ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.
జనమేజయుడెవరి కొడుకు?
2.పాండవసైన్యమెంత?
3.
ద్రోణుడు పద్మవ్యూహం పన్నినది ఎన్నవరోజు
యుద్ధంలో?
4.ధృష్టద్యుమ్నునెవరు చంపారు? ఎప్పుడు?
5.యుద్ధానికి ముందు కర్ణుని జన్మగురించి
ముఖ్యంగా తెలియని దెవరికి?
---------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
పరిక్షిత్తు కొడుకు – ఆదిపర్వము – ద్వితీయాశ్వాసము – 165 పద్యము
సీ|| అభిమన్యునకు విరాటాత్మజ
యైనయుత్తరకును బుట్టినధర్మమూర్తి
కౌరవాన్వయపరిక్షయమున నుదయించి ప్రథఁ
బరీక్షితుఁడు నాఁబరఁగువాఁడు
ధర్మార్థకామముల్ దప్పక సలుపుచుఁ బూని భూప్రజ నెల్లఁ బుణ్యచరిత
ననఘుఁడై రక్షించి యఱువదియేఁడులు రాజ్యంబు
సేసినరాజవృషభుఁ
ఆ|| డధికధర్మమార్గుఁ డైననీయట్టిస
త్పుత్రుఁ బడసి యున్నపుణ్యుఁ డన్య
నాథమకుటమణిగణప్రభా రంజిత
పాదపంకజుండు భరతనిభుఁడు.
(165)
2. ఏడు అక్షౌహిణులు – ఆదిపర్వము – ప్రథమాశ్వాసము – 69 పద్యము
శా|| ఏడక్షౌహిణు లెన్నఁ బాండవబలం
బేకాదశాక్షౌహిణుల్
రూఢిం గౌరవసైన్య మీయుభయమున్ రోషాహతాన్యోన్య
మై
యీడంబోవక వీఁకమైఁ బొడువఁగా నేపారు
ఘోరాజి న
ల్లాడెన్ ధాత్రి శమంతపంచకమునం దష్టాదశాహంబులన్.
(69)
3.13వ రోజు యుద్ధంలో – ద్రోణపర్వము –
ద్వితీయాశ్వాసము –
4 వచనము
వ॥అనుటయు నమ్మానవపతికి సూతసూనుం డి ట్లను నట్లు భారద్వాజుండు
పద్మవ్యూహంబు సంఘటించునెడ వివిధదేశంబులరాజులు దళంబులును రాజకుమారులు కేసరంబులును గర్ణదుశ్శాసనబహుళసేనాపరివృతుం
డయి కురువిభుండు కర్ణికయునుం గా నభేద్యభంగి నొనర్చిన నది వలయాకారం బగుటంజేసి చక్రవ్యూహంబు
ననం జను నమ్మొగ్గరంబు మొగంబునం దాను దర్పంబు మెఱయ నెఱ్యం బొలిచి నిలిచె మఱియు వలయునెడలకు
లావై జయద్రథగురుపుత్రకృపశకునికృతవర్మభూరిశ్రవశ్శల్శల్యులును నీకొడుకుకులును మనుమలును
రక్తమాల్యాను లేపనాంబరాభరణంబులుశోభిల్లం బొలిచి నిలిచి రంత భీమసేనప్రముఖంబైనపాండవబలంబును
గదియ నడచె…. (4)
4.
అశ్వత్థామ 18వ
రాత్రి – సౌప్తికపర్వము – ప్రథమాశ్వాసము – 158 & 159 పద్యములు
ఉ|| కాలను గేలనుం జదిపి గంధకరిం
దెగటార్చు సింహము
బోలుచుఁ బేర్చి యాద్రుపదభూపసుతున్
సమయించె వేదనన్
ఱోలఁగ రోఁజఁగా బలుమఱుం బొరలంబడి లాల
గ్రక్క న
వ్వాలుమగండు వాక్పరిభవంబుఁ దలంచుచుఁ
శ్రౌర్యదుర్యుఁ డై. (158)
క||ధృష్టద్యుమ్నుని ని ట్లతి
కష్టవిధిప్రాప్తమరణుఁ గావించి మహా
వష్టంభోజ్జ్వలుఁడును సం
హృష్టాత్ముఁడు నగుచు వింట నిడియె
గుణంబున్ (159)
5.పాండవులకు – ముఖ్యంగా ధర్మరాజుకు –
స్త్రీపర్వము – ద్వితీయాశ్వాసము
-183 పద్యము
ఆ|| అతఁడు మాకు నన్న యని మున్న
యెఱుఁగంగఁ
గన్నఁ గురుకులంబు కలఁగఁబడక
మనుదు మట్టు లైన మనుజలోకమునకుఁ
గలుగ దడలు మాకుఁ గలుగ దడలు.
(183)
******************************************************