Translate

01 April, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 073 (361 – 365)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1.              ఘోషయాత్ర - ఈ మాటకు అర్ధమేమి?
2.             తెలియక విషాన్నం తినబోతున్న భీమునికి ఇది విషాన్నం తినకు అని చెప్పినవాడు ఎవరు?
3.             గర్భవతియైన గాంధారి ఉదరతాడనం చేసుకోవటానికి కారణం ఏమిటి?
4.             కర్ణుని ధనస్సు పేరు ఏమి? అది ఎవరిచ్చారు?
5.             అగస్త్యుడు నహుషు నేమని శపించాడు?
************************************************************************************************
సమాధానములు (జవాబులు):
1.              గొల్లపల్లెకు పోవడం కౌరవులు పాండవుల నవమానించటానికి వైభవంతో ఘోషయాత్రకు వెడతారు.  కాని కౌరవులు గంధర్వునిచే అవమానింపబడుతారు.  పాండవులచే విడిపించ బడతారు. ఆరణ్యపర్వము పంచమాశ్వాసము 371 & 372 పద్యములు
|| అనిన నతండును గొండక
    మనమునఁ జింతించి బుద్ధిమంతుల రాయ గో
    ధనము నరసి తదయక రం
    డని వారికి నెట్టకేల కనుమతి యిచ్చెన్. (371)
|| ఆక్షణంబ కౌతుకాతిశయవ్యగ్ర
     హృదయుఁడైన ఫణధరేంద్ర కేతు
     నాజ్ఞఁ గరిపురంబునం దెల్లఘోషింపఁ
     బడియె ఘోషయాత్ర ప్రకటలీల. (372)

2.             యుయుత్సుదు ఇతడు ధృతరాష్ట్రునికి ఒక వైశ్య స్త్రీ వల్ల కలిగినవాడు ధర్మాత్ముడు. ఆదిపర్వము- పంచమాశ్వాసము 179 పద్యము
|| సముఁడై యుయుత్సుఁ డయ్య
     న్నము దుష్టం బగుటఁ జెప్పినం గుడిచె విషా
     న్నము నాఁకటిపెలుచను నది
     యమృతాన్నం బయ్యె జీర్ణమై మారుతికిన్. (179)

3.             ముందుగా కుంతి కొడుకును కన్నదని తన కొడుకుకు రాజ్యం రాదని అసూయతో ఆదిపర్వము పంచమాశ్వాసము 98 వచనము
|| ఇట్లు పుత్రోదయంబునఁ బరమహర్ష సంపూర్ణ హృదయుం డై పాండురాజు కుంతీమాద్రీసహితుం డై శతశృంగంబున నున్న యవసరంబున నట ముందఱ ధృతరాష్ట్రువలనన్ గాంధారి కృష్ణద్వైపాయనువరంబున గర్భంబు దాల్చి యొక్కసంవత్సరంబు నిండినఁ బ్రసూతి గాకున్నం బదరుచుఁ బుత్రలాభ లాలస యయి యున్నయది యప్పు డయ్యుధిష్టిరుజన్మంబు విని మన్యుతాపంబున నుదరతాడనంబుఁ జేసికొనిన గర్భపాతం బగుడు. (98)

4.                  విజయము పరుశురాముడిచ్చాడు కర్ణపర్వము ప్రథమాశ్వాసము 232&233 పద్యములు
మును విశ్వకర్మ దేవేం
    ద్రునకై నిర్మించె మహితరూపము విజయం
    బనుచాపము దానన బహు         
    దనుజుల మర్దించె నతఁ డుదగ్రస్ఫూర్తిన్. (232)
పరిచయసక్తచిత్తుఁ డయి భార్గవరామున కాతఁ డిచ్చినం
    బరుషపరాక్రమమ్మున నృపాలుర నెల్లను నిమ్మహాభుజుం
    డిరువదియొక్కమాఱు సమయించెఁ దదీయనితాంతశ క్తిన
    ప్పరమాదయాపరుం డొసఁగెఁ బార్థివ నాకది కూర్మి పెంపునన్. (233)

5.             భూలోకంలో పామువై పడి యుండుమని శపించాడు. ఆరణ్యపర్వము చతుర్థాశ్వాసము 119 పద్యము
సీ||వినవయ్య నహుషు డన్ జనపతి నేను మీ పూర్వజులకు నట పూర్వజుండ
    ననఘ సుత్రామున కెన యగువాఁడ నైశ్వర్యగర్వంబున నార్యవృత్తి
    విడిచి వివేకంబు సెడి సహస్రోత్తమబ్రాహ్మణకృత మైన బ్రహ్మరథము
    నెక్కి బ్రాహ్మణులకు నక్కజం బగునవమానంబు సేసినదాన నాకుఁ
||గలశభవుఁ డగస్త్యుఁ డలిగి యత్యుగ్రాహి
    వగుమనియును శాపమొగినయిచ్చె
    మునివ రేణ్యుశాపమునఁ జేసి యిప్పాట
    నవయు చున్నవాఁడ నాఁటఁగోలె. (119)
************&**************************************************************************************************

No comments:

Post a Comment