స్టాట్యూ ఆఫ్ లిబర్టి....(Statue of Liberty)
లిబర్టి ఐలెండ్, న్యూయార్క్ హార్బరు.
రూపకల్పనా శిల్పి....ఫ్రెడరిక్ అగస్టి బర్టహోల్డి (Frederic Auguste Bartholdi - French Sculptor)
విగ్రహం ఎత్తు....46 మీటర్లు
మొత్తం ఎత్తు [పీఠంతో కలిపి]....93 మీటర్లు
రోమను దేవత లిబర్టాస్ (Libertas) ప్రతిరూపము...అమెరికాకు ఫ్రాన్సు ప్రజల బహుమానం
పైన మలచబడిన రాగి [వాతావరణ రసాయనక మార్పుల వలన] ఆకుపచ్చరంగు పొందటము వలన విగ్రహము ఆకుపచ్చగా కనిపిస్తుంది.
చేతిలోని కాగడా జ్యోతి బంగారు వర్ణంలో ఉంటుంది.
అక్టోబరు 28, 1886 న ప్రతిష్టింపబడి 1938, 1984-86, 2011-12లలో జీర్ణోద్ధరణ పనులు చేయబడి నేటీకి లక్షలాది యాత్రీకులకు కనువిందుకావిస్తూ అబ్బురపరుస్తున్నది.
ఫెర్రీలో వెళ్లి చూడాలి. ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.00 గంటలవరకు ఫెర్రీ సదుపాయమున్నది. పెద్దలకు-25,పిల్లకు-16, 62 సంవత్సరములు దాటితే-21 డాలర్లు [రానుపోను- ఐలిస్(Ellis) ఐలండుకు కలిపి]
ఐలిస్ ఐలండ్ లో ఇమిగ్రేషన్ మ్యూజియములో తొలుదొల్త వలస వచ్చిన వారి రికార్డులు, నాటి వారి లగేజి పెట్టెలు, వస్తువులు కొన్ని ప్రదర్శనలో చూడవచ్చు. ముఖ్యంగా తమ వంశీకుల వివరాలు [మూలాలు] కంప్యూటరుల ద్వారా వెతికి తెలుసుకోవచ్చు.
ఫెర్రి ఎక్కడానికి మటుకు అంతర్జాతీయ విమానాశ్రయములలో జరిపే భద్రతాపరమైన సోదా జరుపబడుతుంది. గాజులు,బెల్టుతో సహా తీసి టే్రలో పెట్టాలి.
No comments:
Post a Comment