ఈశ్వర దండకము
ఈశ్వర దండకము
శ్రీకంఠ
లోకేశ లోకోద్భవ! స్థానసంహారకారీ! మురారిప్రియా! చంద్రధారీ!
మహేంద్రాదిబృందారకానందసందోహసంధాయి, పుణ్యస్వరూపా, విరూపాక్షా! దక్షాధ్వర ధ్వంసకా!
దేవ నీదైన తత్వంబు భావించి, బుద్ధి ప్రధానంబుఁగర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు
సర్వక్రియాకరణంబంచున్ ప్రకాశంబులం బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను భావింతురీశాన
సర్వేశ్వరా! శర్వసర్వజ్ఞ! సర్వాత్మకా! నిర్వికల్ప ప్రభావా! భవానిపతీ!
నివులోకత్రయావర్తనఁబుల్ మహావాయుఖాతాగ్నిసోమార్కతోయంబులన్ జేసి సంచార చక్ర
క్రియాయంత్రవహుండవై, దేవ దేవాదిదేవా, మహాదేవ నిత్యంబునత్యంతయోగస్థితిన్
నిర్మలజ్ఞానదీపప్రభాజ్వాల విధ్వంస, నిస్సారసంసారమాయాంధకారుల్, జితక్రోధ
రోగాదిదోషుల్, యతీంద్రుల్, యతాత్ముల్, భవత్పాదం కేహరు ధ్యాన పీయూధారానుభూతిన్,
సదాతృప్తులై, రవ్యయాభవ్య సేవ్యాభవా! భర్గభట్టారకా,భార్గవాఁగస్యకకుత్సాది నానాముని
స్తోత్రదత్తావథానా లలాటేక్షనోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా
నీప్రసాదంబునన్ సర్వగీర్వాణగంధర్వులున్, సిద్ధసధ్యోరగేంద్రామరేంద్రాదులన్
శ్వాశతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా! విశ్వకర్తా! సురాభ్యర్చితా!
నాకునభ్యర్ధితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ, త్రిలోకనాథా! మహాదేవా! నమస్తే,
మనస్తే, నమస్తే నమ:.
__/\__
No comments:
Post a Comment