Translate

03 April, 2017

శ్రీ సాయినామం - శ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్యశర్మ

శ్రీ సాయినామం - శ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్యశర్మ - శ్రీసాయి ప్రేమాలయం ప్రచురణ

May 3, 2014 at 11:19

శ్రీ సాయినామం
ఓమ్ శ్రీ సాయీ సద్గురు పరబ్రహ్మణేనమః__/\__

శ్రీ సాయీనామం

సాయినామము – సాయినామము
సకల శుభముల – నొసగునామము
సర్వజీవుల – హృదయమందలి
సాక్షి యీ నామం – శ్రీ సాయినామం ||సా|| (1)

క్షరంబై –అన్నియెడలను
అమరియున్నది – సాయినామం
దీక్షతో తెలియంగ వలసిన
దేవుడీ నామం – శ్రీసాయినామం     ||సా||  (2) 

దిమధ్యాంతములు – లేకను
అలరుచున్నది– సాయినామం
వాదబేధాతీతమైన
వస్తువీనామం– శ్రీసాయినామం       ||సా||  (3)

హపరంబుల రెంటియందున
యిమిడియున్నది– శ్రీసాయినామం
దహరమై వెలుగొందుచున్న
ద్రష్ట యీ నామం – శ్రీసాయినామం  ||సా||  (4) 

శ, విధి, వైకుంఠ వాసుల
కిష్టమైనది – సాయినామం
నాశరహితంబైన ప్రణవ
నాదమీ నామం – శ్రీసాయినామం    ||సా|| (5)

త్త పలుకుల కందనంతటి
ఎత్తునున్నది - సాయినామం
సత్తయై జగమెల్ల నిండిన
సత్యమీ నామం – శ్రీసాయినామం   ||సా|| (6)  

రకుండియు సర్వజగముల
నూపుచున్నది సాయినామం
తేరిచూడగ రాక వెలిగే
తేజమీనామం – శ్రీసాయినామం     ||సా|| (7)

జువుగా వర్తించు వారికి
ఋజువు తానౌ – సాయినామం
ఋన విమోచనమైన ముక్తికి
రూపమీనామం – శ్రీసాయినామం    ||సా|| (8) 

వర్ణంబును గడ్డి పూవును
లుప్తపరచదు –సాయినామం
సువర్ణం బిదియంచు గైకొన
జూచు నీనామం - శ్రీసాయినామం    ||సా|| (9)

ఎందరెందరొ జ్ఞానులీ భువి
ఎన్నుకున్నది – సాయినామం
అందరకు మోక్షంబొసంగగ
అండ యీ నామం - శ్రీసాయినామం ||సా|| (10)

కమై –బహురూపములతో
లోకమైనది – సాయినామం
శోకమోహములణపగల్గే
సూక్ష్మమీనామం - శ్రీసాయినామం  ||సా|| (11)

దు భూతములందు గల్గిన
ఐక్యతత్వము – సాయినామం
ఐదునైదుల కాద్యమైన
ఆత్మయీనామం - శ్రీసాయినామం  ||సా|| (12) 

క్కొక్కటి విడిచి వేయగ
దక్కుతుదకీ - సాయినామం
ముక్కుదిక్కుల – నెక్కుబెట్టిన
చిక్కునీనామం - శ్రీసాయినామం ||సా|| (13)


మ్ అనే శబ్దంబులోపల
నొదిగియున్నది – సాయినామం
రాం – అనే మంత్రార్థమందలి
రమ్యమీనామం - శ్రీసాయినామం ||సా|| (14) 


షధంబై సకల వ్యాధుల
నడచి వైచును – సాయినామం
దోష తిమిర సమూహమడచే
ద్యుమణియీనామం- శ్రీసాయినామం||సా|| (15)

అంధకార గుహాంతరంబున
అరయరానిది సాయినామం
సంధ్యకాలమునందు దోచే
సాక్షియీనామం - శ్రీసాయినామం   ||సా|| (16) 

లదు లేదను వారలెప్పుడు
కాంచలేనిది –సాయినామం
కలదు లేదదు వారియందలి
కదలికీ నామం – శ్రీసాయినామం    ||సా|| (17)

ఖండ ఖండములట్లు దోచు
యఖండ రూపము సాయినామం
దండిముని బృందముల మెడలో
దండయీనామం - శ్రీసాయినామం    ||సా|| (18) 

గంగకును నిర్మలత గూర్చగ
గల్గినది యీసాయినామం
సంగ రహితుల జేసి నరులను
సాకు నీనామం - శ్రీసాయినామం       ||సా|| (19)

న తరంబుగ హృదయ గృహలో
కదలు భావమే – సాయినామం
మనసు నిల్చిన చోటనుండే
మర్మమీనామం -- శ్రీసాయినామం   ||సా|| (20)

జ్ఞానులందర కెరుకయగు
విజ్ఞాన రూపమే – సాయినామం
హీనమతుల కెరుంగరాని
యహీనమౌనామం - శ్రీసాయినామం  ||సా|| (21)

క్రముల నారింటియందున
సంచరించును – సాయినామం
చక్రధరు రూపంబు దాల్చిన
శక్తి యీనామం - శ్రీసాయినామం      ||సా|| (22) 

త్రమై తన భక్తులకు
అచ్ఛాధనంబిడు – సాయినామం
సాధనలచే నెరుగవలసిన
సత్యమీ నామం – శ్రీసాయినామం   ||సా|| (23)

జాగ్రదాది యవస్థలన్నిటి
జాడలెరుగుచు – సాయినామం
అగ్రమున వెలుగొందుచున్న
ఆత్మ యీనామం - శ్రీసాయినామం  ||సా|| (24) 


షము టెక్కెమునందు దాల్చిన
జాణకును – యీసాయినామం
విషమ శరమై యొప్పుచున్న
విమలమౌ నామం - శ్రీసాయినామం ||సా|| (25)

క్కుటిక్కులనెన్ని జేసిన
చిక్కబోదీ – సాయినామం
మక్కువతో ధ్యానింపవలసిన
మంత్రమీనామమ - శ్రీసాయినామం  ||సా|| (26) 

వరలకు చిత్తంబునదున
తలపరానిది సాయినామం
ఠావులన్నిటి వీడి తలపగ
దక్కునీ నామం - శ్రీసాయినామం      ||సా|| (27)

బ్బులెస్సగ వెచ్చబెట్టియు
డాయరానిది – సాయినామం
తన్నుదా వెచ్చించి గైకొను
తత్వమీ నామం - శ్రీసాయినామం     ||సా|| (28) 

మరుకము శూలంబు దాల్చిన

శమనవైరియె – సాయినామం
శమదమంబుల బొందువారికి
సాధ్యమీనామం- శ్రీసాయినామం      ||సా|| (29)

 వర్ణాక్షర మాదిగాగల
నాణ్య మెరుగదు – సాయినామం
సువర్ణంబై వెలుగుచున్న
సూత్రమీనామం - శ్రీసాయినామం     ||సా|| (30)

తారకంబై భక్తవరుల
తరింపజేయును – సాయినామం
నారకంబెడలించి ముక్తికి
నడుపు నీనామం - శ్రీసాయినామం  ||సా|| (31)

థూ” యటంచు పిశాచ గణముల
తోలివేయును – సాయినామం
మాయ మోహమణంచి జీవుల
మనుపు నీ నామం - శ్రీసాయినామం||సా|| (32) 

ర్శనము చేయంగ రాకను
దాగియున్నది సాయినామం
ప్రాకటంబుగ ననుభవంబై
పరగునీనామం - శ్రీసాయినామం       ||సా|| (33)

ర్మ రూపము దాల్చి సర్వము
తానెయైనది – శ్రీసాయినామం
కర్మచే సాధింప నేరని
మర్మమీ నామం - శ్రీసాయినామం    ||సా|| (34)||

మమ” యనుకొన్న తోడనె
క్రమముగా యీ సాయినామం
భ్రమను బాపియు ముక్తి నొసగెడి
భ్రదమౌనామం - శ్రీసాయినామం       ||సా|| (35)

రమ పావనులైన జ్ఞానులు
పాడు పాటయే – సాయినామం
స్థిరముగా హృదయంబునందున
జేర్పుడీ నామం - శ్రీసాయినామం     ||సా|| (36)||

లములన్నిటికన్న నెక్కుడు
ఫలమొసంగును – సాయినామం
కలిమలంబుల తొలగద్రోసే
కర్తయీనామం - శ్రీసాయినామం       ||సా|| (37)

లిమి లేదని వగచు వరికి
బలము తానౌ సాయినామం
బలముచే గర్వించు వారికి
బల్లెమీ నామం - శ్రీసాయినామం       ||సా|| (38) 

క్త వరులకు అన్ని విధముల
బంధువైనది – సాయినామం
ముక్తిగోరు ముముక్షువులకు
ముఖ్యమీనామం - శ్రీసాయినామం   ||సా|| (39)

హదహంకారముల గూడి
మసలు చిత్రమే – సాయినామం
మహిని జ్ఞానులు – త్రాగ గోరెడి
మధిర యీనామం - శ్రీసాయినామం ||సా|| (40) 

మ దమాదులనంది నంతట
అక్షయంబౌ సాయినామం
సమముగా వెల్గొందు బుద్ధికి
సాధ్యమీ నామం - శ్రీసాయినామం    ||సా|| (41)

మ్యమై హృదయాల జేరి
రమింపజేయును – సాయినామం
గమ్యమై జీవేశ్వరులను
కలుపు నీ నామం - శ్రీసాయినామం ||సా|| (42) 

క్షణంబులు దెల్పరాని వి
లక్షణ స్థితి – సాయినామం
లక్ష్య లక్షణలన్నిటికిని
లక్ష్యమీనామం - శ్రీసాయినామం ||సా|| (43)

వాచ్యమై యొప్పారుచుండి య
వాచ్యమైనది – సాయినామం
వాచ్యవాచ్యములన్ని దెలిసెడి
వస్తువీ నామం శ్రీసాయినామం ||సా|| (44) 

మ దమాదుల నందుటకు తా
సాధనంబీ – సాయినామం
శాంతమై పరమౌచు తెలిసెడి
సత్యమీనామం - శ్రీసాయినామం ||సా|| (45)

డ్విధంబుల మార్పులేకను
సర్వకాలము – సాయినామం
నిర్వికాలంబగుచు నిలిచే
నీతి యీనామం - శ్రీసాయినామం ||సా|| (46) 

సాధనలచే నందరాని య
సాధ్య వస్తువు – సాయినామం
శోధనలు ఉడుగంగ గన్పడు
చోద్యమీ నామం - శ్రీసాయినామం ||సా|| (47)

హంసయై యన్నింటనుండెడి
ఆత్మ వస్తువు – సాయినామం
హింస లేక యెరుంగవలసిన
యంశ మీనామం - శ్రీసాయినామం||సా|| (48) 

క్షణము సేపు జపింప ముక్తి
నొసంగ జాలును సాయినామం
క్షణక్షణబును రక్షణంబై
సాకునీనామం - శ్రీసాయినామం ||సా|| (49)

సాయినాధు పదార్పణంబై
చదువు కొన్నది – సాయినామం
సాయిసద్గురు కృపను బొందుడు
చదువుడీ నామం - శ్రీసాయినామం ||సా|| (50) 

ప||ఆలయం ఆలయం ఆలయం
      శ్రీసాయి ప్రేమాలయం
      శ్రీసాయి ప్రేమాలయం
అ||ప||ఆనంద నిలయుం – అనురాగవలయం
           అది సాయి ప్రేమాలయం
           అది సాయి ప్రేమాలయం
చ||శిఖర దర్శనం చింతలహరణం
       మూర్తి దర్శనం మోక్షకారణం
        నాలుగు పురుషార్ధాలను
        అందజేయు ఆలయం
        నమ్మినభక్తులపాలిటి సొమ్మైన ఆలయం ||ఆ||
చ||దత్తదేవుకరుణా – ధర్మాచరణ
       చిత్తశాంతి చేకూర్చే – చిన్మయనిలయం
        సద్గురుడౌ సాయీశుని – చక్కనైనఆలయం
        నిత్య సత్యమౌ ప్రేమనునేర్పే - యీఆలయం  ||ఆ||
చ||పూజచేసిన భజనచేసినా
       పుండరీకవరదుని జపము చేసినా
       ఎంచలేని ఫలమిచ్చు యీసాయి ఆలయం
       ఇలలో నందనవనిలో వెలసిన యీ ఆలయం ||ఆ|| 

********





LikeShow more reactions
Comment
Comments

No comments:

Post a Comment