ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.
అభిమన్యుని భార్య ఎవరు?
2.
కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు సభలో
ముగ్గురు మహర్షులు దుర్యోధనునికి హితవు చెప్పారు – ఎవరువారు?
3.
దృతరాష్ట్రునికి అధ్యాత్మతత్త్వం చెప్పినది
ఏవరు?
4.
ద్రౌపది స్వయంవరంలో బ్రాహ్మణ వేషములో
ఉన్న పాండవులను ముందుగా గుర్తించినదెవ్వరు?
5.
మానవుని ఆయువు ఆరింటి వల్ల తరిగిపోతుంది
– ఏమా ఆరు?
****************************************************************************************
సమాధానములు (జవాబులు):
1.
ఉత్తర – విరాటపర్వము - పంచమాశ్వాసము – 363 పద్యము
మ॥హరిమేనల్లుఁడు బాహువీర్యపటుశౌర్యస్ఫూర్తి త్రైలోక్యసుం
దరుఁ
డాచారపవిత్రుఁ డంచితకళాదక్షుం డుదారుండు గా
తరసంరక్షకుఁ
డార్యసమ్మతుఁడు విద్యావైభవోల్లాసి య
త్యురుతేజుండు
వరించుగాక యభిమన్యుం డీసరోజాననన్. (363)
2.
నారదుడు, జమదగ్ని,
కణ్వుడు – ఉద్యోగపర్వము – తృతీయాశ్వాసము – 145 వచనము; 146 పద్యము
వ||
….జనిచని యొక్కయెడ నారద జమదగ్ని
కణ్వాదులగుమహామునులం గొందఱం గని రథంబు డిగ్గి నమస్కరించి సద్భక్తితాత్పర్యంబునఁ
గుశలం బడిగి మీ రిక్కడకు విజయంచేయుటకుఁ గతంబేమి సేయం గలపని యెయ్యది నా కానతిం డనిన
నారయణునకు నారదుం డి ట్లనియె. (145)
సీ|| అనఘ పుణ్యాత్ముఁడ వగునిన్నుఁ
గనుగొనఁ గౌరవసభ నీవు గారవమునఁ
బలికెడిపలుకులభంగు లాకర్ణింప విదురభీష్మాదులు వినుతెఱంగు
నుత్తరం బిచ్చు కార్యోక్తులు నెఱుఁగంగ వేడుక వచ్చిరి వీర లెల్ల
నని చెప్ప విని లెస్స యట్ల చేయుదురుగా
కని హరి వల్కిన నమ్మునీంద్రు
తే|| లతని దీవించి నీవు పొ
మ్మచటి కేము
నరుగుదెంచెద మని ప్రీతి ననుప నరిగి
యొక్కపుణ్యాశ్రమంబునయొద్దియేట
విడిసి దివసప్రవర్తనవిధులు నడిపి.
(146)
3.
సనత్సుజాతుడు – విదురుడు చెప్పిన నీతులు విని రాత్రి తృప్తిపడక అధ్యాత్మతత్వం చెప్పమంటే – అపుడు విదురుడు నేను కాదు – సనత్సుజాతుడు చెపుతాడు
అన్నాడు. అపుడు ధృతరాష్ట్రుడు
సనత్సుజాతుని తల్చుకొన్నాడు. –
ఉద్యోగపర్వము – ద్వితీయాశ్వాసము – 101 పద్యము; 102 వచనమ
తే|| ధర్మపథమును నీతితత్త్వంబు తెరువు
నిర్మలము లగుపలుకుల నీవు నాకుఁ
దెలియఁ
జెప్పితి పరమార్థదృష్టి యెట్టి
వాక్యములఁ గల్గుఁ జెప్పుమువాని ననఘ. (101)
వ|| అని యడిగిన
విదురుం డతని కిట్లనియె నాకుఁ దోచినయన్నియు ననేర్చినట్లు నీకెఱింగించితి నత్యంతగుహ్యంబు
లగునర్థంబులు పురాణుండయ్యునుం గుమారుం డగుసనత్సుజాతుండు
దెలుపనోపుంగాని యిటమీఁద నాకుం దెలియ దనిన ధృతరాష్ట్రుం డమ్మునీంద్రుండు నాకెంతదవ్వు
నీవ యవియునుం జెప్పు మనిన నేను శూద్ర యోనిజాతుండ వేదాంతవేద్యంబులగునర్థంబులు నా కగోచరంబు
లమ్మహాత్ముబుద్ధి నే నెఱుంగుదు దేవతలకుం దెలియనట్టివి యాతనికిం దెలియు నతండు దెలుపం
జాలు ననిన ధృతరాష్ట్రుం డతికుతూహలుండై. (102)
4.
కృష్ణుడు – ఆదిపర్వము – సప్తమాశ్వాసము – 174 పద్యము
చ|| అవిరళ భస్మమధ్యమున నగ్నికణంబులువోలె
బ్రాహ్మణ
ప్రవరులలోన నేర్పడక పాండవు లేవురు
నున్నఁ జూచి యా
దవవృషభుండు కృష్ణుఁడు ముదంబున వారి
నెఱింగి పార్థుఁ డీ
యువతిఁ బరిగ్రహించు ననియుం దలఁ చెన్
హృదయంబులోపలన్. (174)
5.
1.దురభిమానం 2.అతిగా మాట్లాడటం 3.త్యాగం లేకపోవడం 4.క్రోధం 5.ఆత్మపోషణం 6.మిత్రద్రోహం
– ఆనుశాసనికపర్వము –
పంచమాశ్వాసము – 130 & 132 పద్యములు
తే॥క్షమము సత్యంబు గృపయు శౌచమును గురుల
వలనిభక్తియు
నాయువుపొలుపు నిచ్చు
నలుక
బొంకు కౄరత శుచితాపగమము
గురువిరోధ
మాయువుఁ గడుఁ గుంద్ఁ జేయు. (130)
క॥తనలావున కధిక మయిన
పనిసేయు
టయుక్తమును నపథ్యము నగుభో
జనములు
హరించు నాయువు
వనిత
యవియుఁ బూర్వకర్మవశతన కలుగున్. (132)
*******************************************************************
No comments:
Post a Comment