Translate

20 April, 2018

నేనేమి సేతురా మాధవ! కవిత (5)



నా ఈ అక్షరకూర్పుకు ప్రేరణైన అంతర్జాలములోనీచిత్రరాజము గీచిన చిత్రకారునకు/చిత్రకారిణికి కృతజ్ఞతలు, నమస్సుమాంజలి🙏

నేనేమి సేతురా మాధవా!

ఈ సంసారనావ తెడ్డు వేసి .... వేసి ..... వేసి డస్సితి...

నిన్నుకొలవ తీరికా లేదాయా

సగ జీవితం నిదురాదేవి లాగేసుకుపోయె

కాల జీవితం కొలువుకు తాకట్టుకిందపోయె

మిగిలిన కూసంత జీవితం బంధాల పాలాయె ॥నేనేమి॥    

నిన్ను కీర్తుంతుమన్న నీకీర్తనలు రావాయె...

నిన్ను పూజింతుమన్న మంత్రాలు రావాయె...

నిన్ను భజయింతుమన్న భజనలు రావాయె....

నిన్ను స్మరింతుమన్న దిక్కుమాలినవి స్ఫురణకురాసాగే...

నిన్ను సేవింతుమన్న కాలుచేతులు నామాట వినవాయె....

నిన్ను దరిచేర శ్రవణం, దాస్యం, అంతేవాసం చేదుమన్నా

మాయదారి నీ మాయ నా మదిని పెడదారి పట్టిస్తున్నదాయె... ॥నేనేమి॥

నిన్ను మనసార చిత్రాలలో చూడనన్నా చూడనీయరా!

మాధవా....నా మొరాలింపరా మాధవా!

ఆత్మనివేదనకు నేతగనా మాధవా..... ॥నేనేమి॥

15 April, 2018

నేనేమి సేతు మాధవా....కవిత...(4)


నేనేమిసేతు మాధవా....

దారిచూపరావా..... ॥నేనేమి॥

మూడునాళ్ల ముచ్చట ఈ జీవితం.....

మూలనున్న

మూటగట్టిన ముఖ్యపురాణత్రయం

ముడివిప్పి

ముప్ర్పొద్దు పఠింప

ముదిమి

మూలుగుచుండె

నేనేమిసేతు మాధవా....॥నేనేమి॥

దారిచూప రావా!

ముదముతో కూడగట్టు ఫేస్బుక్...

మురిపాల ముడిపెట్టు వాట్సప్లుండగా

మనకేలరా పురాణ పఠనమని

మాయదారి మనసు

మల్లగుల్లాలు పెడుతుంటే

నేనేమిసేతు మాధవా....॥నేనేమి॥

దారిచూప రావా!

మూలనున్న అంతరాత్మ...

మాధ్యమేమైనా

ముదము, రక్తి ... కాదురా....

ముక్తి ముఖ్యమని

ముప్పేట పోరుచుండ

నేనేమిసేతు మాధవా....॥నేనేమి॥

దారిచూపరావా.....

నేనేమి సేతు మాధవా....॥నేనేమి॥

నేనేమిసేతు మాధవా - కవిత (1)

నేనేమిసేతు మాధవా....దారిచూపరావా!

నిదుర రానంటున్నది...

మంచం లేవద్దంటున్నది...

సూరయ్య లేలే ఏమిటా మందతనమంటున్నాడు...

కిరణనఖములతో మరీ రక్కుతున్నాడు....

మనసు కాఫీకషాయమువైపు పరిగెడుతున్నది...

బుద్ధి ఏమిటీ ధర్మభ్రష్టతని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది...

జ్ఞానం అజ్ఞానంతో దొర్లుతున్నావా...

లే లెమ్మంటున్నది...

నేనేమిసేతు మాధవా....

దారిచూపరావా.....
************

నిదురరానంటున్నది...ఆత్మజ్ఞానం;
మంచంలేవద్దంటున్నది...బంధాలు...అనుబంధాలు కట్టి పడేస్తాయ;
సూరయ్య లేలే ఏమిటా మందతనం అని తన కిరణనఖములతో రక్కుతున్నాడు....తెలుసుకున్న ధార్మిక, శాస్త్ర పరిజ్ఞానం;
మనసు కాఫీకషాయమువైపు పరిగెడుతున్నది...మోహం,కోరికలు;
బుద్ధి ఏమిటీ ధర్మభ్రష్టతని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది... సమయపాలన చేయడంలేదన్న అంతర్మథనం;
జ్ఞానం అజ్ఞానంతోదొర్లుతున్నావా...జ్ఞానం అజ్ఞానాన్ని నేటి పరిభాషలో చిన్నిల్లుగా భావిస్సుంది;
లేలెమ్మంటున్నది... బయటపడు;
నేనేమిసేతుమాధవా....దారిచూపరావా.....మాధవుడు..
దశానిర్దేశకుడు..భగవద్గీత ..మార్గదర్శన
అందుకని ఆయనను ఎన్నుకున్నాను.

🙏🙏🙏

సాహిత్యం గ్రూప్ - ఫేస్ బుక్ - 12-04-2018

నేనేమిసేతు మాధవా.... కవితలు (2,3)


నేనేమి సేతు మాధవా....

సన్నబియ్యమన్నము

సల్లబడుతుండాదాయే....

ఉల్లి గోంగూర తొక్కు

మనసు నిలవనీదాయె....

మా వెంకన్న దొర

కొలువునుండి ఊడిరాడాయే....

నేనేమి సేతు మాధవా....   (2)  సాహిత్యం గ్రూప్ ... ఫేస్ బుక్ ....14-04-2018

*******
నేనేమిసేతు మాధవా....




నా కిట్టమైన టీవీ ఛానల్లో

వంటావార్పు నేర్పేటి

వంటల పెద్దన్న చెప్పిన

కొత్త వింత ఇగురు

వొల్లు వంచి పసందుగ నేఁజేసి ....

సందాల నా బావకు తినిపించి

కొత్త కోక కోరుకుందామని

గట్టిగ మూతెట్టి ...

నాకిట్టమైన సీరయల్లు నేచూడబోవ....

మాయదారి పిల్లి గడుగ్గాయ

మ్యావ్...మ్యావ్...మ్యావంటూ వచ్చి

చల్లంగ నా ఇగురు మాయఁజేసె...

నేనేమి సేతునిపుడు మాధవా!

నేనేమి సేతునిపుడు మాధవా!!  (3) - సాహిత్యం గ్రూప్ ... ఫేస్ బుక్ ....15-04-2018