Translate

30 April, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 076 (376 – 380)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1.నకుల సహదేవుల శంఖాలు ఏవి?
2.ధర్మరాజు కర్ణుని చేతిలో ఓడిపోయి శిబిరానికి వస్తాడు ఎన్నవ రోజున?
3. శుష్కప్రియాలు శూన్యహస్తాలు ఈ సామెత ఏ రాయబారం వల్ల వచ్చింది?
4.ఎవరితో స్నేహం కలకాలం నిలుస్తుంది?
5.ఉలూకుని చంపినదెవరు?
------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. సుఘోష, మణిపుష్పకములు భీష్మపర్వము- ప్రథమాశ్వాసము- 176 వచనము
|| అప్పుడు కృష్ణార్జునులు పాంచజన్యదేవదత్తంబులును భీమసేనుండు పౌండ్రంబును యుధిష్ఠిరుండనంత   విజయంబును నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును పాంచాల విరాట సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖదండ నాయకులు తమతమశంఖంబులుఁ బూరించిన. (176)

2.7వ రోజున; ఆ వెనుకనే కృష్ణార్జునులు వస్తారు. కర్ణపర్వము ద్వితీయాశ్వాసము

3. సంజయుని రాయబారం ఉద్యోగపర్వము ప్రథమశ్వాసము

4. సజ్జనులతో – ఆరణ్యపర్వము -సప్తమాశ్వాసము - 448 పద్యము
ఆ॥విను మహింస మేటి యనఁ జను ధర్మంబు
      యగకర్మ మెపుడు నమరఁబండి
      యుండు మనసుక్రొవ్వుఖండింపఁగా మోద
      మెసఁగు సుజనసంధి యెడలదెందు

5. సహదేవుడు 18వ రోజు యుద్ధంలో శల్యపర్వము ప్రథమాశ్వాసము -386 పద్యము
తే|| బెగడు పఱిచె నభీముండు బె ట్టులూకుఁ
     డడరి యన్నకులానుజు నంపవెల్లి
      ముంప నతఁ డేచి పటుభల్లమున శిరంబు
      త్రుంచె నన్నల్యెడ్లు సమ్తోష మొంద. (386)
************************************************************************************************************
 

No comments:

Post a Comment