Translate

20 April, 2018

నేనేమి సేతురా మాధవ! కవిత (5)



నా ఈ అక్షరకూర్పుకు ప్రేరణైన అంతర్జాలములోనీచిత్రరాజము గీచిన చిత్రకారునకు/చిత్రకారిణికి కృతజ్ఞతలు, నమస్సుమాంజలి🙏

నేనేమి సేతురా మాధవా!

ఈ సంసారనావ తెడ్డు వేసి .... వేసి ..... వేసి డస్సితి...

నిన్నుకొలవ తీరికా లేదాయా

సగ జీవితం నిదురాదేవి లాగేసుకుపోయె

కాల జీవితం కొలువుకు తాకట్టుకిందపోయె

మిగిలిన కూసంత జీవితం బంధాల పాలాయె ॥నేనేమి॥    

నిన్ను కీర్తుంతుమన్న నీకీర్తనలు రావాయె...

నిన్ను పూజింతుమన్న మంత్రాలు రావాయె...

నిన్ను భజయింతుమన్న భజనలు రావాయె....

నిన్ను స్మరింతుమన్న దిక్కుమాలినవి స్ఫురణకురాసాగే...

నిన్ను సేవింతుమన్న కాలుచేతులు నామాట వినవాయె....

నిన్ను దరిచేర శ్రవణం, దాస్యం, అంతేవాసం చేదుమన్నా

మాయదారి నీ మాయ నా మదిని పెడదారి పట్టిస్తున్నదాయె... ॥నేనేమి॥

నిన్ను మనసార చిత్రాలలో చూడనన్నా చూడనీయరా!

మాధవా....నా మొరాలింపరా మాధవా!

ఆత్మనివేదనకు నేతగనా మాధవా..... ॥నేనేమి॥

No comments:

Post a Comment