Translate

02 December, 2014

హనుమత్ బడబానల స్తోత్రమ్



హనుమత్ బడబానల స్తోత్రమ్

ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్రమంత్రస్య శ్రీరామచంద్రఋషిః శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్ధం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం సీతారామ చంద్ర ప్రీత్యర్ధం హనుమద్బడబానల స్తోత్ర జపమహం కరిష్యే.

ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే శ్రీమహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిఙ్మండల యశోవితాన ధవళీకృత జగత్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉమా ఆనలమంత్ర ఉదధిబంధన దశశిరః కృతాంతక సీతా శ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీరామలక్ష్మణానందకర కపిసైన్య ప్రాకార సుగ్రీవ సహాయ్యకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారీ గంభీరనాద సర్వ పాపగ్రహ వారణ సర్వజ్వరోచ్చాటన డాకినీ విధ్వంసన ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వ దుఃఖ నివారణాయ గ్రహ మండల సర్వ భూతమండల సర్వపిశాచ మండలోచ్చాటన భూతజ్వరై కాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహిక జ్వర చాతుర్థిక జ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ చింధి చింధి భింది భింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ ఓం హ్రాం శ్రీం నమో భగవతే శ్రీ మహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి ఓం హం ఓం హం ఓం హం ఓం నమోభగవతే శ్రీ మహా హనుమతే శ్రవణ చక్షుర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వ విషం హరహర ఆకాశ భువనం భేదయ భేదయ చేధయ చేధయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకల మాయాం భేదయ భేదయ ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా హనుమతే సర్వ గ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన మోక్షణం కురు కురు శిరఃశూల గుల్మశూల నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకు తక్షక కర్కోటక కాళియాన్ యక్షకుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్పాన్నిర్విషం కురు కురు స్వాహా రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యా చ్ఛేదయ చ్ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశతౄన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హూం ఫట్ స్వాహా 
__/\__

01 December, 2014

మసనోబు ఫుకుఓకా కస్తూరి పలుకులు(4)

మసనోబు ఫుకుఓకా గారి గడ్డిపరకతో విప్లవం పుస్తకమునుండి సేకరించబడినది

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 011 (051 – 055)

ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
__/\__

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1. గాండీవం అర్జునకు ఎవరిచ్చారు?
2. ఎవరి దోషం వల్ల ధృతరాష్ట్రుడు పుట్టిగ్రుడ్డి అయ్యాడు?
3. ద్రౌపది గాక భీమునికి ఎందరు భార్యలున్నారు? వారి పేర్లేమి? వారి వలన కలిగిన పుత్రుల పేర్లేమి?
4. శంతనుని అన్నగారి పేరేమి? అన్న ఉండగా శంతనునికి రాజ్యం ఎలా వచ్చింది?
5. అక్షౌహిణి అంటే ఏమిటి?
-----------------------------------------------------------------------------------------------------------------

సమాధానములు (జవాబులు):

1. వరణుడు. – ఖాండవ వనదహనానికి ముందు అగ్నిహోత్రుడు వరుణిని తలచుకొని, వరుణకు సోము డిచ్చిన
    బ్రహ్మ నిర్మితమయిన గాండీవాన్ని అర్జునుకిమ్మంటాడు; అపుడు అక్షయ తూణీరం అర్జునకూ; చక్రము, గద
    కృష్ణునికి వచ్చాయి. – ఆది పర్వము – అష్టమాశ్వాసము- 252 వచనము & 253 పద్యము.


అనిన నగ్ని దేవుండప్పుడు వరుణం దలంచి వానిం దనకు సన్నిహితుంజేసికొని తొల్లి నీకు సోముం డిచ్చిన
    బ్రహ్మనిర్మితకార్ముంకంబు నక్షయబాణతూణీర యుగళంబును గంధర్వజహయంబులం బూనిన రథంబు
    నియ్యతిరథుండయిన యర్జునున కిమ్ము మఱి చక్రంబును గదయును వాసుదేవున కి మ్మని పంచిన. (252)
అమరాహీంద్రవియచ్చరాదుల క జేయంబప్రధృష్ట్యం బభే
      ద్యము వజ్రస్థిర మన్యసాధనభిదాదక్షంబు నై సర్వలో
      కమనోజ్ఞం బయిదివ్యమై వెలుఁగునగ్గాండీవ మన్ చాపర
     త్నము నిచ్చెన్ వరుణుండు పార్ధునకు నుద్యద్విక్ర మోద్భాసికిన్. (253)

2. మాతృ దోషం వల్ల.  వ్యాసుని  రూపం చూసి అంబిక కళ్ళు మూసుకుంది.  అందుచేత జన్మించే కుమారుడు
    గ్రుడ్డివాడవుతాడని వ్యాసుడు చెపుతాడు. - ఆది పర్వము చతుర్థాశ్వాసము - 254 పద్యము & 255  
   వచనము.
మధ్యాక్కర||అవసరజ్ఞుం డయి వ్యాసు డేతెంచె నంత నత్తపసి
                 కవిలగడ్డంబును గవిలజడలును గవిలకన్నులును
                 దవినయన్నువనల్ల  నైనదీర్ఘపుందనువును జూచి
                 యువిద గన్నుంగవ మొగిచి తెఱవక యుండె భయమున. (254)
కృష్ణద్వైపాయనుండును దానికిం బుత్రదానంబు సేసి యీయంబికయందు బలపరాక్రమవంతుం  
    డయినకొడుకు పుట్టువాఁడు మాతృదోషంబున నంధుండగు ననిన విని విషణ్ణచిత్త యయి సత్యవతి 
    వెండియుం గృష్ణద్వైపాయనుం బ్రార్థించి యింక నంబాలికయం దొక్కకొడుకుం బడయు మని నియోగించిన 
    నెప్పటియట్ల యమ్మునివరుండు నంబాలికకడకుం జనిన నదియుందనవేషంబునకు వెఱచి వెల్లనై యున్న 
    నక్కోమలికిం బుత్రదనంబు సేసి యీయంబాలిక యందు మహాబలపరాక్రమగుణవంతుండు వంశకరుండు 
    నగుసుపుత్రుండు పుట్టు వాఁడును మాతృదోషంబునఁ బాండుదేహుం డగు నని చెప్పి యరిగిన. (255)
3.హిడింబ - ఘటోత్కచుడు; జ(ల)రంధర – సర్వగుడు. -  ఆది పర్వము – చతుర్థాశ్వాసము – 116 వచనము.
వ॥…భీమసేనునకు జర(ల)ధరకు సర్వగుండు పుట్టె……మఱియు భీమసేనునకు హిడింబకు
     ఘటోత్కచుండుపుట్టె…   (116)

4.దేవాపి. – ప్రతీపునికిశిబిపుత్రి యయిన సునందకు దేవాపి, శంతనుడు, బ్లాహికుడు అనిముగ్గురు కొడుకులు
   పుట్టిరి. పెద్దవాడు దేవాపి “నాకు రాజ్యమక్కరలేదని” అడవులకు తపస్సుకు వెళ్ళిపోయాడు.  అందుచే
   శంతనుడు రాజయ్యాడు. - ఆది పర్వము – చతుర్థాశ్వాసము –114 వచనము.
వ॥వానిపేరం గురుక్షేత్రంబు నాఁ బరఁగె నట్టికురునకు దాశార్హియైనశుభాంగికినివిదూరథుండు పుట్టె
     వానికిమాధవియయినసంప్రియకు ననశ్వుండుపుట్తె నయ్యనశ్వునకు మాగధియైనయమృతకుం
     బరీక్షితుండు పుట్టె వానికి బహుదనసుత యయినసుయశకు భీమసేనుండు పుట్టె
     వానికింగైకేయియయినకుమారికిఁ బ్రతిశ్రవసుండు పుట్టె వానికిఁ బ్రతీపుఁడు పుట్టెఁ బ్రతీపునకుశిబిపుత్రి యయిన
     సునందకు దేవాపి శంతను బాహ్లికు లనఁగా మువ్వురు పుట్టి రందు దేవాపిబాల్యంబునంద తపోవనంబున
     కరిగిన శంతనుండు రాజయ్యె వనికి గంగాదేవికి దేవవ్రతుం డైన భీష్ముండుపుట్టె….(114)

5.అక్షౌహిణి అనగా –21870 రధములు;21870 ఏనుగులు;65610 గుఱ్ఱములు;1,09,350 వీరభటులు(కాల్బలము)     కలిగిన సేన. (21870+21870+65610=1,09,350; మొత్తంసంఖ్య-8=9;1,09,350+1,09350=2,18,700=18=9)
   ఇటువంటి 18అక్షౌహిణుల సేన కురుక్షేత్ర యుద్ధములోపాల్గొంది.- ఆది పర్వము – ప్రథమాశ్వాసము – 81
   వచనము.
వ॥ఇరువదియొక్క వేయునెనమన్నూటదడెబ్బదిరథంబులు నన్నియేనుంగులునఱువదేనువేలునాఱునూటపది
     గుఱ్ఱంబులు లక్షయుం దొమ్మిదివేలున్ మున్నూటయేఁబండ్రువీరభటులును గలయది యొక్క యక్షౌహిణి
     యయ్యె నట్టియక్షౌహిణులు పదునెనిమిదింట సన్నద్ధు లై కురుపాండవులు యుద్ధంబు సేయుటం జేసి
     యాశమంతపంచకంబు కురుక్షేత్రంబు నాఁబరంగె నట్టి కురుక్షేత్రంబునందు. (81)
*******