Translate

03 April, 2017

శ్రీ సాయినామం - శ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్యశర్మ

శ్రీ సాయినామం - శ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్యశర్మ - శ్రీసాయి ప్రేమాలయం ప్రచురణ

May 3, 2014 at 11:19

శ్రీ సాయినామం
ఓమ్ శ్రీ సాయీ సద్గురు పరబ్రహ్మణేనమః__/\__

శ్రీ సాయీనామం

సాయినామము – సాయినామము
సకల శుభముల – నొసగునామము
సర్వజీవుల – హృదయమందలి
సాక్షి యీ నామం – శ్రీ సాయినామం ||సా|| (1)

క్షరంబై –అన్నియెడలను
అమరియున్నది – సాయినామం
దీక్షతో తెలియంగ వలసిన
దేవుడీ నామం – శ్రీసాయినామం     ||సా||  (2) 

దిమధ్యాంతములు – లేకను
అలరుచున్నది– సాయినామం
వాదబేధాతీతమైన
వస్తువీనామం– శ్రీసాయినామం       ||సా||  (3)

హపరంబుల రెంటియందున
యిమిడియున్నది– శ్రీసాయినామం
దహరమై వెలుగొందుచున్న
ద్రష్ట యీ నామం – శ్రీసాయినామం  ||సా||  (4) 

శ, విధి, వైకుంఠ వాసుల
కిష్టమైనది – సాయినామం
నాశరహితంబైన ప్రణవ
నాదమీ నామం – శ్రీసాయినామం    ||సా|| (5)

త్త పలుకుల కందనంతటి
ఎత్తునున్నది - సాయినామం
సత్తయై జగమెల్ల నిండిన
సత్యమీ నామం – శ్రీసాయినామం   ||సా|| (6)  

రకుండియు సర్వజగముల
నూపుచున్నది సాయినామం
తేరిచూడగ రాక వెలిగే
తేజమీనామం – శ్రీసాయినామం     ||సా|| (7)

జువుగా వర్తించు వారికి
ఋజువు తానౌ – సాయినామం
ఋన విమోచనమైన ముక్తికి
రూపమీనామం – శ్రీసాయినామం    ||సా|| (8) 

వర్ణంబును గడ్డి పూవును
లుప్తపరచదు –సాయినామం
సువర్ణం బిదియంచు గైకొన
జూచు నీనామం - శ్రీసాయినామం    ||సా|| (9)

ఎందరెందరొ జ్ఞానులీ భువి
ఎన్నుకున్నది – సాయినామం
అందరకు మోక్షంబొసంగగ
అండ యీ నామం - శ్రీసాయినామం ||సా|| (10)

కమై –బహురూపములతో
లోకమైనది – సాయినామం
శోకమోహములణపగల్గే
సూక్ష్మమీనామం - శ్రీసాయినామం  ||సా|| (11)

దు భూతములందు గల్గిన
ఐక్యతత్వము – సాయినామం
ఐదునైదుల కాద్యమైన
ఆత్మయీనామం - శ్రీసాయినామం  ||సా|| (12) 

క్కొక్కటి విడిచి వేయగ
దక్కుతుదకీ - సాయినామం
ముక్కుదిక్కుల – నెక్కుబెట్టిన
చిక్కునీనామం - శ్రీసాయినామం ||సా|| (13)


మ్ అనే శబ్దంబులోపల
నొదిగియున్నది – సాయినామం
రాం – అనే మంత్రార్థమందలి
రమ్యమీనామం - శ్రీసాయినామం ||సా|| (14) 


షధంబై సకల వ్యాధుల
నడచి వైచును – సాయినామం
దోష తిమిర సమూహమడచే
ద్యుమణియీనామం- శ్రీసాయినామం||సా|| (15)

అంధకార గుహాంతరంబున
అరయరానిది సాయినామం
సంధ్యకాలమునందు దోచే
సాక్షియీనామం - శ్రీసాయినామం   ||సా|| (16) 

లదు లేదను వారలెప్పుడు
కాంచలేనిది –సాయినామం
కలదు లేదదు వారియందలి
కదలికీ నామం – శ్రీసాయినామం    ||సా|| (17)

ఖండ ఖండములట్లు దోచు
యఖండ రూపము సాయినామం
దండిముని బృందముల మెడలో
దండయీనామం - శ్రీసాయినామం    ||సా|| (18) 

గంగకును నిర్మలత గూర్చగ
గల్గినది యీసాయినామం
సంగ రహితుల జేసి నరులను
సాకు నీనామం - శ్రీసాయినామం       ||సా|| (19)

న తరంబుగ హృదయ గృహలో
కదలు భావమే – సాయినామం
మనసు నిల్చిన చోటనుండే
మర్మమీనామం -- శ్రీసాయినామం   ||సా|| (20)

జ్ఞానులందర కెరుకయగు
విజ్ఞాన రూపమే – సాయినామం
హీనమతుల కెరుంగరాని
యహీనమౌనామం - శ్రీసాయినామం  ||సా|| (21)

క్రముల నారింటియందున
సంచరించును – సాయినామం
చక్రధరు రూపంబు దాల్చిన
శక్తి యీనామం - శ్రీసాయినామం      ||సా|| (22) 

త్రమై తన భక్తులకు
అచ్ఛాధనంబిడు – సాయినామం
సాధనలచే నెరుగవలసిన
సత్యమీ నామం – శ్రీసాయినామం   ||సా|| (23)

జాగ్రదాది యవస్థలన్నిటి
జాడలెరుగుచు – సాయినామం
అగ్రమున వెలుగొందుచున్న
ఆత్మ యీనామం - శ్రీసాయినామం  ||సా|| (24) 


షము టెక్కెమునందు దాల్చిన
జాణకును – యీసాయినామం
విషమ శరమై యొప్పుచున్న
విమలమౌ నామం - శ్రీసాయినామం ||సా|| (25)

క్కుటిక్కులనెన్ని జేసిన
చిక్కబోదీ – సాయినామం
మక్కువతో ధ్యానింపవలసిన
మంత్రమీనామమ - శ్రీసాయినామం  ||సా|| (26) 

వరలకు చిత్తంబునదున
తలపరానిది సాయినామం
ఠావులన్నిటి వీడి తలపగ
దక్కునీ నామం - శ్రీసాయినామం      ||సా|| (27)

బ్బులెస్సగ వెచ్చబెట్టియు
డాయరానిది – సాయినామం
తన్నుదా వెచ్చించి గైకొను
తత్వమీ నామం - శ్రీసాయినామం     ||సా|| (28) 

మరుకము శూలంబు దాల్చిన

శమనవైరియె – సాయినామం
శమదమంబుల బొందువారికి
సాధ్యమీనామం- శ్రీసాయినామం      ||సా|| (29)

 వర్ణాక్షర మాదిగాగల
నాణ్య మెరుగదు – సాయినామం
సువర్ణంబై వెలుగుచున్న
సూత్రమీనామం - శ్రీసాయినామం     ||సా|| (30)

తారకంబై భక్తవరుల
తరింపజేయును – సాయినామం
నారకంబెడలించి ముక్తికి
నడుపు నీనామం - శ్రీసాయినామం  ||సా|| (31)

థూ” యటంచు పిశాచ గణముల
తోలివేయును – సాయినామం
మాయ మోహమణంచి జీవుల
మనుపు నీ నామం - శ్రీసాయినామం||సా|| (32) 

ర్శనము చేయంగ రాకను
దాగియున్నది సాయినామం
ప్రాకటంబుగ ననుభవంబై
పరగునీనామం - శ్రీసాయినామం       ||సా|| (33)

ర్మ రూపము దాల్చి సర్వము
తానెయైనది – శ్రీసాయినామం
కర్మచే సాధింప నేరని
మర్మమీ నామం - శ్రీసాయినామం    ||సా|| (34)||

మమ” యనుకొన్న తోడనె
క్రమముగా యీ సాయినామం
భ్రమను బాపియు ముక్తి నొసగెడి
భ్రదమౌనామం - శ్రీసాయినామం       ||సా|| (35)

రమ పావనులైన జ్ఞానులు
పాడు పాటయే – సాయినామం
స్థిరముగా హృదయంబునందున
జేర్పుడీ నామం - శ్రీసాయినామం     ||సా|| (36)||

లములన్నిటికన్న నెక్కుడు
ఫలమొసంగును – సాయినామం
కలిమలంబుల తొలగద్రోసే
కర్తయీనామం - శ్రీసాయినామం       ||సా|| (37)

లిమి లేదని వగచు వరికి
బలము తానౌ సాయినామం
బలముచే గర్వించు వారికి
బల్లెమీ నామం - శ్రీసాయినామం       ||సా|| (38) 

క్త వరులకు అన్ని విధముల
బంధువైనది – సాయినామం
ముక్తిగోరు ముముక్షువులకు
ముఖ్యమీనామం - శ్రీసాయినామం   ||సా|| (39)

హదహంకారముల గూడి
మసలు చిత్రమే – సాయినామం
మహిని జ్ఞానులు – త్రాగ గోరెడి
మధిర యీనామం - శ్రీసాయినామం ||సా|| (40) 

మ దమాదులనంది నంతట
అక్షయంబౌ సాయినామం
సమముగా వెల్గొందు బుద్ధికి
సాధ్యమీ నామం - శ్రీసాయినామం    ||సా|| (41)

మ్యమై హృదయాల జేరి
రమింపజేయును – సాయినామం
గమ్యమై జీవేశ్వరులను
కలుపు నీ నామం - శ్రీసాయినామం ||సా|| (42) 

క్షణంబులు దెల్పరాని వి
లక్షణ స్థితి – సాయినామం
లక్ష్య లక్షణలన్నిటికిని
లక్ష్యమీనామం - శ్రీసాయినామం ||సా|| (43)

వాచ్యమై యొప్పారుచుండి య
వాచ్యమైనది – సాయినామం
వాచ్యవాచ్యములన్ని దెలిసెడి
వస్తువీ నామం శ్రీసాయినామం ||సా|| (44) 

మ దమాదుల నందుటకు తా
సాధనంబీ – సాయినామం
శాంతమై పరమౌచు తెలిసెడి
సత్యమీనామం - శ్రీసాయినామం ||సా|| (45)

డ్విధంబుల మార్పులేకను
సర్వకాలము – సాయినామం
నిర్వికాలంబగుచు నిలిచే
నీతి యీనామం - శ్రీసాయినామం ||సా|| (46) 

సాధనలచే నందరాని య
సాధ్య వస్తువు – సాయినామం
శోధనలు ఉడుగంగ గన్పడు
చోద్యమీ నామం - శ్రీసాయినామం ||సా|| (47)

హంసయై యన్నింటనుండెడి
ఆత్మ వస్తువు – సాయినామం
హింస లేక యెరుంగవలసిన
యంశ మీనామం - శ్రీసాయినామం||సా|| (48) 

క్షణము సేపు జపింప ముక్తి
నొసంగ జాలును సాయినామం
క్షణక్షణబును రక్షణంబై
సాకునీనామం - శ్రీసాయినామం ||సా|| (49)

సాయినాధు పదార్పణంబై
చదువు కొన్నది – సాయినామం
సాయిసద్గురు కృపను బొందుడు
చదువుడీ నామం - శ్రీసాయినామం ||సా|| (50) 

ప||ఆలయం ఆలయం ఆలయం
      శ్రీసాయి ప్రేమాలయం
      శ్రీసాయి ప్రేమాలయం
అ||ప||ఆనంద నిలయుం – అనురాగవలయం
           అది సాయి ప్రేమాలయం
           అది సాయి ప్రేమాలయం
చ||శిఖర దర్శనం చింతలహరణం
       మూర్తి దర్శనం మోక్షకారణం
        నాలుగు పురుషార్ధాలను
        అందజేయు ఆలయం
        నమ్మినభక్తులపాలిటి సొమ్మైన ఆలయం ||ఆ||
చ||దత్తదేవుకరుణా – ధర్మాచరణ
       చిత్తశాంతి చేకూర్చే – చిన్మయనిలయం
        సద్గురుడౌ సాయీశుని – చక్కనైనఆలయం
        నిత్య సత్యమౌ ప్రేమనునేర్పే - యీఆలయం  ||ఆ||
చ||పూజచేసిన భజనచేసినా
       పుండరీకవరదుని జపము చేసినా
       ఎంచలేని ఫలమిచ్చు యీసాయి ఆలయం
       ఇలలో నందనవనిలో వెలసిన యీ ఆలయం ||ఆ|| 

********





LikeShow more reactions
Comment
Comments

వేమన శతక పద్యములు

శివకవులకు నవకవులకు
శివభక్తికి తత్త్వమునకుఁ జింతామణికిన్
శినలోక ప్రమథులకును
శివునకు,గురువునకును శరణు సేయర వేమా!(1)

శ్రీకరంబగు వేమన జెప్పినట్టి
పద్యముల నెవ్వడేనియు పఠన సేయు
నట్టి పురుషుడు మనమున నిట్టిదనుచు
జెప్పరానట్టి వస్తువు జోరు వేమా!(2)

అడవి యడవిఁ దిరిగి యాసను విడలేక
గాసి పడెడు వాడు ఘనుడు గాడు
రోసి రోసి మదిని రూఢిగా నిలిపిన
వాడు పరముఁగన్న వాఁడు వేమా! (3)

ఓ గు నో గు మె చ్చు , నొ న రం గ న జ్ఞా న
భా వ మి చ్చి మె చ్చు , బ ర మ లు బ్ధు
పం ది బు ర ద మె చ్చు , బ న్నీ రు మె చ్చు నా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా! (4)

నీ టి లో ని వ్రా త , ని లు వ క యు న్న ట్లు
పా టి జ గ తి లే దు , ప ర ము లే దు
మా ట మా ట కె ల్ల , మ న సు గో రు చు నుం డు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా! (5)

ని క్క మై న మం చి నీ ల మొ క్క టి చా లు
ద ళు కు బె ళు కు రా ళ్ళు త ట్టె డే ల
చ దు వ ప ద్య మ ర య జా ల దా యొ క టై న?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(6)

గం గి గో వు పా లు గం టె డై న ను జా లు
గ డి వె డై న నే మి ఖ ర ము పా లు
భ క్తి గ లు గు కూ డు ప ట్టె డై న ను జా లు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(7)

ఉ ప్పు క ప్పు రం బు నొ క్క పో లి కె నుం డు
జూ డ జూ డ రు చు ల జా డ వే రు
పు రు ష లం దు బు ణ్య పు రు షు లు వే ర యా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(8)

చి త్త శు ద్ధి క ల్గి చే సి న పు ణ్యం బు
కొం చె మై న న ది యు గొ దు వ గా దు
వి త్త నం బు మ ర్రి వృ క్షం బు న కు నెం త?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(9)

ఆ త్మ శు ద్ధి లే ని యా చా ర మ ది యే ల?
భాం డ శు ద్ధి లే ని పా క మే ల?
చి త్త శు ద్ధి లే ని శి వ పూ జ లే ల రా?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(10)

మి ర ప గిం జ జూ డ మీ ద న ల్ల గ నుం డు
కొ రి కి చూ డ లో న చు ఱు కు మ ను ను
స జ్జ ను ల గు వా రి సా ర మి ట్టు ల నుం డు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(11)

అ ను వు గా ని చో ట న ధి కు ల మ న రా దు
కొం చె ముం డ టె ల్ల గొ దు వ గా దు
కొం డ య ద్ద మం దు గొం చ మై యుం డ దా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(12)

అ ల్పు డె పు డు బ ల్కు నా డం బ ర ము గా ను
స జ్జ నుం డు ప ల్కుఁ జ ల్ల గా ను
కం చు మ్రో గు న ట్లు క న కం బు మ్రో గు నా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(13)

మృ గ మ దం బు చూ డ మీ ద న ల్ల గ నుం డు
బ రి ఢ వి ల్లు దా ని ప రి మ ళం బు
గు రు వు లై న వా రి గు ణ ము లి ట్లుం డు రా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(14)

ఓ ర్పు లే ని భా ర్య యు న్న ఫ లి త మే మి?
బు ద్ధి లే ని బి డ్డ పు ట్టి యే మి?
స ద్గు ణం బు లే ని చ దు వ ది యే ల రా ?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(15)

కో ప ము న ను ఘ న త కొం చ మై పో వు ను
కో ప ము న ను మి గు ల గో డు జెం దు
గో ప మ డి గి నే ని కో రి క లీ డే రు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(16)

గు ణ యు తు న కు మే లు గో రం త చే సి న
కొం డ య గు ను వా ని గు ణ ము చే త
కొం డ యం త మే లు గు ణ హీ నుఁ డె రు గు నా?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(17)

నిం డు న దు లు పా ఱు ని లి చి గం భీ ర మై
పె ట్ల వా గు ప ఱు వే గ బొ ర్లి
అ ల్పు డా డు రీ తి న ధి కుం డు నా డు నా?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(18)

గం గ పా రు చుం డు గ ద ల ని గ తి తో డ
ము ఱి కి కా ల్వ పా రు మ్రో త తో డ
దా త యో ర్చి న ట్ల ధ ము డో ర్వ గ లే డు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(19)

గు వ్వ కొ ఱ కు మే ను గో సె యా శి బి రా జు
వా ర్త వి డు వ రా క; కీ ర్తి కె క్కె
వో గు నెం చ బో వ రు ప కా రి నెం తు రు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(20)

చం పఁ ద గి న య ట్టి శ త్రు డు త న చే త
జి క్కె నే ని కీ డు చే య రా దు
పొఁ స గ మే లు చే సి పొ మ్మ ను టే చా లు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(21)

తం డ్రి క న్న సు గు ణ త న యుఁ డె యొ ప్పె నా
పి న్న పె ద్ద త న ము లె న్న రె వ రు
వా సు దే వు వి డి చి వ సు దే వు నెం తు రా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(22)

త ప్పు లె న్ను వా రు తం డో ప తం డం బు
లు ర్వి జ ను ల కె ల్ల నుం డు త ప్పు
త ప్పు లె న్ను వా రు త మ త ప్పు లె ఱు గ రు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(23)

తే నె తె ర ల జా డ తే నీ టీఁ గ యె ఱుం గు
సు మ ర సం బు జా డ భ్ర మ ర మె ఱుఁ గు
బ ర మ యో గి జా డ భ క్తుఁ డె ఱుం గు ను
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(24)

ధా ర్మి కు నఁ గా ని ధ ర్మం బు గ న రా దు
క ష్ట జీ వి కె ట్లు గా న బ డు ను
నీ రు చొ ర క లో తు ని జ ము గా దె లి య దు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(25)

నీ చ గు ణ ము లె ల్ల ని ర్మూ ల మై పో వుఁ
గొ దు వ లే దు సు జ న గో ష్టి వ ల న
గం ధ మ ల దఁ మే ని గం ప డం గి న య ట్లు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(26)

నే ర న న్న వాఁ డు నె ర జా ణ మ హి లో న
నే ర్తు న న్న వాఁ డు నిం దఁ జెం దు
ఊ ర కు న్న వా డె యు త్త మో త్త ముఁ డ యా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(27)

మే డి పం డు జూ డఁ మే లి మై యుం డు ను
పొ ట్ట వి చ్చి చూ డఁ బు రు గు లుం డుఁ
బి రి కి వా ని మ ది ని బిం క మీ లా గు రా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(28)

లం క పో వు నాఁ డు లం కా ధి ప తి రా జ్య
మం త క పు ల సే న లా క్ర మిం చెఁ !
జే టు కా ల మై నఁ జె ఱు ప న ల్పుఁ డె చా లు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(29)

వ ద్ద నం గ బో దు వ ల్లె య న గ రా దు
తా నుఁ జే సి న ట్టి దా న ఫ ల ము
ఉ ల్ల మం దు వ గ వ కుం డు టే క్షే మం బు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(30)

వె ళ్ళి వ చ్చి నాఁ డు మ ళ్ళి పో య్యే నా డు
వెం ట రా దు ధ న ము కొం చు బో డు
తా న దే డ బో నొ ధ న మ దే డఁ బో నొ ?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(31)

సా టి వా రు ని న్ను సా ధిం ప గా లే రు
దై వ మె పు డు నీ కుఁ ద ప్ప కు న్న
భా ర తం బు లో ని ప ర మా ర్ధ మి దె క దా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(32)

చి న్న నాఁ డు నీ వు చే సి న క ర్మం బు
మ ఱ తు వే మో మ ది ని మ ల్ల డిం చి
త ఱి మి ము ట్ట జూ చు త ల ప డి న ప్పు డు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(33)

చే టు వ చ్చె నే ని చె డ నా డు దై వం బు
మే లు వ చ్చె నే ని మె చ్చు కొ ను ను
గ రి మ మే లు కీ ళ్ళు కా వ డి కుం డ లౌ
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(34)

మం చి నీ రు పో య మ ల్లే పూ చు ను గా ని
ఫ లి త మొ న రు టె ట్లు ప ని జొ ర మి ని
వం ట చే య కె ట్లు వం ట క మ బ్బు ను
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(35)

వ్రాఁ త వెం టఁ గా ని వ రఁ మీ డు దై వం బు
చే త కొ ల ది గా ని వ్రాఁ త కా దు
వ్రాఁ త క జు డు క ర్త చే త కుఁ దాఁ గ ర్త
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(36)

కు ల ము లో న నొ కం డు గు ణ వం తుఁ డుం డె నా?
కు ల ము వె ల యు వా ని గు ణ ము చే త
వె ల యు వ న ము లో న మ ల య జం బు న్న ట్లు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(37)

కు ల ము లో న నొ క డు గు ణ హీ ను డుం డి న
గు ల ముఁ జె డు ను వా ని గు ణ ము వ ల న
వె ల యుఁ జె ఱ కు నం దు వె న్ను వె డ లి న ట్లు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(38)

రా ము డొ క డు పు ట్టి ర వి కు ల మీ డే ర్చె
కు రు ప తి యు ను బు ట్టి కు ల ముఁ జె ఱి చె
ని ల న ధ ర్మ ధ ర్మ ము ల రీ తు లి ట్టి వి
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(39)

హా ని చే తఁ గ లు గు న ధి క దః ఖం బు లు
హా ని చే తఁ ద ప్ప ద ర య సు ఖ ము
హా ని చే తఁ గొం త య ల మ ట గ లు గు రా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(40)

క్ష మ గ ల ట్టి య తఁ డు సా ధు వై శో భిం చు
నో ర్పు బో లు స ట్టి దు ర్విఁ గ ల దె?
వ న్నె వ చ్చు మే లు లె న్ని యై న ను గూ డు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(41)

వే ఱు పు రు గు చే రి వృ క్షం బుఁ జె ఱ చు ను
జీ డ పు రు గు జే రి చె ట్టుఁ జె ఱ చు
గు త్సి తుం డు జే రి గు ణ వం తుఁ జె ఱ చు రా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(42)

హీ న గు ణ ము వా ని ని లు సే ర ని చ్చి న
నెం త వా రి కై న ని డు మ గ లు గుఁ
నీఁ గ క డు పు జొ చ్చి యి ట్ట ట్టు సే య దా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(43)

అ ల్ప బు ద్ధి వా ని క ధి కా ర మి చ్చి న
దొ డ్డ వా రి నె ల్ల దొ లఁ గ గొ ట్టుఁ
జె ప్పుఁ ది నె డి కు క్క చె ఱ కు తీ పె రు గు నా?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(44)

హీ నుఁ డె న్ని వి ద్య లి ల ను నే ర్చి నఁ గా ని
ఘ నుఁ డు గా డు హీ న జ నుఁ డె గా ని
ప రి మ ళ ము ల గా ర్ద భ ము మో యఁ గ రి యౌ నె
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(45)

ఎం త క ష్ట ముం డు నం త పా ప పుఁ జిం త
చిం త లే క మి గు ల జి వు కు మ న సు
చిం త లే క యు న్నఁ జె డ ని సం ప దఁ గాం చు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(46)

వి ద్య లే ని వాఁ డు వి ద్యా ధి కు ల చెం త
నుం డి నం తఁ బం డి తుం డు గాఁ డు
కొ ల ని హం స ల క డ గొ క్కె ర యు న్న ట్లు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(47)

ఎ లు క తో లుఁ దె చ్చి యే డా ది ఉ తి కి న
న లు పు న లు పే గా ని తె లు పు గా దు
కొ య్య బొ మ్మ నుఁ దె చ్చి కొ ట్టి న ప లు కు నా?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(48)

ఎ ద్దు కై న గా ని యే డా ది తె ల్పి న
మా టఁ దె లి సి న డు చు మ ర్మ మె ఱిఁ గి
మొ ప్పె తె లి య లేఁ డు ము ప్ప దేం డ్ల కు నై న
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(49)

పా లు పం చ దా ర పా ప ర పం డ్ల లోఁ
జా ల బో సి వం డఁ జ వి కి రా వు
కు టి ల మా న వు ల కు గు ణ మే ల గ ల్గు రా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(50)

పా ము క న్న లే దు పా పి ష్టి జీ వం బు
అ ట్టి పా ము చె ప్పి న ట్లు వి ను ను
ఖ లు ని గు ణ ము మా న్ప ఘ ను లె వ్వ రు ను లేరు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(51)

వే ము పా లు బో సి ప్రే మ తోఁ బెం చి నఁ
జే దు వి ఱి గి తీ పు చెం ద బో దు
ఓ గు నో గె గా క యు చి త జ్ఞుఁ డె టు లౌ ను
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(52)

ము షి ణి వే ప చె ట్టు మొ ద లం ట ప్ర జ ల కుఁ
బ రఁ గ మూ లి క ల కు బ ని కి వ చ్చు
ని ర్ద యా త్మ కుం డు నీ చుఁ డెం దు కు కా డు?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(53)

అ న్ని దా న ము ల కం టె ను న న్న దా న మె గొ ప్ప
క న్న వా రి కం టె ఘ ను లు లే రు
ఎ న్న గు రు ని కం టె నె క్కు వ లే ద యా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(54)

గురుని నిందఁజేసి గుర్తెఱంగని నాడు
యముని బాధ నొందుఁ గ్రమముగాను
దేనె లోని యీఁగ తెఱగున నగునయా
విశ్వదాభిరామ వినుర వేమా!(55)
( తేనెలో పడ్డ ఈగ బయటకు రాలేక ఎలాగ అవస్థ పడుతుందో, అదే విధంగా గురువుని ధూషించి గౌరవించని వాండ్లు తదుపరి నరకయాతన అనుభవించవలసివస్తుందని , గురభక్తి గురించి హెచ్చరించడమైనది. )

గు రు వు లే క వి ద్య గు రు తు గా దొ ర క దు,
నృ ప తి లే క భూ మి ని య తి గా దు
గు రు వు వి ద్య లే క గొ ప్ప పం డి తు డౌ నె?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(56)
{ గురువు (ఉపాధ్యాయుడు) లేకుండా సంపూర్ణ విద్య లభించదు; రాజు (ప్ర భు త్వ ము) లేకపోతే పాలన జరుగదు;అలాగే విద్య లేకుండా గురువు కూడా గొప్ప పండితుడు కాలేడు}

గు రు వు వ చ్చు చు న్నఁ గూ ర్చుం డి లే వ ని
తుం ట రు ల కు నె ట్లు దొ ర కు వి ద్య?
మ గ ని లె క్క గొ న ని మ గు వ కా గ తి ప ట్టు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(57)
{గురువుకు తగిన గౌరవము ఇవ్వని తుంటరులకు (ధూర్తులకు) విద్య అబ్బదు . అలాగే , భర్తకు తగిన విలువ ఇవ్వక పోతే భార్యకూ విలువ ఉండదు.}

శిష్య ధర్మమెఱిగి చిక్కని భక్తితో
గురుని సేవ జేయ గుదురి నపుడె
సర్వ మర్మములను జక్కగా విడిపోవు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(58)
( శిష్యుడు తన శిష్య ధర్మము తెలుసుకొని, సంపూర్ణ గురు భక్తితో గురు సేవ చేసినపుడే, గురువు విద్య పూర్తిగ చెప్పి అతని సందేహములన్ని తీర్చగలడు. అనగా, విద్య నేర్చుకొనుటకు శ్ర ద్ధ, భక్తి ఉండాలి)

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్ట నేమి,
పుట్టలోనఁ జెదలు పుట్టవా? గిట్టవా?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(59)
[తల్లిదండ్రి మీద దయలేని (బాగోగులు చూడని) కొడుకు పుట్టిన, పుట్టక పోయిన ఒకటే. (చచ్చిన వానితో సమానం); వారు (అట్టి కొడుకులు) చెదపురుగులు వలే ఉపయోగము లేనివారు.]{చెద పురుగు తను పు ట్ట పెట్టుటకు ఆధారమైన వస్తువు నే (కర్ర, బట్ట, కాగితము మొ.వి) తిని శల్యము చేస్తుంది}

తల్లి బిడ్డలకును దగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చునని గడింత్రు
కాని యెల్లడలను ఘన దుఃఖకరమది
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(60)
{డబ్బుంటే అంత సుఖమయమని గడిస్తారు; కాని, దాని వలన ఏన్నో బాధలు (దుఃఖము కల్గిస్తుంది), చివరకు తల్లి బిడ్డల మధ్య సైతము చిచ్చుపెట్టుతుంది.}

తామసించి చేయ దగదెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమె యగును
పచ్చికాయదెచ్చి పడివేయ ఫలమౌనె
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(61)
{పచ్చి పింది కాయను తెచ్చుకొని తింటే ఫలమవుతుందా (రుచిగా ఉంటుందా?) అలాగే బాగా మ్రుగ్గిన,కుళ్ళిన ఫలము కూడా విషంతో సమానం కదా? అలాగే , ఏ పనైన సమయానుకూలంగ చేయాలి. తొందర పడ కూడదు .}

ధర్మమునకుఁ గీడు తలచిన వాఁడు తా
ఘనుడగుచుఁ దుదకు ద్రోవచెడును.
గుర ధనంబుఁ గోరి నరుఁడు నాశముఁ గాడె
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(62)
{ధర్మానికి కీడు తలపెట్టినవాడు తాత్కాలికంగా గొప్పవాడైనా (కీర్తిగడించినా) చివరకు అధోగతిపాలవక తప్పదు. అలాగే, దేవుని సొమ్ము ఆశించినవాడు నాశనము కాక దప్పదు.}

నిజము కల్ల రెండు నీలకంఠుఁ డెఱుంగు
నిజము లాడకున్న నీతి, దప్పు
నిజము లాడు నతఁడు, నీరూపమనవచ్చు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(63)
{సత్యా,అసత్యాలు రెండూ పరమేశ్వరునికి తెలుసును, సత్యము పలుకపోతే ధర్మము తప్పుతుంది, సత్యాన్ని పలికేవాడు భగవ్ద్స్వరూపుడే.}

పాల గలియ నీరు పాలై విరాజిల్లు
నట్లు గురుని వలన వినమ్రుఁడగును
సాధు సజ్జనుల సంగమమిట్లురా!
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(64)
{నీరు పాలతోకలిసినపుడు పాలవలె మారినట్లు, మంచివారి (సాధు,సజ్జనుల) సహవాసము వలన-గురువుని ఆశ్రఇంచడమువలన సామాన్యుడు కూడా సద్గుణుడగును.}

నిజము లాడు నతడు నిర్మలుడై యుండు
నిజములాడు నతడు నీతిపరుడు
నిజముబల్కకున్న నీచ జన్మడెయగు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(65))
{సత్యవంతుడు నిర్మలుడై, నీతిపరుడై ఉండును . అబద్ధాలాడె వాడు నీచ జన్మలను పొందును.}

పెట్టిపోయలేని వట్టినరులు భూమిః
పుట్టనేమి వారు గిట్ట నేమి
పుట్టలోనజెదలు పుట్టవా గిట్టవా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(66)
{దానధర్మాలు చేయని మనుషులు , చెద పుట్టలో పుట్టిన చెదల వలె పుట్టి, చచ్చి నట్లే.}

వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు
వాక్కు వలన గలుగు వసుధ ఘనత
వాక్కు వలన గలుగు పెక్కుడైశ్వర్యముల్
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(67)
{పలుకు (సంకీర్తన) వలన మోక్షము పొందవచ్చు; పలుకు (శాసనము) వలన రాజ్యము పొందవచ్చును; పలుకు (నోటిమంచితనము, విద్యా చాతుర్యము) వలన అనేక సిరిసంపదలను పొందవచ్చును}

నీళ్ళలోన మోసలి నిగిడి యేనుఁగుబట్టు
బైటఁ గుక్క చేత భంగపడును
స్థాన బలిమికాని తన బలిమికాదయా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(68)
{ నీళ్ళలో ఉన్న మొసలి ఏనుగును సైతము పట్టి కట్టడిచేసి భాధించ గలదు. అదే మొసలి నీతినుండి బయటకు వస్తే, చివరకు కుక్క కూడ దానిని లెక్క చేయక పీడిస్తుంది. ఆనగా , మన శక్తులు మనమున్న పరిస్థితులబట్టి ఉంటాయని గ్రహించాలి.}

నీళ్ళలోను మీను నిగిడి దూరము పాఱు
బైట మూరడైనఁ బాఱలేదు
స్థాన బలిమికాని తన బలిమికాదయా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(69)
{ నీళ్ళలో చేప ఎంతో వేగంగా ఎంతో దూరము వెళ్ళ గలదు (ఈదగలదు) అదే నీళ్ళ బైట మూరెడు దూరము కూడా వెళ్ళలేదు. ఆనగా , మన శక్తులు మనమున్న పరిస్థితులబట్టి ఉంటాయని గ్రహించాలి.

నీళ్ళఁలోన నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బైట మూరడైనఁ బాకలేదు
నెలవుదప్పుచోట నేర్పరి కొఱగాడు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(70)
{నీళ్ళలో ఓడ ఎంతో దూరము ప్రయాణించ గలదు అదే నీళ్ళ బైట మూరెడు దూరము కూడా వెళ్ళలేదు. ఆనగా, మన నేర్పరితనము ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించాలి. అన్నిచోట్లఉపయోగములేదు (పనిచేయదు) పరిస్థితులబట్టి ఉంటాయని గ్రహించాలి.

కవియుఁగానగ లేడు - కదిలింపఁడానోరు
వినియు వినఁగ లేడు - విస్మయమున
సంపద గలవాని - సన్నిపాతం బిది
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(71)
{సంపన్నులు పక్ష వాతము వచ్చిన వాని వలే, చూసినా చూడనట్లు; మాట్లాడించినా మాట్లాడడు; విన్నా విననట్లు ప్రవర్తిస్తారని సంపన్నుల దుర్హంకారాన్ని చక్కగా తెల్పబడినది.}

కులములేనివాఁడు – కలిమిచేవెలయును
కలిమి లేనివాడు – కులము దిగును
కులముకన్న ఘనుని – కలిమి యెక్కువసుమీ
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(72) 
 {ధనం ఇదం మూలం జగత్! – కులము తక్కువైనా సంపద ఉంటే గౌరవించబడుతాడు.సంపద లేకపోతే, అగ్ర కులజుడైనా గౌరవమివ్వరు.కులము కన్నా సంపదకే విలువ ఇస్తారని భావము.}

కులము గలుగు వాడు – గోత్రంబు గలవాడు
విద్యచేత విఱ్ఱ- వీగువాడు
పసిడి గల్గువాని – బానిస కొడుకులు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(73)
{కులము, గోత్రము, వంశ గౌరవము, విద్యాధిక్యత అన్ని సంపదముందు తృణప్రాయములే; ఇవన్నియు ధనవంతుని ఆశ్రయించవల్సినదే కదా?}

గొడ్డుటావుఁ బిదుక - కుండఁ గొంపోయినఁ
బాలనీక తన్నుఁ-బండ్లురాల
లోభివాని నడుగ – లాభంబులేదయా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(74)
{గొడ్డుబోయిన (పాలు ఇవ్వటం ఆగిపోయిన) ఆవు పాలు పిదుకడానికి, కుండతీసుకొని వెల్లి ప్రయత్నిస్తే, పాలు ఇవ్వదుకదా, పడ్లు రాలేటట్టు తన్నుతుంది, తద్వార కుండ పగులుతుంది, మనకు దెబ్బ; అలాగే పిసినారి వానిని సాయం అడగటం వలన ఉపయావగం ఉండదు.}

నీళ్ళలోన మీను – నెఱి మాంస మాసించి
గాలమందు జిక్కు కర ణి భువిని
ఆశదగలి నరుండాలాగె – చెడిపోవు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(75)
{జాలరి గాలానికి వ్రేలాడ దీసిన ఎర గురించి చేప జాలరికి చిక్కిప్రాణాపాయము తెచ్చుకొంటున్నట్లు, మానవుడు ఆశ అనే గాలానికి చిక్కి కష్టాలు కొనితెచ్చుకుంటున్నాడు.}

ఆశచేత మనుజుఁడు – లాయువు గలనాళ్ళు
తిరుగుచుందురు – భ్రమను ద్రిప్పలేక
ముఱికిభాండమందు – ముసురు నీఁగలభంగి
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(76)
{మురికి గుంటల చుట్టా మూగే ఈగల మాదిరి , బ్రతికినన్నాళ్ళు, మానవుడు మోహమనే భ్రమలో పడి తిరుగుతుంటారు. }

ఆశపాపజాతి యన్నింటి కంటెను
నాసచేత యతులు – మోసపోరె
చూచివిడుచువారు - శుద్ధాత్మలెందైన
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(77)
{ఆశామోహంలోపడి సన్యాసులు కూడా దారి తప్పుతారు, ఆశా మోహమును తెలుసుకొని పూర్తిగ విడిచినవారే సుద్ధాత్ములు.- బ్రహ్మజ్ఞులు}

ఆశకంటేదుఃఖ – మతిశయింపగ లేదు
చూపునిలుపకున్న – సుఖములేదు
మనసు నిలుపకున్న – మఱిముక్తిలేదయా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(78)
{ఆశ (మోహము) ను మించిన దుఃఖము లేదు; దాని గురించి జాగ్రత్త పడకపోతే సుఖములేదు, మనస్సును నిగ్రహించుకోకపోతే ముక్తి మీద దృష్టి పెట్టడం కుదరదు, లభింపదు.}

ఆశగననివాని – నాశ్రయింపగ రాదు
ఆశదీర్చువాని – నడుగ వలయు
ఆశ గలుగునంత – నమలుందు గాడయా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(79)
{మన అవసరమును (కోరికను ) గుర్తించని వానిని ఆశ్రయించరాదు (ఊపయోగముండదు); పెట్టేవాడినే (అవసరము తీర్చేవాడినే)అడగాలి; కోరికలు లేనంతమాత్రాన, నిర్మలుడు కాడు.}

ఎక్కుడైనయాశ – లినుమడియైయుండఁ
దిక్కుపట్టి నరుడు – తిరుగుచుండుఁ
గుక్కవంటియాశ – గూర్చుండనీయదు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(80)
{కుక్క బుద్ధిలాంటి ఆశలు ఎక్కువైనప్పుడు, మనిషి దిక్కుతోచక వాటి కొరకు నిరంతరము శ్రమపడి తిరుగుతుంటాడు. కుక్క ఏదన్నా తినడానికి ప్రయత్నించినపుడు, ఎవరన్నా దాన్ని కొట్టి తోలితే, మరలా అలా దొంగతనంగా తినకూడదనుకొంటుందట; కాని, కొంచం తరువాత ఆ తిన్న దెబ్బలను మర్చి పోయి మరలాఇంకో చోట లేద ఇంకో సారి మళ్ళా అదేపని చేస్తుందట, అలాగే మనిషి కూడా ఆశామోహంనుంచి బయటకు వద్దామనుకొంటాడు, కాని అవ బలీయమై, మనవుని మనస్సు , బుద్ధి దుర్భలమైనప్పుడు బయటపడలేడు. }

లోభివానిఁ జంప – లోకంబులోపల
మందు వేరు వలదు – మతము గలదు
పైకమడుగ చాల – భగ్గురమని చచ్చు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(81)
{పిసినిగొట్టు ని చంపడానికి వేరే మందు అక్కరలేదు. చిన్నఉపాయముంది, డబ్బు అడిగితే తనే ఆవేశపడి చస్తాడు.}

వ్యాధి నెఱుఁగలేని వైద్యంబదేలరా
కొదువ దెలియలేని కోర్కెలేల?
మనసు తెలియలేని మర్మజ్ఞు లేటికి?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(82)
{జబ్బు తెలుసుకోకుండా వైద్యము, హద్దు తెలియని కోర్కెలు, మనసు తెలుసుకోలేని విజ్ఞత పనికి రానివి.}

తిరిగివచ్చు వేళ మరలిపోయెడు వేళ
వెంటఁ దేరు ధనము నంటఁబోరు
తానెటకుఁ జనునో ధనమెందుఁబోవునో
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(83)
{భూమిమీదకు వచ్చినప్పుడు మరల తిరిగి వెళ్ళునప్పుడు (పుట్టినపుడు, మరణించినపుడు)
ఈ ధనము (సంపదలు) మనతో ఉండదు; మనము మరలా ఎక్కడ, ఏజన్మఎత్తుతామో కూడాతెలియదు, అలాగే సంపదకుడా ఏమవుతుందో తెలియదు; కనుక అటువంటి ధనము (సంపద) మీద వ్యామోహము తగదని శతకకారుని సూచన.}

కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు
సత్య మాడువాని స్వామి యెఱుఁగు
బెక్కుతిండిపోతుఁ బెండ్లా మెరుంగురా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(84)
{అబద్ధాలు, అసత్యములు చెప్పేవానిగురించి ఆ ఊరి గ్రామాధికారికి తెలుస్తుంది, అలాగే సత్యాన్ని పలికేవానిగురించి దేముడుకి తెలుస్తుంది (స్వామి కరుణిస్తాడని భావం), తిండిపోతు తిండి గురించి రోజూ అన్నం పెట్టే అతని భార్యకు తెలుస్తుంది.}

ఉప్పులేని కూర యూనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదు?
అప్పులేనివాఁడె యధికసంపన్నుండు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(85)
{ఉప్పు లేని కూర రుచించదు (రుచి తక్కువగ ఉంటుంది), పప్పులేని భోజనం బలమునీయదు, నిజమైన సంపన్నుడెవరంటే అప్పులు లేని వాడే!}

ఇనుము విఱిగెనేని నినుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగెనేని మఱి యంటసేర్చునా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(86)
{ఇనుప వస్తువు ఏదన్నా విరిగిపోతే కమ్మరి, దనిని కొలిమిలో బాగ రెండు-మూడుసార్లు కాల్చి, సమ్మెటతో కొట్టి అతికించగలుగుతాడు; కాని, సున్నితమైన మనసు విరిగితే, (కష్టపెట్టుకుంటే, విరక్తి కలిగితే) దాన్ని సరిచేయడం (అతికించడము- మనసులు కలపటం) ఎవరి తరముకాదు.(దుర్లభము), కనుక, మనసులు విరగకుండా జాగ్రత్తగా ప్రవర్తించమని శతకకారుని హెచ్చరిక.

ఇమ్ముఁదప్పువేళ నెమ్మెలెన్నియు మాని
కాలమొక్కరీతి గడుపవలయు
విజయుఁడిమ్ముదప్పి విరటునిగొల్వడా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(87)
{సంకటములు (ఇబ్బందులు) వచ్చినపుడు, అర్జునుడు సంకటము వచ్చి (అజ్ఞాతవాసంలో) విరటునికొల్వులో పనిచేసినట్లు బేషజములుమాని, బాధపడకుండా కాలము గడపాలి}

కర్మ మధికమయిన గడచిపోవగరాదు
ధర్మరాజుఁదెచ్చి తగనిచోటఁ
గంకుభట్టుఁజేసె గటాకటాదైవంబు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(88)
{ధర్మరాజు వంటివానిని విరటునిదగ్గర కంకుభట్టునిగ ఆ దైవము చేసెనుగదా! కర్మ ఫలాన్ని ఎవరు దాటలేరు (తప్పించుకోలేరు)}

ఆ|| ధనముకూడఁబెట్టి – దానంబు సేయక
తానుదినకలెస్స - దాచుఁగాక
తేనేటీఁగ కూర్చి - తేరువరికియ్యదా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(89)
{తేనిటీగ ప్రోగుచేసిన తేనెను(తేనెపట్టును) దారినపోయెవారు తీసుకొనివెళ్ళినట్లు, సంపాదించినధనమును తాననుభవింపక, ఇతరులకు దానముచేయకపోతే, ఇతరుల(ప్రభువుల) పాలవతుంది.కష్టము ఒకరిది, ఫలితము ఇంకొకరికి.}

ఆః పరఁగ ఱాతిగుండు పగలఁగొట్టవచ్చు
కొండలన్ని పిండి గొట్టవచ్చుఁ
గఠిన చిత్తు మనసు కరిగింపఁగారాదు
విశ్వ దా భి రా మ వి ను ర వే మా! (90)
{ప్రయాసపడి వజ్రాన్ని పగలఁగొట్టవచ్చును, కొండలనిసైతము పిండీచేయవచ్చును; కాని, కఠినాత్ముని మనసును జాలి కలిగినవానిగ మార్చడము మాత్రము అసాధ్యము.}

ఆఃచెప్పులోనిఱాయి – చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు – కాలిముల్లు
ఇంటిలోని పోరు – నింతంత కాదయా
విశ్వ దా భి రా మ వి ను ర వే మా! (91)
{చెప్పులో ఱాయి దూరినప్పుడు, చెవిదగ్గర జోఱీగ తిరుగుతున్నడు, కంటిలో నలుసు పడ్డప్పుడు, కాలిలో ముల్లు గుచ్చుకొన్నప్పుడు, ఇంటిలో తగాదాల (కీచులాటలు) బాధ ఇంతనిచెప్పలేము (భరించటము కష్టము)}

ఆః అంతరంగ మందు – నపకారములుఁ జేసి
మంచివాని వలెను – మనుజుడు
ఇతరులెరుగకున్న – నీశ్వరుఁడెరుగడా?
విశ్వ దా భి రా మ వి ను ర వే మా! (92)
{పైకి మంచివానివలే నటిస్తూ ఇతరులకు కీడు చేసేవానిని, ఇతరులు పసిగట్టలేకపోయినా భగవంతునికి తెలియకుండదు గదా?}

ఆః గాజు కుప్పెలోన – కడగుచు దీపంబ
దెట్టులుండు జ్ఞాన – మట్టులుండుఁ
దెలిసి నట్టివారి – దేహంబు లందున
విశ్వ దా భి రా మ వి ను ర వే మా! (93)
{గాజు కుప్పెలోన దీపము ఎలా నిశ్చలంగా వెలుగుతుంటుందో అలాగే విజ్ఞానులయందు జ్ఞానము ప్రకాశిస్తూ యుంటుంది.}

అంకిలెఱిగిమాట-లాడనేర్చిన యపుడె
పిన్న పెద్దతనము – లెన్ననేల?
పిన్న చేతిదివ్వె బెద్దగా వెలుఁగదా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(94)
{కాగడా చిన్నవాడు పట్టుకుంటే వెలుగు తగ్గనట్లు, ఆపదలను తెలుసుకొని, చాకచక్యంగా మాట్లాడము తెలిసివానికి వయస్సుతో నిమిత్తములేదు. చిన్నవాడైనా అతని మాటను గౌరవించాలి.}

పదుగురాడ మాట – పాటియైధరఁజెల్లు
నొక్కడాడు మాట – యెక్కదెందు
నూరకుండువాని –కూరెల్ల నోపరు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(95)
[పదిమంది అన్నమాటె చెల్లుతుంది తప్ప, ఒక్కరు నిజము చెప్పినా అది ఎవరూ వినుపించుకోరు; ప్రయత్నం లేకుండా ఏది ఫలించదు. కనుక పదిమందిని ఒప్పించగలిగినపుడే మన మాటకు విలువ ఉంటుంది.]

ధార్మికునకుఁగాని – ధర్మంబు గనరాదు
కష్టజీవికెట్లు – గానఁబడును
నీరు చొరక లోతుఁ – నిజముగాఁదెలియదు
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(96)
[నీటిలో దిగకుండా నీటి లోతు ఎలా తెలియదో, అలాగే పండితునికి తెల్సినట్లు ధర్మ సూక్ష్మాలు, కాయకష్టం చేసుకొనేవానికి ఎలాతెలుస్తాయి? కనుక మనము వారినుండి ధర్మసూక్ష్మాల ఆచరణ గురించి ఆశించకూడదు.

అన్నమిడుట కన్న – నధిక దానంబుల
నెన్ని చేయనేమి – యెన్నఁ బోరు
అన్నమన్న జీవి కాధారమగునయా
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(97)
[జీవించడానికి  ఆధారమైన అన్న దానము ముందు ఏ ఇతర ఎంత గొప్ప దానాలైనా సాటిరావు, గొప్పవికావు.]

అన్న మధికమైన – నరయ మృత్యువు నిజం
బన్న మంటకున్న – నాత్మనొచ్చుఁ
జంపఁ బెంప బువ్వ – చాలదా వేయేల?
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(98)
{అన్నం (తిండి) ఎక్కువైతే తప్పక అనారోగ్యంతో చావు తప్పదు; అలాగే తిండి తినక పస్తులున్నా ఆత్మారాముడు క్షోభించి (శరీరము నీరసించి) చావు తప్పదు. కనుక, మనిషిని బ్రతికించడానికి, చంపడానికి అన్నం చాలు వేరే ఇతరములతో పనిలేదు.}

అన్నమడుఁగ నతని – కన్నంబు బెట్టకఁ
బాఱవేయ దాన – ఫలితమేమి?
ధనికునకు నొసంగు – దానంబువలెఁగాదె
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(99)
[ధనవంతునికి చేసిన దానము వలె, అన్నము అడిగినవానికి అన్నము పెట్టకుండా బయటపాఱవేసిన ఏమి లాభముండదు.]

మాటలాడు టొకటి – మనసులో నొక్కటి
యొడలి గుణము వేఱె – యోచనేఱె
యెట్లుగల్గు ముక్తి –యీలాగుతానుండ
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(100)
[మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటిచెప్పువానికి, ఆలోచనఒకటి చేసేదిఒకటిఅయనప్పుడు (కపటి,మోసగాడు), వానికిముక్తి కలుగదు.]

ఇహపరంబులకును నిది – సాధనం బని
వ్రాసి చదివి – విన్న వారికెల్ల
మంగళంబు లొనరు – మహిలోన నిది నిజము
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!(101)
[ఇహలోకము, పరలోకము నందు శుభప్రదముగ నుండుటకు అవసరమైన సాధనముగా నుండునని (సూక్తులు) వేమనవ్రాసిన ఈ శతకము (పద్యములు) చదివినవారికి, విన్నవారికి అందరికీతప్పకుండా శుభము కలుగుతుందనుటలో సందేహములేదు.]

సంపూర్ణము
సర్వేజనా సుఖినోభవంతు!

01 April, 2017

గృహిణి వ్యక్తిత్వవికాసానికి ద్రౌపది మార్గ నిర్దేశికాలు-ఆంధ్ర మహాభారతము

శ్రీరామ జయరామ జయజయ రామ!

గృహిణి వ్యక్తిత్వవికాసానికి ద్రౌపది మార్గ నిర్దేశికాలు

ఆంధ్ర మహాభారతము – ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
                                         
                                        సత్యా ద్రౌపదీ సంవాదము

సీ|| నీప్రి భర్తల నిర్మల చరితులఁ బ్రకటతేజుల లోకపాలనిభులఁ
      బార్థుల నీ వొకభంగిన వదలక చెలువ యెబ్భంగి భజింతు దగిలి
      యొక్కఁ డొక్కని కంటె నువిద నీ కేవురు ననురక్తు లగుట యత్యద్భుతంబు
      నగు మొగంబుల కాని నలినాక్షి నిదెసఁ బతులకుఁ గింకిరిపాటులేదు
తే|| వ్రతముపెంపొ మంత్రౌషధవైభవంబో
      సరసనైపథ్యకర్మ కౌశలమొ చతుర
      విభ్రమోల్లాసరేఖయో వెలఁది నీవి
      శేషసౌభాగ్య హేతువు చెపుమనాకు. (291)
(కింకిరిపాటు = ఏవగింపు ; పార్థులన్ = పాండవులను)

క|| ఏనును నీవలన నిజము
      గా నిది యంతయును నెఱిఁగి కమలదళాక్షుం
      బూని వశగతునిఁ జేసి య
      నూన స్నేహను భోగయుక్తిఁ దలిర్తున్. (292)

క||| అని యడిగిన మది నించుక
       గినుక వొడమ నడఁచుకొనుచుఁ గృష్ణ మృదులహా
       సిని యగుచుఁ గృష్ణభామినిఁ
       గనుఁగొని యిట్లనియెనిర్వికారాకృతి యై. (293)

క|| నను నిట్లు దుష్టవనితా
      జనమునటులు గాఁ దలంపఁ జనునే నీకున్
      మన సొప్పదు పురుషోత్తము
      వనితవు గాఁ దగవు నీవు వనరుహనయనా. (294)

వ|| అని మేలంపుఁజందంబున దానివివేకహీనత యెఱుకపడ నాడి పాంచాలి మఱియు ని ట్లనియె. (295)

చ|| అలయక మంత్రతంత్రవివిధౌషధభంగులఁ జేసి యెంతయున్
      వలతురు నాథు లంట మగువా కడు బేలతనంబు దాన మున్
      గలిగిన ప్రేమయుం బొలియుఁ గాని యొకండును సిద్ధిఁ బొంద ద
      ప్పొలఁతులతోడిమన్కి యహిపొత్తుగఁ జూచు విభుం డెఱింగినన్. (296)
( అలయక =  కష్టపడక, అలసటపడకుండా; పొలియు = నశించు, చచ్చు, చెడు; మన్కియ(మనకి) = జీవనము;    అహిపొత్తుగ=పాముతో స్నేహము)

చ|| మగువ యొనర్చువశ్యవిధి మందులు మాయలు నొండుచంద మై
      మగనికిఁ దెచ్చు రోగములు మానక మూకజడాదిభావముల్
      మొగి నొనరించు నద్దురితముల్ తనచేసినచేత లై తుదిన్
      జగమున కెక్కి నిందయును సద్గతిహానియు వచ్చు నింతికిన్. (297)
 (మొగిన్ = వరుసగా)

క|| కావునఁ బతుకలు నెప్పుడుఁ
      గావింపం దగదు కపటకర్మంబులు త
      ద్భావ మెఱిఁగి యనువర్తిని
      యై వనిత చరింప నదియ యగు నెల్లవియున్. (298)

వ|| పాండవులయెడ నే నెట్టిదాన నై యిట్టిసౌభాగ్యంబు నందితి నది నీకు నెఱింగించెద నేర్పడ వినుము. (299)

సీ|| పతు  లాత్మ నొండొక్కపడఁతులఁ  గలసిన నలుగ నెయ్యడల నహంకరింప
      మదముఁ బ్రమాదంబు మాని వారికిఁ జిత్త మేకముఖంబుగ నెల్లప్రొద్దు
      భక్తిసేయుదుఁ జూపుఁ బలుకును గోర్కియుఁ జెయ్వును వింతగాఁజేయనెపుడు
      నమరగంధర్వయక్షాదులం దైనను బురుషు నన్యునిఁ దృణంబుగఁ దలంతు
తే|| స్నాన భోజన శయనాది సంప్రయోగ
      మర్థిఁ బతులకు ము న్నెందు నాచరింపఁ
      బతులు వచ్చిన నాసనపాద్యవిధుల
      భక్తితో నేన కావింతుఁ బనుప నొరుల. (300)
 (ప్రమాదము = పొరపాటు; చెయ్వు= కార్యము)

చ|| తగియెడు వేళలందు నియతంబుగ మజ్జనభోజనక్రియల్
      తగ నొడఁగూర్తు భర్తలకు ధాన్యధనంబులు రిత్తమై వ్యయం
      బగుటకు నొర్వ నెప్పుడు గృహ స్థల భాండవిశోధనంబు లి
      మ్ముగ నొకనాఁడు నేమఱఁ బ్రమోదము సల్పుదు బంధుకోటికిన్. (301)

క|| పలుమాఱుం దలవాకిట
      మెలఁగుట యసతీజనైకమిత్రత కలహం
      బుల కెలయుట నగుపలుకులఁ
      బెలుచ నగుట నాకుఁ గానిపేరివి మగువా. (302)
 (అసతీజనఏకమిత్రత = కులటలతోడి స్నేహము; ఎలయుట+ఆసక్తిపడుట)

క|| పతు లిచ్చమెయిఁ బ్రవాస
      స్థితు లైనం బుష్పగంధదీప్తాభరణ
      ప్రతతి ధరియింపఁ దద్గత
      మతి నగుచుఁ దదాగమంబ మదిఁ గాంక్షింతున్. (303)

ఉ|| అత్తకు భక్తి గల్గి మది నాయమ చెప్పినమాడ్కి జీవికా
      వృత్తము లావహింతు గురు విప్రజనాతిధిపూజనంబు ల
      త్యుత్తమభక్తి  నేన తగ నోపి యొనర్తుఁ బ్రియంబుఁ దాల్మియున్
      మెత్తఁదనంబు సన్మతియు మేలుగఁ దాల్తు సమస్తభంగులన్. (304)

క|| కడుమృదువు లనుచుఁ దేఁకువ
      సెడి యెపుడుఁ జరింప భరతసింహులు గోపం
      బడరిన నాశీవిషముల
      వడవునఁ గ్రూరు లని వెఱపు వదలక కొల్తున్. (305)
 (తేకువచెడి=భయమువీడి; ఆశీవిషములవడువునన్=పాములవలె)

సీ||మాయత్తఁ బృథ్వీసమానఁ బృథాదేవిఁ గుంతిభోజాత్మజఁ గోమలాంగి
     సతతంబు భోజనస్నానాదికములయం దిమ్ముగఁ బరిచర్య యేన చేసి
     సంప్రీతఁ జేయుదు జనవంద్యుఁ డగుధర్మతనయునిబంతి నిత్యంబుఁ బసిఁడి
     పళ్లెరంబులఁ గుడ్చుబ్రాహ్మణు లతిపుణ్యు లెనిమిదివేలు సమిద్థమతులు
తే||యతులు పదివేలు వారల కనుదినంబు
     నన్నపానంబు లర్హసహాయ నగుచు
     నొడికముగ నేన కావింతు నుచిత వస్త్ర
     భూషణాదులఁబరితోషముగ నొనర్తు.  (306)
 (ఒడికముగన్=ఇంపుగా)

వ|| మఱియు ధర్మరాజు నగరియందుఁ గనకమణిమయభూషణాలంకృతు లయినపరిచారకులు  నూఱువేలు రేయును బగలును బాత్రహస్తు లై యభ్యాగతభోజనంబు లొడఁగూర్చువారు నందఱ కలరు వీరెల్ల నిట్టిట్టిమెలఁకువ  మెలంగుదురని తత్కృతాకృతంబులేనయెఱుంగుదు నిరంతరమదధారాతరంగిత కపోలంబులయిన భద్రగజశతసహస్రంబులుఁ బ్రభూతజవసత్వసన్నుతంబు లయినయుత్తమాశ్వ శతసహస్రంబులుం గలవు వానికి నన్నింటికి నిత్యోచితంబులైన ఖాద్యంబులొనరింపను బాలింపను దగినవారి నేన నియమింతు నఖండభాండాగారపూరితంబులైన యగణ్య మణికనకాది వస్తువులును బ్రతిదినవిహితంబు లయిన యాయవ్యయంబులు నాయెఱుంగనియవియు లేవు గోపాలజనంబులు  తుదిగాఁ గలసకల భృత్యజనంబుల జీవితంబుల నరసి యేన నడపుదుం బరమయశోధనులగుపాండు నందనులు నిజకుటుంబభారంబు సర్వంబు నాయంద సమర్పించి తారు నిర్భరు లై యిష్టవిహారంబుల నుండుదు రే నెల్ల వెంటల నప్రమత్త నై వర్తింతు. (307)
 (Lady CEO with excellent administrative skills – HR, Finance, Store keeping, Hospitality, Animal husbandry, Vigilance – Abala kaadu Sabala – Classic example.)

ఆ|| వేగ జాము గలుగ వెడనిద్రఁ బొందుదుఁ
       గాని రాజ్యభారకార్యయుక్తి
       నబ్జనయన నాకు నాహారనిద్రల
       కెడయు లేదు సువ్వె యెల్ల ప్రొద్దు. (308)

ఆ|| ఇట్టివర్తనముల నెపుడుఁ బాండవులకుఁ
       దగిలి ప్రియము సేయఁ దగితిఁ గాని
       మగువ నీవుచెప్పు మందులు
       మంత్రంబు లింద్రజాలములును నే నెఱుంగ. (390)

వ|| అనిన విని లజ్జాకలితచిత్త యగుచు సత్యభామ పాండవభామిని కిట్లనియె. (310)

క|| ఏ నెఱుఁగమి నిట్లడిగితి
      నానేరమి సైఁప వలయు నగవుగఁ గొనుమీ
      మానిని నపలుకులు స
      న్మానితము భవచ్చరిత్రమహిమ ధరిత్రిన్. (311)

వ|| అనినం బాంచాలి మందస్మితానన యగుచు నది యట్ల కాక యని పలికి మఱియు ని ట్లనియె. (312)

                          ద్రౌపది సత్యభామకుఁ బతివ్రతాధర్మంబులు చెప్పుట

క|| పతిమనసు నాఁచికొనియెడు
      చతురోపాయంబు నీకుఁ జపలాక్షి సుని
      శ్చితమతిఁ జెప్పెద విను మూ
      ర్జితమును ధర్మాన్వితము సుశీలంబును గాన్. (313)
(ఆచికొనియెడు = ఆకర్షించు; ఊర్జితము= గట్టి;   ధర్మాన్వితము= ధర్మతో కూడుకున్నది )

చ|| పతిఁ గడవంగ దైవతము భామల కెందును లేదు ప్రీతుఁ డై
      పతి కరుణించెనేనిఁ గలభాషిణి భాసుర భూషణాంబరా
      న్వితధనధాన్యగౌరవము విశ్రుత్సంతతియున్ యశంబు స
      ద్గతియును గల్గు నొండుమెయిఁ గల్గునె యిన్ని తెఱంగు లారయన్. (314)
 (కడవంగన్=మించి; కలభాషిణి=మధురముగ పలుకుదానా; మెయిన్= )

ఆ|| కరము దుఃఖపడినఁ గాని యొక్కింత సౌ
      ఖ్యంబు ధర్మగతియుఁ గలుగ దెందుఁ
      జూడు మబల భర్తృ శుశ్రూషఫలముసం
      తతసుఖంబు నంద ధర్మువొదవు. (315)

క|| కావున నిత్యము సమ్య
      గ్బావము ప్రేమంబు వెరవు భక్తియుఁ బ్రియముం
      గావింపుము నీప్రియునెడ
      భావమెఱిఁగియతఁడు తాన పై బడి మరగున్. (316)

మ|| వనజాక్షుండు కడంగి నీ దగుగృహద్వారంబు చేరంగ వ
 చ్చె ననంగా విని లెమ్ము సంభ్రమముతోఁ జె న్నొందునభ్యంతరం
 బునకున్ వచ్చిన నాసనాదికరణంబుల్ దీర్పఁ దత్తజ్జనం
 బు నియోగించితి నంచు నుండక ప్రియంబుల్ చేయు మీవుం దగన్. (317)

చ|| తివిరి మురారి నీకుఁ గడుఁ దీపుగఁ జెప్పినపల్కు గల్గినం
      గువలయనేత్ర నీమనసుగూడినవారికి నైన నెప్డుఁ జె
      ప్ప వలదు దాన నొండొక నెపంబు ఘటింతు రెఱింగి రేని నీ
      సవతులు కృష్ణుబుద్ధి విరసం బగు నీదెసఁ దత్ప్రయుక్తిచేన్. (318)
 (విరసంబు=అప్రియము)

చ|| పతికి ననుంగు లైనతగుబంధుల మిత్రుల భోజనాదిస
      త్కృతముల నాదరించుచు నకృత్రిమభక్తి విశేష సంతతో
      త్థితమతి వై చరింపుము తదీయహితేతరవృత్తు లైనవా
      రతివ భవత్సుహృజ్జనము లైనను గైకొన కుండు మెప్పుడన్. (319)

క|| విను ప్రద్యుమ్నాదిభవ
      త్తనయులయెడ నైన నేకతంబున నేకా
      సనమున నుండుట దూష్యం
      బనియెఱుఁగుము సతులచరిత లతిదుష్కరముల్. (320)

క|| కులవతులును సతులును ని
     ర్మలమతులును నయినయట్టిమగువలతోడం
     జెలిమి యొనరించునది దు
     ర్విలసితవనితాభియుక్తి విడువుము తరుణీ. (321)
    (దుర్విలసితవనితాభియుక్తి=దుష్ట స్త్రీల స్నేహము)

వ|| ఇది నీకుఁ బరమసౌభాగ్యమూలం బయినయుపాయం బనినం బ్రీతచిత్త యై సత్యభామ యిట్లనియె. (322)

సీ|| నీవు ధర్మజ్ఞవు దేవసన్నిభులు నీభర్తలు మహనీయకీర్తి ధనులు
      ధైర్యతేజోబలశౌర్యసంపన్నులు కావున వీరికి నేవిధమున
      ధారుణీరాజ్యంబు చేరెడుఁ దడయక మీ కెగ్గు సేసినలోకనింద్య
      చరితుండు కౌరవధరణీశువనితలు దిక్కు లే కలమటఁ బొక్కుచుండఁ
తే|| గని ముదంబునఁ బొందెదు వనిత నీవు
      సుతుల నత్యంతనిర్మలమతుల శౌర్య
      యుతులఁ గాంచిన సద్గుణాన్వితవు వగపు
      వలదు చిత్తంబులో నీకు జలజనయన. (323)
      (తడయక= ఆర్ద్రతలేకుండా – దయలేకుండా; అలమటన్= చింతతో ; పొక్కుచుండ = దుఃఖించుచుండ)
****