శ్రీరామ జయరామ జయజయ రామ!
గృహిణి వ్యక్తిత్వవికాసానికి ద్రౌపది మార్గ నిర్దేశికాలు
ఆంధ్ర మహాభారతము – ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
సత్యా ద్రౌపదీ సంవాదము
సీ|| నీప్రి భర్తల నిర్మల చరితులఁ బ్రకటతేజుల లోకపాలనిభులఁ
బార్థుల నీ వొకభంగిన వదలక చెలువ యెబ్భంగి భజింతు దగిలి
యొక్కఁ డొక్కని కంటె నువిద నీ కేవురు ననురక్తు లగుట యత్యద్భుతంబు
నగు మొగంబుల కాని నలినాక్షి నిదెసఁ బతులకుఁ గింకిరిపాటులేదు
తే|| వ్రతముపెంపొ మంత్రౌషధవైభవంబో
సరసనైపథ్యకర్మ కౌశలమొ చతుర
విభ్రమోల్లాసరేఖయో వెలఁది నీవి
శేషసౌభాగ్య హేతువు చెపుమనాకు. (291)
(కింకిరిపాటు = ఏవగింపు ; పార్థులన్ = పాండవులను)
క|| ఏనును నీవలన నిజము
గా నిది యంతయును నెఱిఁగి కమలదళాక్షుం
బూని వశగతునిఁ జేసి య
నూన స్నేహను భోగయుక్తిఁ దలిర్తున్. (292)
క||| అని యడిగిన మది నించుక
గినుక వొడమ నడఁచుకొనుచుఁ గృష్ణ మృదులహా
సిని యగుచుఁ గృష్ణభామినిఁ
గనుఁగొని యిట్లనియెనిర్వికారాకృతి యై. (293)
క|| నను నిట్లు దుష్టవనితా
జనమునటులు గాఁ దలంపఁ జనునే నీకున్
మన సొప్పదు పురుషోత్తము
వనితవు గాఁ దగవు నీవు వనరుహనయనా. (294)
వ|| అని మేలంపుఁజందంబున దానివివేకహీనత యెఱుకపడ నాడి పాంచాలి మఱియు ని ట్లనియె. (295)
చ|| అలయక మంత్రతంత్రవివిధౌషధభంగులఁ జేసి యెంతయున్
వలతురు నాథు లంట మగువా కడు బేలతనంబు దాన మున్
గలిగిన ప్రేమయుం బొలియుఁ గాని యొకండును సిద్ధిఁ బొంద ద
ప్పొలఁతులతోడిమన్కి యహిపొత్తుగఁ జూచు విభుం డెఱింగినన్. (296)
( అలయక = కష్టపడక, అలసటపడకుండా; పొలియు = నశించు, చచ్చు, చెడు; మన్కియ(మనకి) = జీవనము; అహిపొత్తుగ=పాముతో స్నేహము)
చ|| మగువ యొనర్చువశ్యవిధి మందులు మాయలు నొండుచంద మై
మగనికిఁ దెచ్చు రోగములు మానక మూకజడాదిభావముల్
మొగి నొనరించు నద్దురితముల్ తనచేసినచేత లై తుదిన్
జగమున కెక్కి నిందయును సద్గతిహానియు వచ్చు నింతికిన్. (297)
(మొగిన్ = వరుసగా)
క|| కావునఁ బతుకలు నెప్పుడుఁ
గావింపం దగదు కపటకర్మంబులు త
ద్భావ మెఱిఁగి యనువర్తిని
యై వనిత చరింప నదియ యగు నెల్లవియున్. (298)
వ|| పాండవులయెడ నే నెట్టిదాన నై యిట్టిసౌభాగ్యంబు నందితి నది నీకు నెఱింగించెద నేర్పడ వినుము. (299)
సీ|| పతు లాత్మ నొండొక్కపడఁతులఁ గలసిన నలుగ నెయ్యడల నహంకరింప
మదముఁ బ్రమాదంబు మాని వారికిఁ జిత్త మేకముఖంబుగ నెల్లప్రొద్దు
భక్తిసేయుదుఁ జూపుఁ బలుకును గోర్కియుఁ జెయ్వును వింతగాఁజేయనెపుడు
నమరగంధర్వయక్షాదులం దైనను బురుషు నన్యునిఁ దృణంబుగఁ దలంతు
తే|| స్నాన భోజన శయనాది సంప్రయోగ
మర్థిఁ బతులకు ము న్నెందు నాచరింపఁ
బతులు వచ్చిన నాసనపాద్యవిధుల
భక్తితో నేన కావింతుఁ బనుప నొరుల. (300)
(ప్రమాదము = పొరపాటు; చెయ్వు= కార్యము)
చ|| తగియెడు వేళలందు నియతంబుగ మజ్జనభోజనక్రియల్
తగ నొడఁగూర్తు భర్తలకు ధాన్యధనంబులు రిత్తమై వ్యయం
బగుటకు నొర్వ నెప్పుడు గృహ స్థల భాండవిశోధనంబు లి
మ్ముగ నొకనాఁడు నేమఱఁ బ్రమోదము సల్పుదు బంధుకోటికిన్. (301)
క|| పలుమాఱుం దలవాకిట
మెలఁగుట యసతీజనైకమిత్రత కలహం
బుల కెలయుట నగుపలుకులఁ
బెలుచ నగుట నాకుఁ గానిపేరివి మగువా. (302)
(అసతీజనఏకమిత్రత = కులటలతోడి స్నేహము; ఎలయుట+ఆసక్తిపడుట)
క|| పతు లిచ్చమెయిఁ బ్రవాస
స్థితు లైనం బుష్పగంధదీప్తాభరణ
ప్రతతి ధరియింపఁ దద్గత
మతి నగుచుఁ దదాగమంబ మదిఁ గాంక్షింతున్. (303)
ఉ|| అత్తకు భక్తి గల్గి మది నాయమ చెప్పినమాడ్కి జీవికా
వృత్తము లావహింతు గురు విప్రజనాతిధిపూజనంబు ల
త్యుత్తమభక్తి నేన తగ నోపి యొనర్తుఁ బ్రియంబుఁ దాల్మియున్
మెత్తఁదనంబు సన్మతియు మేలుగఁ దాల్తు సమస్తభంగులన్. (304)
క|| కడుమృదువు లనుచుఁ దేఁకువ
సెడి యెపుడుఁ జరింప భరతసింహులు గోపం
బడరిన నాశీవిషముల
వడవునఁ గ్రూరు లని వెఱపు వదలక కొల్తున్. (305)
(తేకువచెడి=భయమువీడి; ఆశీవిషములవడువునన్=పాములవలె)
సీ||మాయత్తఁ బృథ్వీసమానఁ బృథాదేవిఁ గుంతిభోజాత్మజఁ గోమలాంగి
సతతంబు భోజనస్నానాదికములయం దిమ్ముగఁ బరిచర్య యేన చేసి
సంప్రీతఁ జేయుదు జనవంద్యుఁ డగుధర్మతనయునిబంతి నిత్యంబుఁ బసిఁడి
పళ్లెరంబులఁ గుడ్చుబ్రాహ్మణు లతిపుణ్యు లెనిమిదివేలు సమిద్థమతులు
తే||యతులు పదివేలు వారల కనుదినంబు
నన్నపానంబు లర్హసహాయ నగుచు
నొడికముగ నేన కావింతు నుచిత వస్త్ర
భూషణాదులఁబరితోషముగ నొనర్తు. (306)
(ఒడికముగన్=ఇంపుగా)
వ|| మఱియు ధర్మరాజు నగరియందుఁ గనకమణిమయభూషణాలంకృతు లయినపరిచారకులు నూఱువేలు రేయును బగలును బాత్రహస్తు లై యభ్యాగతభోజనంబు లొడఁగూర్చువారు నందఱ కలరు వీరెల్ల నిట్టిట్టిమెలఁకువ మెలంగుదురని తత్కృతాకృతంబులేనయెఱుంగుదు నిరంతరమదధారాతరంగిత కపోలంబులయిన భద్రగజశతసహస్రంబులుఁ బ్రభూతజవసత్వసన్నుతంబు లయినయుత్తమాశ్వ శతసహస్రంబులుం గలవు వానికి నన్నింటికి నిత్యోచితంబులైన ఖాద్యంబులొనరింపను బాలింపను దగినవారి నేన నియమింతు నఖండభాండాగారపూరితంబులైన యగణ్య మణికనకాది వస్తువులును బ్రతిదినవిహితంబు లయిన యాయవ్యయంబులు నాయెఱుంగనియవియు లేవు గోపాలజనంబులు తుదిగాఁ గలసకల భృత్యజనంబుల జీవితంబుల నరసి యేన నడపుదుం బరమయశోధనులగుపాండు నందనులు నిజకుటుంబభారంబు సర్వంబు నాయంద సమర్పించి తారు నిర్భరు లై యిష్టవిహారంబుల నుండుదు రే నెల్ల వెంటల నప్రమత్త నై వర్తింతు. (307)
(Lady CEO with excellent administrative skills – HR, Finance, Store keeping, Hospitality, Animal husbandry, Vigilance – Abala kaadu Sabala – Classic example.)
ఆ|| వేగ జాము గలుగ వెడనిద్రఁ బొందుదుఁ
గాని రాజ్యభారకార్యయుక్తి
నబ్జనయన నాకు నాహారనిద్రల
కెడయు లేదు సువ్వె యెల్ల ప్రొద్దు. (308)
ఆ|| ఇట్టివర్తనముల నెపుడుఁ బాండవులకుఁ
దగిలి ప్రియము సేయఁ దగితిఁ గాని
మగువ నీవుచెప్పు మందులు
మంత్రంబు లింద్రజాలములును నే నెఱుంగ. (390)
వ|| అనిన విని లజ్జాకలితచిత్త యగుచు సత్యభామ పాండవభామిని కిట్లనియె. (310)
క|| ఏ నెఱుఁగమి నిట్లడిగితి
నానేరమి సైఁప వలయు నగవుగఁ గొనుమీ
మానిని నపలుకులు స
న్మానితము భవచ్చరిత్రమహిమ ధరిత్రిన్. (311)
వ|| అనినం బాంచాలి మందస్మితానన యగుచు నది యట్ల కాక యని పలికి మఱియు ని ట్లనియె. (312)
ద్రౌపది సత్యభామకుఁ బతివ్రతాధర్మంబులు చెప్పుట
క|| పతిమనసు నాఁచికొనియెడు
చతురోపాయంబు నీకుఁ జపలాక్షి సుని
శ్చితమతిఁ జెప్పెద విను మూ
ర్జితమును ధర్మాన్వితము సుశీలంబును గాన్. (313)
(ఆచికొనియెడు = ఆకర్షించు; ఊర్జితము= గట్టి; ధర్మాన్వితము= ధర్మతో కూడుకున్నది )
చ|| పతిఁ గడవంగ దైవతము భామల కెందును లేదు ప్రీతుఁ డై
పతి కరుణించెనేనిఁ గలభాషిణి భాసుర భూషణాంబరా
న్వితధనధాన్యగౌరవము విశ్రుత్సంతతియున్ యశంబు స
ద్గతియును గల్గు నొండుమెయిఁ గల్గునె యిన్ని తెఱంగు లారయన్. (314)
(కడవంగన్=మించి; కలభాషిణి=మధురముగ పలుకుదానా; మెయిన్= )
ఆ|| కరము దుఃఖపడినఁ గాని యొక్కింత సౌ
ఖ్యంబు ధర్మగతియుఁ గలుగ దెందుఁ
జూడు మబల భర్తృ శుశ్రూషఫలముసం
తతసుఖంబు నంద ధర్మువొదవు. (315)
క|| కావున నిత్యము సమ్య
గ్బావము ప్రేమంబు వెరవు భక్తియుఁ బ్రియముం
గావింపుము నీప్రియునెడ
భావమెఱిఁగియతఁడు తాన పై బడి మరగున్. (316)
మ|| వనజాక్షుండు కడంగి నీ దగుగృహద్వారంబు చేరంగ వ
చ్చె ననంగా విని లెమ్ము సంభ్రమముతోఁ జె న్నొందునభ్యంతరం
బునకున్ వచ్చిన నాసనాదికరణంబుల్ దీర్పఁ దత్తజ్జనం
బు నియోగించితి నంచు నుండక ప్రియంబుల్ చేయు మీవుం దగన్. (317)
చ|| తివిరి మురారి నీకుఁ గడుఁ దీపుగఁ జెప్పినపల్కు గల్గినం
గువలయనేత్ర నీమనసుగూడినవారికి నైన నెప్డుఁ జె
ప్ప వలదు దాన నొండొక నెపంబు ఘటింతు రెఱింగి రేని నీ
సవతులు కృష్ణుబుద్ధి విరసం బగు నీదెసఁ దత్ప్రయుక్తిచేన్. (318)
(విరసంబు=అప్రియము)
చ|| పతికి ననుంగు లైనతగుబంధుల మిత్రుల భోజనాదిస
త్కృతముల నాదరించుచు నకృత్రిమభక్తి విశేష సంతతో
త్థితమతి వై చరింపుము తదీయహితేతరవృత్తు లైనవా
రతివ భవత్సుహృజ్జనము లైనను గైకొన కుండు మెప్పుడన్. (319)
క|| విను ప్రద్యుమ్నాదిభవ
త్తనయులయెడ నైన నేకతంబున నేకా
సనమున నుండుట దూష్యం
బనియెఱుఁగుము సతులచరిత లతిదుష్కరముల్. (320)
క|| కులవతులును సతులును ని
ర్మలమతులును నయినయట్టిమగువలతోడం
జెలిమి యొనరించునది దు
ర్విలసితవనితాభియుక్తి విడువుము తరుణీ. (321)
(దుర్విలసితవనితాభియుక్తి=దుష్ట స్త్రీల స్నేహము)
వ|| ఇది నీకుఁ బరమసౌభాగ్యమూలం బయినయుపాయం బనినం బ్రీతచిత్త యై సత్యభామ యిట్లనియె. (322)
సీ|| నీవు ధర్మజ్ఞవు దేవసన్నిభులు నీభర్తలు మహనీయకీర్తి ధనులు
ధైర్యతేజోబలశౌర్యసంపన్నులు కావున వీరికి నేవిధమున
ధారుణీరాజ్యంబు చేరెడుఁ దడయక మీ కెగ్గు సేసినలోకనింద్య
చరితుండు కౌరవధరణీశువనితలు దిక్కు లే కలమటఁ బొక్కుచుండఁ
తే|| గని ముదంబునఁ బొందెదు వనిత నీవు
సుతుల నత్యంతనిర్మలమతుల శౌర్య
యుతులఁ గాంచిన సద్గుణాన్వితవు వగపు
వలదు చిత్తంబులో నీకు జలజనయన. (323)
(తడయక= ఆర్ద్రతలేకుండా – దయలేకుండా; అలమటన్= చింతతో ; పొక్కుచుండ = దుఃఖించుచుండ)
****

No comments:
Post a Comment