జగద్గురు శ్రీ శంకరాచార్య విరచిత శ్రీభజగోవిందము – శ్రీసాయం
వరదదాసు (శ్రీవ్యాసాశ్రమము,యేర్పేడు) గారి తెనుగు తోహర (1982) ఆధారంగా….
__/\__
భజగవిందం భజగోవిందం
భజగోవిందం మూఢమతే!
సంప్రాప్తే సన్నిహితేకాలే
నహి నహి రక్షతి డుకృఙ్కరణే|| ||భజగోవిందం|| (01)
ఓ మందమతీ! ఎంత వ్యాకరణపండితుడవైనా చివరలో చావు తప్పదురా, అందుకని, “గోవిందా” యని హరినామస్మరణ చేయరా ఓమూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకుశ్రీ శంకరాచార్యులవారు అనుగ్రహభాషణం చేసారు. ||27-01-13||
మూఢజహీహి ధనాగమతృష్ణాం
కురు సద్భుద్ధిం మససి వితృష్ణామ్|
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తంతేన వినోదయచిత్తమ్|| || భజగోవిందం|| (02)
పూర్వజన్మ పుణ్యం వలన కలిగిన ధనంతో సంతృప్తి చెందాలి;అత్యాశకుపోతే నలిగిచావడం ఖాయం; “ గోవిందా ” యని హరి నామ స్మరణ చేయరా ఓమూఢా!భగవన్నామ స్మరణ మించినది లేదని మనకు శ్రీ శంకరాచార్యులవారు అనుగ్రహభాషణంచేసారు. ||28.1.13||
నారీస్తనభరనాభీ దేశం
ద్రుష్ట్వా మాగా మోహావేశమ్|
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారమ్|| ||భజగోవిందం|| (03)
“స్త్రీలయందుఅతిమోహావేశం తగదు; వారి అవయాలు బంగారంముద్దలు కావు, అవి కూడా నెత్తుటితో కూడిన మాంసంముద్దలుగా భావించి వ్యామోహం తగ్గించుకో(వ్యామోహం సర్వ అనర్ధాలకు బీజంకదా!)”;“గోవిందా” యని హరినామస్మరణ చేయరా ఓమూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకు శ్రీ శంకరాచార్యులవారుఅనుగ్రహభాషణం చేసారు.
(సోదరీమణులు తప్పుగా భావించకండి. వ్యామోహం మీద దృష్టి తగ్గడానికి, అతి సర్వత్ర వర్జయేత్ కనుక, శ్రీశ్రీశ్రీభగవత్పాదులవారు అలా సెలవిచ్చారు, అంతేకాని స్త్రీలనుకించపర్చడానికి కాదు.) ||29.1.13||
నళినీదళగత జలమతి తరళం
తద్వజ్జీవితమతిశయ చపలమ్|
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్|| ||భజగోవిందం|| (04)
“తామరాకు మీదనీటిబొట్టులాంటి అతిచంచలమైనది ఈ శరీరం. మమకారబంధాలతో శోకపూరితమై ఈ ప్రపంచం మొత్తంమునిగియున్నదని తెలుసుకో; దాని నుండి విముక్తికి “గోవిందా” యని హరినామస్మరణ చేయరా ఓమూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకు శ్రీ శంకరాచార్యులవారుఅనుగ్రహభాషణం చేసారు. ||30-01-13||
యావద్విత్తో పార్జనసక్త-
స్తావన్ని జపరివారో రక్తః!
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కో2పి న పృచ్ఛతి గేహే|| ||భజగోవిందం|| (05)
“ధనము (సంపాదిస్తున్న) ఉన్నవరకు,నీ దాసులమని దగ్గరవుతారు; ధనము, బలము ఉడిగిన తర్వాత (ముసలితనంలో) స్వంతకొడుకే తన్నగవచ్చును తెలుసుకో”; సంపాదన జంజాటంలోపూర్తిగ మునిగి పోకుండా విముక్తికి “గోవిందా” యని హరినామ స్మరణ చేయరా ఓమూఢా! భగవన్నామ స్మరణమించినది లేదని మనకు శ్రీ శంకరాచార్యులవారుఅనుగ్రహభాషణం చేసారు. ||31-01-13||
యావత్పవనో నివసితి దేహే
తావత్ప్రచ్ఛతి కుశలం గేహే|
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే|| ||భజగోవిందం||(06)
మనలో ప్రాణము (ప్రాణవాయువు) న్నంతవరకు బంధువులుమనగురించి పట్టించుకుంటారు. ప్రాణము పోయిన తర్వాత భార్యసైతం పార్ధివశరీరాన్నిముట్టుకోవడానికి భయపడుతుంది సుమా! కనుక, మోహావేశంలోకొట్టుకొనిపోకుండా ముక్తికి “గోవిందా ”యని హరినామస్మరణ చేయరా ఓమూఢా! భగవన్నామ స్మరణమించినది లేదని మనకుశ్రీ శంకరాచార్యులవారు అనుగ్రహభాషణం చేసారు.||01-02-2013||
అర్ధమనర్ధం భావయ నిత్యం
నాస్తి తతస్సుఖ లేశస్సత్యమ్|
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః|| ||భజగోవిందం|| (07)
ధనము, ధనమని కలవరించెదవు,అదే నీకు బంధనము కూడా. కన్నకొడుకులే ఆధనం గురించి నీ చావుకోరుకొందురని నమ్ముమురా. కనుక, ధనవ్యామోహంలో పడక, ముక్తికి “గోవిందా ”యని హరినామస్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకుశ్రీ శంకరాచార్యులవారు అనుగ్రహభాషణం చేసారు. ||02-02-2013||
బాలస్తావత్ క్రీడాసక్త-
స్తరుణస్తావ త్తరుణీసక్తః |
వృద్ధస్తావచ్చిన్తాసక్తః
పరమే బ్రహ్మణి కో2పి నసక్తః || ||భజగోవిందం||(08)
బాల్యంలో ఆట, పాటలతో; యవ్వనంలోస్త్రీ వ్యామోహంతో; ముసలితనంలో జరాభారపు చింతలతో సరిపోతుంది;ఇక శ్రీహరిని ఎప్పుడు కొల్తువురా మూఢా! అని, భగవన్నామస్మరణ ఆవశ్యకతను మనకు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహభాషణం ద్వారా గుర్తుచేసారు. ||03-02-2013||
కాతే కాన్తాక స్తే పుత్ర-
స్సంసారో2యమతీవ విచిత్రః |
కస్య త్వం వా కుత ఆయాతః
తత్త్వం చిన్తయ తదిహ భ్రాతః || ||భజగోవిందం||(09)
ఎవరు నీవు? నీ భార్యపిల్లలెవరు? ఎక్కడి సంబంధమిది? నీవీ భూమి మీదకు ఎక్కడినుంచివచ్చావో ఒక్కసారి సంపూర్ణంగా యోచనచేయి. ఈ భవబంధాలగురించి చింతమాని శ్రీహరినినమ్ముకొని శ్రీహరిని కొలువు ఓ మూఢా! అని భగవన్నామ స్మరణ ఆవశ్యకతను మనకు శ్రీశంకరాచార్యుల వారు అనుగ్రహభాషణం ద్వారా గుర్తుచేసారు. ||04-02-2013||
సత్సఙ్గత్వే నిస్సఙ్గత్వం
నిస్సఙ్గత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || ||భజగోవిందం||(10)
సజ్జన సాంగత్యము వలన మూర్ఖత్వము పోయి విరాగము కలుగుతుంది. మోహత్వము పోగానేజీవనము పావనమై, జీవనముక్తి లభించడము తధ్యమని శ్రీ శ్రీ శ్రీశంకరభగవ్త్పాదుల వారు తమ
అనుగ్రహభాషణం ద్వారా మనకు తెలుపు తున్నారు. ||05-02-2013||
వయసి గతేకః కామవికార-
శ్శుష్కేనీ రేకః కాసారః |
క్షీణే విత్తే కఃపరివారో
జ్ఞాతె తత్త్వే కస్సంసారః || ||భజగోవిందం|| (11)
వయసు ఉడిగిన తరువాత కామమెక్కడుంటుంది. నీళ్ళు లేని చెఱువెందుకు ? జయమగుగాక!
యధార్ధజ్ఞానికి సంసారలంపటం ఇంకెందుకు? కనుక, సంసారలంపటంలో మునిగి పోక, ముక్తికి
“గోవిందా” యని హరినామస్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని
మనకు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహభాషణంచేసారు. ||06-02-2013||
మా కురుధనజనయౌవనగర్వం
హరతి నిమేషాత్కాలస్సర్వమ్ |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా|| ||భజగోవిందం||(12)
ధనవంతుడనని, బలవంతుడనని, యవ్వనవంతుడననిగర్వమునందకురా; కనురెప్పపాటు సమయంలో నీ ఆయువు గడుచును కనుకజ్ఞానము సాధనము చేయుమురా అని శ్రీ శ్రీ శ్రీ శంకర భగవ్త్పాదుల వారు తమఅనుగ్రహభాషణం ద్వారా మనకు తెలుపుతున్నారు. ||07-02-2013||
దినయామిన్యౌ సాయంప్రాత-
శ్శిశిరవసంతౌ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయు
స్తదపి న ముఞ్ఛ్ త్యాశావాయుః || ||భజగోవిందం||(13)
పగలు, రాత్రి నీ ఆయుఃష్కాలము తరిగిపోతుందిరా! ఇంకాతగని “ఆశ” నిన్ను విడవకుండా ఉన్నది; దానికి ఏమని యేడ్తువురా?అని శ్రీ శ్రీ శ్రీ శంకరభగవ్త్పాదుల వారు తమ అనుగ్రహభాషణం ద్వారా,మనలను మేలుకొలుపుతూ హెచ్చరిస్తున్నారు. ముక్తికి “గోవిందా” యని హరినామ స్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకు శ్రీ శంకరాచార్యులవారు అనుగ్రహభాషణం చేసారు. ||08-02-2013|
ద్వాదశ మఞ్జ్రి కాభిర శేషః
కథితో వైయాకరణస్యైషః |
ఉపదేశో2భూద్విద్యానిపుణై-
శ్రీ మచ్చఙ్కర భగవచ్ఛరణైః || ||భజగోవిందం|| (14)
కాశీ వ్యాకరణ పండితునకు శ్రీ శ్రీ శ్రీ శంకరభగవ్త్పాదుల వారు యుపదేశముజేసిన “ విలువైన పదిరెండు శ్లోకములు వదలక మదిలో నిడుకొనుమా” అనిచెప్పుచూ, ముక్తికి “గోవిందా ”యని
హరి నామస్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణమించినదిలేదని మనకు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహభాషణం చేసారు. ||09-02-2013||
కాతే కాన్తా ధనగతచిన్తా
వాతుల కిం తవ నాస్తి నియన్తా!
త్రిజగతి సజ్జనసఙ్గతి రేకా
భవతి భవార్ణవతరణే నౌకా || ||భజగోవిందం|| (15)
దుష్టురాలైన యువతిని, ధనమును ఆశించిన కీర్తినశించునని తెల్సుకో; మూడు లోకముల సత్సహవాసమె ముక్తినొసంగుననినమ్ముమురా! ముక్తికి “గోవిందా ”యని హరి నామస్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకుశ్రీ శంకరాచార్యుల వారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు. ||10-02-2013||
జటిలో ముణ్డీలుఞ్చిత కేశః
కాషాయాంబర బహుకృత వేషః |
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో
హ్యూదర నిమిత్తో బహుకృత వేషః || ||భజగోవిందం||(16)
బోడికొట్టినను, జడలు బెంచినను భువిలో మూర్ఖుడుబ్రహ్మంబును చూడలేడు; మఱి పొట్టకూటికై దొంగ వేషములు(పలువేషాలు) వేయునురా తెల్సుకొనమని, ముక్తికి “ గోవిందా ” యని హరినామ స్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకు శ్రీ శంకరాచార్యులవారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు. ||11-02-2013||
అఙ్గం గళితం ఫలితం ముణ్డం
దశనవిహీనం జాతం తుణ్డమ్|
వృద్దో యాతి గృహీత్వా దణ్డం
తదపి న ముఞ్చత్యాశపిణ్డమ్ || ||భజగోవిందం|| (17)
తలనెరసిన దేహము చిక్కిన, పండ్లు పూర్తిగ వూడిన,తరగని దొడ్డదైన ఆశాపాశము మాత్రము
వీ డదు; ముక్తికి “ గోవిందా ” యని హరినామ స్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణ మించినదిలేదని మనకు శ్రీ శంకరాచార్యులవారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు. || 14-02-2013||
అగ్రేవహ్నిః పృష్టే భానుః
రాత్రౌ చుబుక సమర్పితజానుః |
కరతలభిక్ష స్తరుతలవాస-
స్తదపి న ముఞ్చ త్యాశాపాశః || ||భజగోవిందం||(18)
ముందట నగ్నియు, వెనుక సూర్యుడును, మోకాలు దాకా పెంచిన గడ్డమున్న సన్న్యాసిని సైతము విపరీతమైన ఆశవిడవకున్నదిరా; ముక్తికి “ గోవిందా ” యని హరినామస్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకు శ్రీ శంకరాచార్యుల వారిశిష్యులు అనుగ్రహ భాషణం చేసారు. ||15-02-2013||
కురుతే గఙ్గాసాగరగమనం
వ్రతపరిపాలనమథ వా దానమ్ |
జ్ణానవిహీనస్సర్వమ తేన
ముక్తోన భవతి జన్మశ తేన || || భజగోవిందం|| (19)
గొప్ప గంగా నది పవిత్ర స్నానము చేసిననూ, వ్రతదానములుచేసిననూ పురుషోత్తముని గురించి ధ్యానము లేనివానికి ముక్తి లభించుట కల్ల; కనుక ముక్తికి “గోవిందా”యని హరి నామ స్మరణ చేయరా ఓమూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకుశ్రీ శంకరాచార్యుల వారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు. ||16-02-2013||
సుర మన్దిరతరుమూలనివాస-
శ్శయ్యాభూతలమజినం వాసః |
సర్వపరిగ్రహ భోగత్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః || ||భజగోవిందం|| (20)
ఏ దేవాలయం వృక్షము క్రిందనో, కటిక నేల మీదనో పడుకొనివిరాగి సుఖంగా నిద్రపోయి అనందం పొందుతాడు. అంటే వైరాగ్యముఎంతటి ఆనందం ఇస్తుందోకదా!
ముక్తికి “గోవిందా”యని హరినామ స్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకుశ్రీ శంకరాచార్యుల వారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు. ||17-02-203||
యోగరతో వా భోగరతో వా
సఙ్గరతో వా సఙ్గవిహీనః
యస్య బ్రహ్మణిరమతే చిత్తం
నన్దతి నన్దతి నన్ద త్యేవ || ||భజగోవిందం|| (21)
యోగిగాని, మఱి రాజు గాని, కడురోగిగాని యెటులుండిననూ, బాగుమీర ఆ పరబ్రహ్మము గురించి ధ్యానిస్తూమమైకము చెందుతుంటే అతనికి పరిపూర్ణ ఆనందము లభించును.ముక్తికి
“గోవిందా” యని హరినామస్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకు శ్రీ శంకరాచార్యుల వారిశిష్యులు అనుగ్రహభాషణం చేసారు. ||18-02-2013||
భగవద్గీతా కించిదధీతా
గంగాజల లవకణికా పీతా |
సకృదపి యేన మురారిసమర్చా
తస్య కరోతి యమో2పినచర్చామ్ || ||భజగోవిందం|| (22)
భగవద్గీత ఒక్క శ్లోకము పఠించినా, గుక్కెడు గంగాజలము తాగినా,కృష్ణ ధ్యానమూ పాతకులను దండించు యముడు నీప్రక్క చూడ భయమందునురా;ముక్తికి “గోవిందా”యని హరినామ స్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదని మనకుశ్రీ శంకరాచార్యుల వారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు. ||19-02-2013||
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీజఠ రే శయనమ్|
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయా పారే పాహి మురారే || ||భజగోవిందం||(23)
పుట్టి గిట్టి మరి గర్భ నరకమున కొట్టుకొనుట యిక నేటికిరా?
కట్టడి సంసారము ఇక చాలును, కరుణాకరా నన్నాపుమురా! అని వేడు కొనమని, భగవన్నామస్మరణ మించినది లేదని మనకు శ్రీ శంకరాచార్యుల వారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు.||20-02-2013||
రథ్యాకర్పట విరచితకంన్థః
పుణ్యాపుణ్య వివర్జితపంన్థః |
యోగీ యోగని యోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవ దేవ || ||భజగోవిందం||(24)
మత్తుతో నిండిన వానివలె, చిన్నపిల్లవాడి వలె మతిలేకఈ లోకంలో యోగి చరించునురా; కాని, చిత్తవృత్తులనునిరోధించుటే యుత్తమ యోగము. భగవన్నామ స్మరణ మించినది లేదని మనకు శ్రీ శంకరాచార్యులవారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు. ||21-02-2013||
క స్త్వంకో2హం కుత ఆయాతః
కా మే జననీ కో మే తాతః |
ఇతి పరిభావితనిజసంసార-
స్సర్వం త్యక్త్వా స్వప్నవిచారః || ||భజగోవిందం||(25)
నీ వెవ్వడు, మఱి నేనెవడు,మనమెందునుండి ఇటు వచ్చితిమో, మనసున ఆలోచించి,గాలిలో కలలు మానమని, భగవన్నామ స్మరణ మించినదిలేదని మనకు శ్రీ శంకరాచార్యుల వారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు.||22-02-2013||
త్వయి మయి చాన్యత్రైకో విష్ణు
ర్వ్యర్ధం కుప్యసి మయ్యసహిష్ణుః |
భవ సమచిత్తస్సర్వత్ర త్వం
వాఞ్చిన్యచిరాద్యది విష్ణుత్వమ్ || ||భజగోవిందం||(26)
“నీయందునునాయందును విష్ణువే నిండి వెలుంగుచునుండునురా. మాయ చేత ననుగోపింతువు, పరమాత్మవంచు నిన్నెరుగమురా ” ఇదిగ్రహించి భగవన్నామ స్మరణమించినది లేదు కనుక భగవన్నామ స్మరణ చేయమని మనకు శ్రీశంకరాచార్యుల వారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు. ||23-02-2013||
కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాత్మానం పశ్యతి సో2హమ్ |
ఆత్మజ్ఞాన విహీనా మూఢా-
స్తే పచ్య న్తే నరకనిగూఢాః || ||భజగోవిందం||(27)
“కామం క్రోధాదిఅరిషడ్వర్గములు (కామము, క్రోధము, లోభము,మోహము, మదము, మాత్సర్యము)వదలి పరాత్పరుని చూడుము. పామరుడు ఆత్మజ్ఞానము లేకనే పుట్టుక,సంసార నరకముల మునిగిపోతాడు ”కనుక, ఆత్మజ్ఞానము పొంది, భగవన్నామ స్మరణ మించినది లేదు కనుక భగవన్నామ స్మరణ చేయమని మనకు శ్రీశంకరాచార్యుల వారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు. ||24-02-2013||
గేయంగీతానామ సహస్రం
ధ్యేయం శ్రీపతిరూపమజస్రమ్|
నేయం సజ్జనసఙ్గే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తమ్ || ||భజగోవిందం|| (28)
“చదువర గీతను,వేడర విష్ణుని, సద్గురుమూర్తిని జేరుమురా;మరయు దయతో జీవులను అన్నపానాదులిడి పోషించుచు పరమపదము పొందుమురా” అని; భగవన్నామ స్మరణమించినది లేదు కనుక భగవన్నామ స్మరణ చేయమని మనకు శ్రీ శంకరాచార్యుల వారి శిష్యులు అనుగ్రహభాషణం చేసారు. ||25-02-2013||
మూఢః కశ్చన వైయాకరణో
డుకృఞ్ కరుణాధ్యయనధురీణః |
శ్రీ మచ్ఛంకరభగవచ్ఛిష్యై,
ర్మోదితఆసీచ్చోధితకరణైః || ||భజగోవిందం|| (29)
వరశంకర గురుశిష్యులు వైయాకరణికిఁ దెల్పిన జ్ఞానంబుఇది. భగవన్నామ స్మరణ మించినది లేదు కనుక భగవన్నామ స్మరణ చేయమనిమనకు శ్రీ శంకరాచార్యుల వారు, వారి శిష్యులు అనుగ్రహభాషణంచేసారు. ||26-02-2013||
ఓం తత్ సత్ __/\__

No comments:
Post a Comment