నాకు నచ్చిన, నలుగురుకు పనికి వచ్చే మంచి విషయాలు, దర్శనీయ స్థలాల పొటోలు, వీడియో క్లిప్పింగులు పొందుపర్చడానికి నా చిరు ప్రయత్నమే ఈ బ్లాగు. ధన్యవాదములు🙏🏼🕉
Translate
29 December, 2014
కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 034 (166 – 170)
ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. పాండవులు రహస్యపు పేర్లు పెట్టుకొన్నారు గదా, ఆ పేర్లు ఎప్పుడైనా ఉపయోగించినట్లు దాఖలా ఉందా?
2. భారతంలో కూడా కైకేయి ఉందంటారు, ఎవరామె?
3. పాండవులు అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేస్తున్నట్లు తెలిసిన వ్యక్తి ఎవరు?
4. కీచకుడు చనిపోయేసరికి అజ్ఞాతవాసం ఎంత మిగిలింది?
5. కృపుని జెండా ఏమిటి?
--------------------------------------------------------------------------------

సమాధానములు
(జవాబులు):
1. ఉపకీచకులు కీచకుని శవానికి కట్టి తీసుకు వెడుతూ ఉండగా ద్రౌపది ఆ పేర్లతోనే (జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బల) పిలుస్తుంది; ఇతరులు గంధర్వులనుకొనేటట్లు. - విరాట పర్వము – తృతీయాశ్వాసము – 20 & 21 పద్యములు
ఆ||అనద నైతి నిచట నాలికుయ్యాలింపుఁ
డకట మీరు గలుగ నా క్రమించి
నన్నుఁ గట్టి సూతనందను లిమ్మెయి
వెఱపు లేక భంగపఱచు వారు. (20)
ఉ||ఆనతవైరి యోజయ మహాద్భుతవిక్రమ యోజయంత దు
ర్మానవిఘూర్ణ మానరిపుమర్దన యోవిజయాభిధాన తే
జోనిహితాహితప్రకటశూరగుణప్రతిభాస యోజయ
త్సేన విరోధిబాహుబలజృంభణభంజన యోజయద్బలా. (21)
2. సుదేష్ణ- ఈమె కేకయ రాజు కుమార్తె, అందుకని కైకేయి అనబడుతుంది. - విరాట పర్వము –

తృతీయాశ్వాసము – 55 వచనము
వ॥అనుచుం గన్యకాజనపరివృత యై యరిగి యంతఃపురంబు సొచ్చి సహోదర మరణశోకాతుర
వ॥అనుచుం గన్యకాజనపరివృత యై యరిగి యంతఃపురంబు సొచ్చి సహోదర మరణశోకాతుర
యగుకైకేయికడకుం జనునప్పుడు.(55)
3. ధౌమ్యుడు – ఇతడే పాండవులకు సేవా ధర్మాలు చెప్పాడు. పాండవులు విరాటుని కొలువులో
చేరేముందు ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. - విరాట పర్వము – ప్రథమాశ్వాసము – 147 వచనము
వ॥తదనంతరంబ హుతవహునకుం బురోహితునకుం బ్రదిక్షిణంబు సేసి యమ్మహీసురవరేణ్యుననుమతి

వడసి పాండవులు పాంచాలిం బురస్కరించుకొని యాతండును దోడన
యరుగుదేరం గదిలి
శుభనిమిత్తంబులు గైకొనుచుం జని దశార్ణ దేశంబున కుత్తరంబునఁ
బామ్చాలజనపద యామ్యదిగ్భాగంబున
సాళ్వశూరసేన విషయంబులలోనం గాళిందీదక్షిణతీరం బొరసికొని
పశ్చిమాభిముఖప్రయాణంబుల నెడనెడ
వన్యాహారంబుల శరీరయాత్రలు నడుపుచు నానామృగవివిధ విహారంబులను
మనోహరకుసుమకదంబగంధమకరందబిందు సందోహసుందరతరుచ్ఛాయాసేవనంబులను
గమలపరాగపరంపరాధూసరితభాసురజలాశయ
సమవ గాహనంబులను
సరిత్సంగమస్నానాద్యనుష్ఠానంబులను
బహుప్రకారపాదప గుల్మలతావలోకనంబులను
బక్షికులప్రకరానెకభంగివిరుతాకర్ణనంబులను వినోదించుచుఁ
గాననమార్గంబుల నరిగి
మత్స్యమండలంబుగడి నేరి ధౌమ్యుని వీడుకొని రవ్విప్రవరుండును నొక్కపుణ్యాశ్రమంబున
వసియించె వారు మఱియు నూళ్లుసొరక యడవితెరువుల
నడచి విరాటునగరంబున
కనతిదూరంబగుకాంతారంబున దఱిమి పోవుసమయంబునఁ బథిశ్రమంబు నూని యాజ్ఞసేని యి ట్లనియె.
(147)
4. 13 రోజులు. విరాట పర్వము – తృతీయాశ్వాసము – 63 పద్యము
ఉ||ముందటియట్ల యింకఁ బదుమూఁడుదినంబులమాత్రకున్ భవ
న్మందిరవాస మియ్యకొనినం గడతేఱు మదియవాంఛ యం
తం దగఁ దోఁచి మత్పతు లుదా త్తమతిన్ భవదీయవాంఛితం
బుం దలకొల్పఁ జాలుదు రపూర్వమనఃప్రమదంబు సేకుఱున్. (63)
5. వృషభము - - విరాట పర్వము – పంచమాశ్వాసము – 4 పద్యము
సీ||కాంచనమయవేదికాకనత్కేతనోజ్జ్వలవిభ్రమమువాఁడు కలశజుండు
సింహలాంగూల భూషితనభోభాగకేతుప్రేంఖణమువాఁడు ద్రోణసుతుఁడు
గనకగోవృషసాంద్రకాంతిపరిస్ఫుటధ్వజసముల్లాసంబువాఁడు కృపుఁడు
లలితకంబు ప్రభాకలితపతాకావిహారంబువాఁడు రాధాత్మజుండు
తే||మణిమయోరగరుచిజాలమహిత మైన
పడగవాఁడు కురుక్షితిపతి మహోగ్ర
శిఖరఘనతాళతరు వగుసిడమువాఁడు
సురనదీసూనుఁ డేర్పడఁ జూచికొనుము. (4)
*************
తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-127
తెలుగు సుద్దులు…..(127)
ఆ.వె||జీవమే`డనుం`డు? భావమె`క్కడ నుం`డు?
కాపురంబు యేడ గదిసి యుండు?
తనరుచు`న్న రెంటి స్థలమే`ల తెలియరు?
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
జీవము (ప్రాణము) ఎక్కడుంటుంది? జీవము (పరమాత్మ) ఎక్కడ ఉంటాడు? ఆత్మ ఎక్కడుంటుంది? ఈరెండు కలసి కాపురమెక్కడ చేస్తున్నాయి? ఉన్నతంగా అతిశయించుచున్న రెంటి ఉనికిని (స్థావరాన్ని) ఎందుకు మానవులు తెలుసుకోవటంలేదు అని ఒక మహాయోగిగా ఆవేదన చెందుతూ, ఓ మూఢులారా మీలోనే (ప్రతిజీవిలో) పరమాత్మ ఉన్నాడు, చంకలో బిడ్డనుపెట్టుకొని ఊరంతా వెదికిన చందంగా ఎక్కడక్కడో పరమాత్మను వెతుక్కుంటారెందుకు అని ఒక చురకతగిలించినట్లున్నది. ||28-12-2014||

"A cleansed and pure heart is the most appropriate altar or tabernacle
for the Lord. In that fragrant bower, the Lord will establish Himself.
When the Lord establishes Himself, at that very moment, another incident
too will happen. The group of six vices that had infested the place
will quit instantly, without any farewell or fanfare. When these vices
quit, the wicked retinue of evil tendencies and vulgar attitudes which
live on them will break camp and disappear without leaving even their
addresses! Then one will shine in one's native splendour of Truth and
Love (Sathya and Prema). That person will endeavour without hindrance to
realize the Self, and finally succeed in merging with the Universal and
Eternal. Liberated from the tangle of ignorance or maya, the mind will
fade away. The long-hidden secret will be revealed. "
- Sri SatyaSaibaba Bhagavatha Vahini, Ch 1, 'The Bhagavatha'.
- Sri SatyaSaibaba Bhagavatha Vahini, Ch 1, 'The Bhagavatha'.
26 December, 2014
కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 033 (161 – 165)
ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. సభలో గుప్తంగా చేయవలసిన పనులేవి? ఎందుచేత?
2. తిక్కన ప్రయోగం “కుంతీసుతమధ్యముండు” అనే సమాసం ఎవరిని చెపుతుంది?
3. అర్జునకు బీభత్సుడనే పేరు ఎందుకు వచ్చింది?
4. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు మన సేన మీదకు వస్తున్నాడు అని ద్రోణుడంటే కర్ణ
దుర్యోధనులేమన్నారు?
5. “వచ్చినవాడు ఫల్గుణుడు” అన్న ప్రసిద్ధమయిన పద్యము ఎవరు అన్నది?
సమాధానములు (జవాబులు):
1. అ) ఆవులింత ఆ) తుమ్ము ఇ) నవ్వు ఈ) ఉమ్మివేయడం ఇవి రహస్యంగా చేయాలి. ప్రక్కవారికి
ఇవి అహస్యం కలుగచేస్తాయి కనుక. - విరాట పర్వము – ప్రథమాశ్వాసము – 137 పద్యము
ఆ||ఆవులింత తుమ్ము హాసంబు నిష్టీవ
నంబు గుప్తవర్తనములు గాఁగఁ
జలువవలయు నృపతి గొలువున్న యెడల బా
హిరము లైనఁ గెలని కెగ్గు లగుట. (137)

2. అర్జునుని – కుంతి పాండవులందరినీ తనకొడుకులవలెనే చూసుకొనేది. ఆభావం తెలియజేయటానికే ఆపదం
తిక్కన ప్రయోగించాడంటారు. - విరాటపర్వము – చతుర్థాశ్వాసము - 95 పద్యము
శా||సింగం బాఁకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధ మై వచ్చునో
జం గాంతారనివాసఖిన్న మతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. (95)
శా||సింగం బాఁకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధ మై వచ్చునో
జం గాంతారనివాసఖిన్న మతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. (95)
3. బీభత్సంగా యుద్ధం చెయ్యడు కాబట్టి – నకుర్యాంకర్మ బీభత్సం అని సంస్కృతము. శుభం కలిగించాలనే
సంకల్పం కలవాడనే అర్ధం కూడా చెపుతారు. (భదికల్యాణే అనే ధాతువుకు భీభత్సపదం సన్నంతం.) -
విరాటపర్వము – చతుర్ధాశ్వాసము - 144 పద్యము
తే||వీరులకుఁ జూడ బీభత్సవిధము గలుగ
నట్టి కార్యంబు సేఁతకు నెట్టిసమర
భంగులను దడఁబడక బీభత్స సేయ
దాన బీభత్సుఁ డనునభిధానమయ్యె. (144)
తే||వీరులకుఁ జూడ బీభత్సవిధము గలుగ
నట్టి కార్యంబు సేఁతకు నెట్టిసమర
భంగులను దడఁబడక బీభత్స సేయ
దాన బీభత్సుఁ డనునభిధానమయ్యె. (144)
4. “నా బాణాలతో అర్జునుని సంహరిస్తా” నని కర్ణుడన్నాడు. అందరినీ మళ్ళీ అరణ్యవాసానికి పంపుతానని దుర్యోధనుడన్నాడు. ఈ మాటలకు భీష్ముడూ, ద్రోణుడూ, కృపుడూ, అశ్వత్థామా లోలోపల నవ్వుకొన్నారు. - విరాటపర్వము – చతుర్థాశ్వాసము - 99,101&103 పద్యములు
ఆ||ఆతఁడు వచ్చెనేని నస్మచ్ఛిలీముఖ
పాతచలితహృదయపద్ముఁ జేసి
వెగడుపఱిచి యోధవీరుల కెల్ల ను
త్సవ మొనర్తు బాహుదర్ప మొప్ప. (99)
ఆ||తప్పఁ బలికి తీవు సెప్పెద విను మితఁ
డర్జునుండ యేని నడవి కేగి
బ్రాతృయుతము గాఁగఁ బండ్రెడువత్సర
ములును నంద నిలువవలఁయు మగుడ. (100)
క||అనుపలుకులకును భీష్ముం
డును ద్రోణుఁడు ద్రోణసూనుఁడును గృపుఁడును మే
లని యియ్యకొనిరి హృదయా
ననురూపము లైన తెలువు లాస్యముఁబొందన్. (103)
5. భీష్ముడు. ఉత్తర గోగ్రహణ సందర్భంలో. విరాటపర్వము – చతుర్థాశ్వాసము - 234 పద్యము
ఉ||వచ్చినవాఁడు ఫల్గునుఁ డవశ్యము గెల్తు మనంగ రాదు రా
లచ్చికినై పెనంగినబలంబులు రెండును గెల్వ నేర్చునే
హె చ్చగుఁ గుం దగుం దొడరు టెల్లవిధంబుల కోర్చు టట్లు గా
కిచ్చఁ దలంచి యొక్క మెయి నిత్తఱిఁ బొం దగుచేఁతయుం దగున్. (234)
Subscribe to:
Posts (Atom)