Translate

15 April, 2018

నేనేమిసేతు మాధవా - కవిత (1)

నేనేమిసేతు మాధవా....దారిచూపరావా!

నిదుర రానంటున్నది...

మంచం లేవద్దంటున్నది...

సూరయ్య లేలే ఏమిటా మందతనమంటున్నాడు...

కిరణనఖములతో మరీ రక్కుతున్నాడు....

మనసు కాఫీకషాయమువైపు పరిగెడుతున్నది...

బుద్ధి ఏమిటీ ధర్మభ్రష్టతని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది...

జ్ఞానం అజ్ఞానంతో దొర్లుతున్నావా...

లే లెమ్మంటున్నది...

నేనేమిసేతు మాధవా....

దారిచూపరావా.....
************

నిదురరానంటున్నది...ఆత్మజ్ఞానం;
మంచంలేవద్దంటున్నది...బంధాలు...అనుబంధాలు కట్టి పడేస్తాయ;
సూరయ్య లేలే ఏమిటా మందతనం అని తన కిరణనఖములతో రక్కుతున్నాడు....తెలుసుకున్న ధార్మిక, శాస్త్ర పరిజ్ఞానం;
మనసు కాఫీకషాయమువైపు పరిగెడుతున్నది...మోహం,కోరికలు;
బుద్ధి ఏమిటీ ధర్మభ్రష్టతని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది... సమయపాలన చేయడంలేదన్న అంతర్మథనం;
జ్ఞానం అజ్ఞానంతోదొర్లుతున్నావా...జ్ఞానం అజ్ఞానాన్ని నేటి పరిభాషలో చిన్నిల్లుగా భావిస్సుంది;
లేలెమ్మంటున్నది... బయటపడు;
నేనేమిసేతుమాధవా....దారిచూపరావా.....మాధవుడు..
దశానిర్దేశకుడు..భగవద్గీత ..మార్గదర్శన
అందుకని ఆయనను ఎన్నుకున్నాను.

🙏🙏🙏

సాహిత్యం గ్రూప్ - ఫేస్ బుక్ - 12-04-2018

No comments:

Post a Comment