శృతిమించిన పరాచికం - బావగారి ఇరకాటం (భద్రతా నేపథ్య లఘు కథ)
“అమ్మా!” అంటూ గట్టికేక వినపడగనే,అందరూ ఒక్కసారి హాల్లోకి గాబరాగా వచ్చి ఈజీచైర్ మధ్యలో ఇరుక్కుని క్రిందపడి లేవటానికి ప్రయత్నిస్తున్న రామన్ని చూసి నిశ్చేష్టులైనారు. అందరిలోకి పెద్దవారైన రామం మామగారు,నొచ్చుకొంటూ… “బాబూ… దెబ్బ గట్టిగ తగిలిందా?” అంటూ సాయంపట్టి రామాన్ని లేవతీసి,మెల్లగా నడిపించుకొనివెళ్ళి లోపల పందిరిమంచం మీద పడుకోబెట్టారు.
ఈలోగా, అపుడే ప్రక్కింటి స్నేహితురాలి దగ్గరనుండి పుస్తకం తీసుకొని లోపలికి అడుగుపెట్టిన వాసంతి, అందరూ హైరానా పడుతూ, తన కోసమే ఎదురుచూస్తున్నట్లు గ్రహించి,ఏమి తెలియనట్లు లోపలి తొట్రుపాటును కప్పిపుచ్చుకొనటానికి ప్రయత్నిస్తూ….
“ఏమైంది?ఏమిటి హడావుడి? అంటూ ప్రశ్నిస్తున్న వాసంతిని, కూతురు నిర్వాకం గ్రహించిన రామం అత్తగారు తన సహజ ధోరణిలో ….
”ఏమైందా?నిన్ను నిలువున చీరేసినా పాపం లేదు. నీవు చేసిన నిర్వాకం వలన బావగరు కుర్చీలో కూర్చోబోయి క్రింద పడ్డారు. ఎన్నిసార్లు చెప్పాను నీకు…అమ్మాయీ! పరాచికాలకు హద్దుండాలని. ఆకుర్చీపట్ట కఱ్ఱ నీవే కదూ తీసింది? నిజం చెప్పు…ఆ పని మీనాన్నగారు,నేను,అక్క చేయలేదు….ఇపుడు బావగారికి గట్టి దెబ్బ తగిలి ఏదన్నా ఐతే….ఎంత అప్రదిష్ట!!!”అని సణుగుకొంటూ రామాన్ని విచారించడానికి లోనికి వెళ్ళింది.
ఆ రాత్రి రామానికి నెప్పి ఎక్కువ అవటంవలన, తాత్కాలికంగా ఉపశమనానికి,బ్రూఫెన్ మాత్రవేసి మర్నాడు ఉదయం రామం మావగారు డాక్టరు దగ్గరకు తీసుకొనివెళ్ళారు.అనుకొన్నంతా అయింది. రామం పడటంలో వెన్నుపూసచివరిది కొంచెం చిట్లిందని డాక్టరు చెప్పారని చెప్పగనే మరలా అందరూ ఒక్కసారి వాసంతిమీద విరుచుకుపడ్డారు.
అంతనొప్పిలోను, బేలగా తనలో తను కుమిలిపోతు,పెద్దల చీవాట్లకు జవాబు చెప్పలేక, చేసిన దానికిపశ్చాత్తాపపడుతూ నేల చూపులు చూస్తున్న వాసంతిని చూచి, రామం వాతావరణాన్ని తేలికపరచడానికాఅన్నట్లు….
“వాసంతీ!ఇలారా…నాకేమి కాదులే…ఇంజక్షనులు వాడితే నెప్పితగ్గి, నిదానంగా ఎముక మాములు అవుతుందని డాక్టరుగారు చెప్పారు. పరాచికాలు ఒక్కోసారి చాలా ప్రమాదభరితాలు సుమా! ఇకమీదటఎప్పుడూ ఇలాచేయకేం…మేము కాలేజీలో చదివేటప్పుడు జరిగిన సంఘటన ఒకటి చెప్తా విను…..పరాచికాలు ఎంత ప్రమాదానికి దారితీస్తాయో నీకే తెలుస్తుంది.” అంటూ తను కాలేజిలో చదువుకొనేటప్పుడు కెమిస్ట్రీ లాబ్ లో జరిగిన ఒక ప్రమాదాన్ని చెప్పడం మొదలుపెట్టేడు రామం.
“బియస్సీచదివేరోజలవి,మామూలుగా లాబ్లో ఒకరిమీదొకరు డిస్టిల్డ్ వాటరును వాష్బాటిల్తో పిచికారి చేసుకొంటూ పరచికాలాడుకొనటం మామూలే. డిమానుస్ట్రేటర్లు, లెక్చరర్లుచూసి కోప్పడడంకూడా జరుగుతుండేది. ఒకరోజు, తను సరదాగా తన ప్రక్క బెంచిపైన ఉన్న వాష్బాటిలు తీసి తన క్లాసుమేటు చొక్కాపై వెనుకవైపు గట్టిగా పిచికారి చేసాడు. అంతే…అతను కెవ్వుమని కేక వేసాడు. ఏమిటాని చూస్తే, చొక్కా అంతా తడిసి, వీపు మండుతున్నదని అతను గబ, గబా చొక్కావిప్పుకొని, టాపుక్రిందకి నీళ్ళుపోసుకుందుకు పరిగెత్తాడు.. ఎమిజరిగిందో తను తెలుసుకొనేలోపలే, హెడ్డు గారు రావటం, తన్ను తన రూములోకి తీసుకొనివెళ్ళి, తనను నోరు విప్పనీయకుండ అరగంటగట్టిగా వాయించి, కొట్టకుండానే కొట్టినంతపని చేసి, మొదటి తప్పిదం కనుక అపాలజీ లెటరు వ్రాయించుకొని ఒదిలిపెట్టారు.. ఈలోగా, మాక్లాసుమేటుని మిగతావాండ్లు ఫస్ట్ఎయిడ్ సెంటరుకు తీసుకొనివెళ్ళి ప్రధమచికిత్స చేయించారు. ఆ తరువాత, పాపం నా కారణంగా అతను వారం రోజులు కాలేజికి రాలేకపోయినాడు.. ఇంతా జరిగింది ఏమటంటే, ఇంకో అతను, తన ప్రక్కవానిని ఎడిపించడానికి, అతని ఎక్స్పరిమెంటును పాడు చేయాలని, డిస్టిలు వాటరు బాటిల్లో సల్ఫూరిక్ యాసిడు కలిపాడు., అది నాకు తెలియక నేను మామూలు డిస్టిలు వాటరనుకొని పిచికారి చేసాను. ఇప్పటికీ తనుకల్సినప్పుడెల్లా, ఆ సంఘటన తల్చుకొని సిగ్గుపడుతుంటాను…” అని, చెప్పడం పూర్తిచెస్తూ……
“కాబట్టి,వాసంతీ! నాకు తగిన శాస్తి ఈవిధంగా జరిగిందిలే…నీవేమి బాధపడకు, కాని, ఇంకెప్పుడూ శృతిమించిన పరాచికాల జోలికి వెళ్ళకుసుమా…!” అని సుతిమెత్తని హెచ్చరిక చేసాడు..
రామం మావగారు కల్పించుకొంటూ –“అవును బాబు, నీవు చెప్పింది అక్షరాలా నిజం! నేను ఫ్యాక్ట్రీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఇలాంటిదే జరిగిందంటూ …తను చూసిన శృతిమించిన పరాచికంవలన కల్గిన అనర్ధాన్ని చెప్పడం మొదలుపెట్టారు.
“ఒక రోజు, మా కొలీగు ఒకరు, పరాచికానికి కంప్రెస్డ్ ఎయిరు ప్రక్కవాని ముఖము మీదికి పెట్టాడు.. అంతే,అతను,“అమ్మా!” అంటూ కండ్లు మూసుకొని “మంట…మంట…కండ్లు మండుతున్నాయి”అని కూలబడ్డాడు. వెంటనే దాక్టరు దగ్గరకు తీసుకొనివెళ్ళితే, అదృష్టవశాత్తు,ఇనుపరజనేమి కంట్లో గుచ్చుకోలేదు.కండ్లు శుభ్రంగా క్లీనుచేసి,ద్రాప్స్ వేసి, ఆయింటుమెంటు ఇచ్చి పంపారు.అప్పటినుండి,కంప్రెస్డ్ ఎయిరుతో పరాచికలు మానివేసాము.”అని,రామం మావగారు తన అనుభవాన్ని చెప్పడం పుర్తిచేసారు.
ఇంతలో రామం అత్తగారు, వంటింటిలోనుండి …“సరే,ఇకచాలు…రండర్రా!అన్నం చల్లగా పోతోంది,అన్నాలు తిందురు…”అని పిలివటంతో …
రామం వాసంతితో..” ‘శృతిమించిన పరాచికం-మాబావగారికి ఇరకాటం’ అని నీవు ఓ కథ రాయకూడదూ…కావాలంటే మీ అక్కయ్య సాయం తీసుకో…” అంటుంటే..
“కథ కంచికి, మనం వంటింట్లోకి” అంటూ రామం మామగారు,అందరిని వంటింటివైపు తీసుకొనివెళ్ళారు.. ||౧౦-౦౬-౨౦౧౩||||10-06-2013||

No comments:
Post a Comment