Translate

12 September, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 91 (451- 455)



ఓం గణేశాయనమః గురుభ్యోనమః  
 __/\__
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్||

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]

1.   ఎవరి ప్రేరణతో ధర్మరాజు అశ్వమేధయాగానికి పూనుకొన్నాడు?

2.  యాదవ వినాశాన్ని గురించి ధర్మరాజుకు తెలిపిన దెవరు?
3.  ధర్మరాజు నరకం చూడటానికి కారణం ఏమిటి?
4.  మహాప్రస్థానానికి బయలుదేరిన వారెంత మంది? ఎవరు?
5.  విరాటుని దేశం పేరేమి?
-----------------------------------------------------------------------------------------------

సమాధానములు (జవాబులు):
1. 17వ రోజున కర్ణుని చంపకుండా వచ్చా డర్జునుడని తెలిసి ఆ గాండీవం కృష్ణునకియ్యి అన్నాడని, తన  
    గాండీవం ఎవరి కయినా ఇమ్మని ఎవరంటే వారిని చంపుతానని అర్జునుని ప్రతిన. కర్ణపర్వము 
     – తృతీయాశ్వాసము – 67&68పద్యములు 
     సీఅనినఁ గృపాణంబు గొని సవ్యసాచి యవ్విభు వ్రేయఁ దలఁచిన విష్ణుఁ డెఱిఁగి
         వాలు కేల నమర్ప వలసినకత మేమి కౌరవు లియ్యెడ లేరు మనము
         ధరణీశ్వరునిసేమ మరయంగ వచ్చితి మీతనికుశల్ మి ట్లేర్పడంగఁ
         గంటిమి సంతోషకాలంబు గా కిది క్రోధకాలమె వధ్యకోటి యిచట
     నేది కాఁగ నలిగి తీ వని పలికిన
         రూక్షభంగి యగుకటాక్షదృష్టి
         యనరేంద్రుమీఁద నడరంగ నర్జునుఁ
         డమ్మురారి కిట్టు లనియె నధిప. (67)
     విను మొరులకు గాండివ మి
         మ్మని న న్నెవ్వండు పలికె నతనిశిరము గ్ర
         క్కునఁ బగులవ్రేయుటకుఁ జే
         సినవాఁడఁ బ్రతిజ్ఞ నాదుచిత్తములోనన్. (68)

2.    దుశ్శాసనుడు కర్ణపర్వము తృతీయాశ్వాసము -227పద్యము 
     ||జనపతియుఁ గృపప్రముఖులుఁ
        గనుఁగొన ని ట్లనిలసుతుఁడు గ్రౌర్య మొడల్ గై
        కొనినట్లు పేర్చి దుశ్శా
        సనుఁ జంపుటఁ జూచి రోషసంరంభమునన్. (227)

3.    ఆనందపదం తిక్కన తన భారతాన్ని హరిహరనాధునకు అంకితమిచ్చాడు.  అతడు బ్రహ్మానంద ప్రదాత.   
     దానికి సూచకంగా ఆనందపదం ప్రయోగిస్తాడు.  కావ్యానందం కూడా బ్రహ్మానంద సహోదరమని.
      మాలినిఅవగమితరహస్యాష్టాంగసమ్యక్ప్రకారో
                  త్సవగురుకరుణావిస్తార గాఢప్రశాంతి
                  ప్రవణహృదయపద్మోద్భాసివిజ్ఞానసారా
                  వ్య్వహితపరమానందానుభూత్యేకరూపా. (ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము -428 పద్యము)
      మాలినిక్షరణరహితవృత్తీ గ్రాహ్య భక్తిప్రవృత్తీ
                  కరణగమనలీలా గాఢకరుణ్యశీలా
                  స్మరణశుభదమూర్తీ మధ్యరశ్మిప్రవర్తీ
                  చరణవినమదింద్రా సంతతానందసాంద్రా. (భీష్మపర్వము తృతీయాశ్వాసము – 455 పద్యము)
       మాలినిఅమృతమయవిలాసా యాగభోగొద్వికాసా
                   విమలహృదయరమ్యా వీతరాగాదిగమ్యా
                   కమలభవనమస్యా గౌరవాధిక్యశస్యా
                   శమదమపరివర్తీ శాశ్వతానందమూర్తి. (ద్రోణపర్వము పంచమాశ్వసము -435పద్యము)
        మాలినికరణఫలపరిత్యాగవ్రతోదాత్తచేతః
                     పరిణతసుఖపీఠ భ్రాజమానా నతాంహో
                     నిరసన చరణాబ్జోన్నిద్రతారాజమానా
                     నిరవధిపరినణాహా నిర్భరానంద దేహా.  (కర్ణపర్వము తృతీయాశ్వాసము – 401 పద్యము)

4.    కౌమోదకి ఆదిపర్వము అష్టమాశ్వాసము 254 వచనము.
      ……. సహస్రకరసహస్ర దుస్సహమహఃపటలభాసురం బగుచు దేవ దైత్య దానవ యక్ష రాక్షస పిశా  
          చోరగప్రశమనంబయి వెలుంగు చున్నసుదర్శనం బను చక్రమ్బును గౌమోదకి యనుగదయను  
          నారాయణున కిచ్చె నట్లు సంప్రాప్తదివ్యచాపరథాయుధు లయి యున్ననరనారాయణులం జూచి యగ్ని 
         దేవుం డి ట్లనియె.  (254)

5.    పృషతుడు ; కోకిలాదేవి ఆదిపర్వము పంచమాశ్వాసము 196 వచనము & ఆదిపర్వము    
    సప్తమాశ్వాసము 17 వచనము
       మఱియు ననంతరంబ భరద్వాజసఖుం డైనపృషతుం డనుపాంచాలపతి మహా ఘోరతపంబు సేయుచు
            నొక్కనాఁడు దనసమీపంబున వాసంతికాకుసుమాపచయవినోదంబున నున్నయప్సరస మేనక  
            యనుదానిం జూచి మదనరాగంబున రేతస్స్కందం బయిన దానిం దనపాదంబునఁబ్రచ్ఛాదించిన  
            నందుద్రుపండనుకొడుకు మరుదంశంబునఁ బ్యఉట్టిన వని భరద్వాజాశ్రమంబునం బెట్టి చని పృషతుండు 
            పాంచాలదేశంబున రాజ్యంబు సేయు చుండె…….(196)
        అయ్యాజుండును యాజకత్వంబున కొడంబడి నీకోర్కికిం దగినయట్టికొడుకునుం గూఁతురుం బుట్టుదు రోడ             కుండు మనిన యజ్ఞోపకరణద్రవ్యంబులు సమకట్టికొని యథావిధి నుపయాజుండు సహాయుండుగా
            సౌత్రామణి యయినకోకిలాదేవి పత్నిగా ద్రుపదుండు పుత్రకామేష్టిసేయించిన నందు మంత్రాహుతులు
            దృప్తుం డయినయగ్ని దేవువలన. (17)

No comments:

Post a Comment