాలుడి నాడి చూసిన రామయ్యగారు చలించి పోయారు. తలకు బలమైన గాయం తగలడమ్తో,ఆ పదేళ్ళ పసిప్రాణం అప్పటికే అనంతవాయువులో కలసిపోయింది. ఈలోగా పోలీసుస్టేషన్ దగ్గరలోనే ఉండటంతో,పోలీసులు రంగంలోకి దిగి తమ కర్తవ్యాన్ని వారు చేసుకొనిపోతున్నారు.
ఆరోజు ఇంటికి తిరిగివెళ్ళినరామయ్యగారు మనసు భారంతో చాలా మదన పడ్డారు. దానికితోడు తన సర్వీసులో జరిగిన కొన్ని దురదృష్టకర ప్రమాదాలుఒక్కసారి స్ఫురణకువచ్చి మనసును మరింత కలతపర్చాయి. కానీ, అనుభవంనేర్పిన మనోనిబ్బరంతో ఒక నిశ్చయానికి వచ్చారు రామయ్యగారు ఆ రాత్రి. అది…. రోజూ తను వెళ్ళే పార్కులోకిచాలామంది పిల్లలు వస్తుంటారు. వారికి తన అనుభవ సారాన్ని చిన్న చిన్న కథలుగా వీలుపడ్డప్పుడల్లా చెప్తుంటే,వారికి చిన్నప్పటినుండే ‘భద్రత’మీద అవగాహన ఏర్పడి, వారి జీవితాలు,వారి భవిష్యత్తు భద్రంగా మలుచుకోవడానికి వీలుకలుగుతుందన్న ఆలోచనే– రామయ్యగారి నిశ్చయం.
అంతే, మరుసటిరోజునుంచి ఆ పార్కుకు వచ్చే చిన్న చిన్న పిల్లలతో మెల్లగా మాటలు కల్పి,కొద్దిరోజులలోనే, ‘తాతయ్యా! తాతయ్యా!’ అని పిలిపించుకొనే బంధాన్నిఏర్పరుచుకొన్నారు. అంతే,అప్పటిదాకా స్థబ్ధతగ ఉండే రామయ్యగారి జీవితంలోకి ఓ స్పందన వచ్చింది. తనకు మనుమలు, మనుమరాండ్రు లేరన్న అంతర్గత లేమి ఈరోజు లేదు. ఎందరో అప్యాయతను,అనురాగాన్ని చూరగొనఁగల్గుతున్నారు.
పార్కులోకి చేరుకొన్న రామయ్యగారు, తాము రోజూ కూర్చునేఅశోకవృక్షం దగ్గరకు వచ్చారు. అప్పటికే, ఓ అరడజను మంది పిల్లలు చేరి తన కోసం ఎదురుచూస్తున్నారు. వారంతా ఒక్కసారి లేచి..
‘తాతయ్యవచ్చారు… తాతయ్య వచ్చారు’
అంటూ చేతులుపట్టి లాక్కొనివెళ్ళి కూచోబెట్టారు. రామయ్యగారు, ఒక్కసారి తన పైకండువాతో ముఖానికి పట్టిన చమటను ఒత్తుకొని, గాలి సరిగలేక స్థంభించడమ్తో కండువానే విసనకర్రలాగా విసురుకుంటూ…
“ఇక మన కథ మొదలుపెట్టుకుందామా పిల్లలూ?” అన్నారు.
“ఊ… ఇప్పటికే లేటయిపోయింది తాతయ్యా!త్వరగా చెప్పు మరి.. అన్న పిల్లల్ని ఆప్యాయంగాచూస్తూ—
“ఈరోజు పరిశుభ్రతగురించి తెల్సుకుందామే!! ఎందుకంటే పరిశుభ్రతఅన్నది మనందరికి చాలా అవసరం. ఈ పరిశుభ్రత అన్నది, మన ఇంట్లో, మన వీ ధిలో, మన ఊరిలో, మనము చదువుకొనేస్కూల్సులో, మనం ప్రయాణించే బస్సులలో, రైల్లలో,రేపు మీరు పెద్దైన తరువాత పనిచేసే ఆఫీసులలో, ఫ్యాక్టరీలలోప్రతిచోట ఎంతో అవసరం. కాబట్టి పిల్లలూ! మీరు పరిశుభ్రత అన్నది ఇప్పటినుండేఅలవర్చుకోవాలి సుమా!!
ఆఁ…రామూ! నీవు చెప్పు.. పరిశుభ్రత వల్ల కల్గే లాభాలు, నీవు స్కూలు పాఠాలలో చదివుంటావుగా…”అని ఓ అబ్బాయిని ప్రశ్నించారు.
“ఓ యస్…తాతగారూ…ఎందుకుచెప్పలేనూ…. ఆఁ…ఒకటి…పరిశుభ్రంగ మనం రోజూ స్నానంచేస్తూ, బట్టలు మురికి చేసుకున్నా, రోజూఉతికి శుభ్రం చేసుకొని వేసుకుంటే మనకు చర్మవ్యాధులురావు. మన శరీరం కంపుకొట్టి, మనలను చూసి ప్రక్కకు తప్పుకొని ఎవరూ పోరు… మనతో దోస్తీకి ఎక్కువమంది వస్తారు. రెండు… మన పుస్తకాలు, పెన్నులు, నోట్సులు అన్నీ వాటిని మన ఇంట్లో జాగ్రత్తగాఅలమారులోకాని, పెట్టెలోకాని ఒక చోట గుర్తుగా పెట్టుకోవాలి;అలాగైతే మనకు అవసరమైనపుడు ఎతుక్కునే శ్రమ ఉండదు. అంతేకాదు… మన నోట్సులు, కాగితాలు అమ్మవాండ్లకు సరిగా తెలియకపోతే, ఏవో చెత్తకాగితాలనిచెత్తబుట్టలో పారవేయవచ్చు, లేదా ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాల్సివస్తే,వీ టిలో పొట్లంకట్టి ఇవచ్చు!! ఆఁ … ఆఁ … సోఫాలో, కుర్చీలలో పడేస్తే, ఎవరన్నా పసిపాపలు వస్తే వాండ్లు వాడితోఆడుకొని చించివేస్తే మనం మరలా కష్టపడి రాసుకోవాలికదా!!”
“భేష్! రామూ చాలాచక్కగా చెప్పావు. ఆఁ..కమల నీవు చెప్పమ్మా…”
“మరేమో తాతయ్యగారూ… జోళ్ళు, బట్టలు .. అవి కూడా జాగ్రత్తగావాటి జాగాల్లో ఉంచాలి. నేను ఓ రోజు నా వైట్ సాక్స్ విడిగ పడేసాను… మా అమ్మగారు ఉతకాలేమో అని తడిపారు, ఉతికి ఆరేయటం మర్చిపోయారు; దానితో మర్నాడు నేను బూట్లులేకుండా వెళ్ళాను. స్కూలునించిపంపించి వేసారు కూడా!!” అంటూ తన స్వానుభావాన్ని చక్కగాఅరమరికలేకుండా చెప్పిన కమలను భుజం తట్టి అభినందించి తను చేస్తున్న ప్రయత్నానికి చక్కటి ఫలితం కన్పించటంతోఆనందంగా రామయ్యగారు…..
“పిల్లలూ… మీరు చెప్పిన ఈ పరిశుభ్రతా సూత్రాలనే మేము ఫ్యాక్టరీలలో ‘గుడ్ హౌస్కీపింగ్ – పరిసరాల పరిశుభ్రత ‘అంటాము. దీనివలన ఎంతో పెద్ద ప్రమాదాలను, ఆస్తి, ప్రాణ నష్టాలను ఆపడానికి వీలు కలుగుతుంది. ఎలాగంటే, ఒకఫ్యాక్ట్రీలో కావల్సిన పరికరాలు, వైర్లు, బోల్టులు, నట్లు మొదలైనవన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చిఉంచాలి;అలాకాక పోతే, అవి సరైన టైములో దొరకకపోతే,పనికి ఆటంకం కల్గి, ఉత్పప్తికి నష్టం రావచ్చు. తర్వాత ఆ పని చేసేవారు మాటపడవలసివస్తుంది. అంతేకాక, దారికిఅడ్డంగా ఉంటే, కాలికి గాయాలు కల్గించవచ్చు సుమా!”
“అలాగే ఓ చిన్న సిగరెట్టు లేదాబీడీ కాల్చి అజాగ్రత్తగా పారేసిన ముక్క ఓ పెద్ద అగ్ని ప్రమాదాన్ని కల్గించవచ్చు. ముఖ్యంగా, పూరిపాకలవద్ద,కాగితం, కలప, పొట్టు,కిరసనాయిలు, పెట్రోలు బంకులవద్ద ఇ విషయంలో చాలజాగ్రత్తగా ఉండాలి. అలాగేపిల్లలూ! మీరు ఏదన్నా నుని అదీ పారబోసిన వెంటానే గుడ్డతో శుభ్రంగాతుడిచి, అవసరం అయితే శుబ్రంగ కడిగించాలి; లేకపోతె కాలు జారి పడి, ఎముకలు విరిగి ఆసుపత్రి పాలుకావలసి ఉంటుంది. అలగేఫ్యాక్టరీలలో కూడా గ్రీజు, ఆయిలు వాడుతుంటారు. అవి ఒలికితే అశ్రద్ధ చేస్తే చాలాప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.”
“ఇక లేవండి.. పిల్లలూ.. చాలా సేపైంది. మీ ఇండ్లలలో మీకోసం ఎదురు చూస్తుంటారు. జాగ్రత్తగా వెళ్ళండి సుమా!రోడ్డు మీద దిక్కులు చూస్తూ వెళ్లకండి…. అసలే గోతుల రోడ్లూనూ…”అంటూ రామయ్యగారు, బట్టలకు అంటుకొన్న గడ్డిని దులుపుకొని, పిల్లలతో పార్కుబైటికి వచ్చారు. మునిసిపాలిటీవారి రేడియోలో అపుడే కరెంటు వచ్చినట్లున్నది., ‘బహుదూరపు బాటసారి! నీ పయనమెటు..’అంటూ గరగర శబ్దం చేస్తున్నది.
సర్వేజనాఃసుఖినోభవంతు।
సర్వేజనాః భద్రతానుగ్రహ ప్రాప్తిరస్తూ॥

No comments:
Post a Comment