ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల
రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము
(1994) ఆధారముగా.]
1.
ధృష్టద్యుమ్నుని కొడుకు ఎవరు?
2.
వృషసేనుడెవరు? ఎవరి చేతిలో చనిపోయాడు?
3.
మలయధ్వజుడెవరు? ఎవరి చేతిలో చనిపోయాడు?
4.
కర్ణుని జెండా ఏమిటి?
5.
17వ రోజు రాత్రికి మిగిలిన పాండవ సైన్యం
ఎంత? కౌరవ సైన్యం ఎంత?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. ధృతవర్ముడు – ఇతడు అర్ధరధుడు. చిన్నతనంలో తిరుగుబోతు అయి శస్త్రాస్త్ర పరిశ్రమ చేయలేదు.
ఉద్యోగపర్వము – చతుర్థాశ్వాసము –
263 పద్యము
క॥అతనిసుతుఁ డర్ధరథుఁ డా
ధృతవర్ముఁడు పిన్నవాఁడు త్రిమ్మటకాఁడై
మతిహీనత శస్త్రాస్త్ర
ప్రతతిపరిశ్రమము లేక పలసుఁ డగుటన్.
(263)
2.
కర్ణుని కొడుకు – అర్జునిచేత
– కర్ణపర్వము –
తృతీయాశ్వాసము – 246 పద్యము
మ॥భ్రుకుటిస్ఫూర్జితఫాలభాగుఁ డగుచుం బొంగారి
యాసూతపౌ
తకు కోదండము బాహుదండములుఁ జిత్రస్ఫూర్తిఁ
దున్మాడి మ
స్తక ముగ్రోద్ధతిఁ గ్రూరభల్ల విలాసద్ధారాహుతిం
ద్రుంచె బా
ణక ళాదుర్దముఁ డన్నరుండు పతియు న్రాధేయుఁడుం జూడగన్.
(246)
3.
అర్జునుని మామ – అశ్వత్థామ
చేతిలో 17వ రోజున చనిపోయాడు. ఇతడే బభ్రువాహనుని
మాతామహుడు. –
కర్ణపర్వము – ద్వితీయాశ్వాసము – 323 వచనము
వ॥…. యాద్రవిడేశ్వరుండు సామజంబు నుద్దామగతిం దఱిమి భీమాభిరామం బైన తోమరంబు వైచిన
మణిగణోజ్జ్వలం బైన యాద్రౌణిశిరొభూషణంబు
ధరణింబడినఁ ద్రొక్కంబడిన భుజంగంబుపోలికం గనలి
యబ్బలుమగండు తత్పార్శ్వవర్తుల నార్వుర రథికవరులఁదద్వేండంబు
తుండంబును
జరణచతుష్టయంబును నమ్మేదినీపతిపాదమ్బులుఁ
గరంబులు శిరంబులు నతితీవ్రభల్లంబులం
దునుమాడిన నద్దిక్కుమూఁకలు విచ్చెం గురుభూవరుం
డమ్మహీసురవరుం జేరం జని యగ్గించె
నప్పుడు. (323)
4.
హస్తికక్ష్య (ఏనుఁగు
నడుము మోకు) - కర్ణపర్వము – ప్రథమాశ్వాసము – 60 పద్యము
సీ॥తళతళ మనియెడు ధవళ ప్రభలతోడ
ఘనకేతువున హస్తికక్ష్య మెఱయ
హంసవర్ణము లైనహయముల పటుగతి నర్కప్రభం
బగునరద మొప్ప
దీప్తకాంచనరసలిప్త మై చెలువొందుసజ్యకార్ముకము
హస్తమున వెలుఁగ
వీటికి సమరసమాటోప మొదవ నాభీలశంఖము తన మ్రోలమ్రోయ
తే॥రణసముత్సాహలక్ష్మి వక్త్రమున
వింత
చెన్ను
వెలయింప నాప్తులుచేరి రెండు
పక్కియలయందు
బవరంపుఁబలుకు లెసఁగ
నడవసొంపాఱి కర్ణుండు వెడలె నధిప.
(60)
5.పాండవ సైన్యం - 6వేలు రథాలు; 3వేలు ఏనుగులు; లక్ష గుర్రములు; ఒక కోటి కాల్బలము
కౌరవ సైన్యం – 11 వేలు రథాలు;
10 వేల 7 వందలు ఏనుగులు; 2 లక్షలు గుర్రములు; 3 కోట్ల
కాల్బలము. – శల్యపర్వము
– ప్రథమాశ్వాసము –
113వచనము
వ॥….ధృతరాష్ట్రుం డప్పటికి మనకుఁ బాండవులకుం గల సేనాంగంబులకొలంది యెఱింగుపు మనవుడు
సంజయుండాజనపతి కి ట్లను మనకుఁ బదునొకండువేలు
రథంబులును బదివేలునేడునూఱు
గజంబులును రెండులక్షలు హయంబులును మూఁడుకోట్లు పదాతులును
వారికి నాఱువేలు
రథంబులును మూఁడువే లేనుంగులును లక్షగుర్రంబులును గోటికాల్బలంబులును గలిగియుండె
నయ్యొడ్డనంబు లొండొంటి గెలుచు నగ్గలిక డగ్గఱియె నట్టియెడ.
(113)
*******
No comments:
Post a Comment